హోమ్ /వార్తలు /బిజినెస్ /

Insurance: ఆ ఇన్సూరెన్స్‌ పాలసీలపై ఏప్రిల్‌ 1 నుంచి ట్యాక్స్‌ చెల్లించాల్సిందే.. ఇప్పుడు ఏం చేస్తే బెటర్..?

Insurance: ఆ ఇన్సూరెన్స్‌ పాలసీలపై ఏప్రిల్‌ 1 నుంచి ట్యాక్స్‌ చెల్లించాల్సిందే.. ఇప్పుడు ఏం చేస్తే బెటర్..?

Insurance: ఆ ఇన్సూరెన్స్‌ పాలసీలపై ఏప్రిల్‌ 1 నుంచి ట్యాక్స్‌ చెల్లించాల్సిందే..

Insurance: ఆ ఇన్సూరెన్స్‌ పాలసీలపై ఏప్రిల్‌ 1 నుంచి ట్యాక్స్‌ చెల్లించాల్సిందే..

Insurance: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకునే యోచనలో ఉన్నవారికి అలెర్ట్‌. యాన్యువల్‌ ప్రీమియం రూ.5 లక్షలకు మించి ఉన్న లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలకు 2023 ఏప్రిల్‌ 1 నుంచి పన్ను చెల్లించాలి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ (Life Insurance) పాలసీ తీసుకునే యోచనలో ఉన్నవారికి అలెర్ట్‌. యాన్యువల్‌ ప్రీమియం రూ.5 లక్షలకు మించి ఉన్న లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలకు 2023 ఏప్రిల్‌ 1 నుంచి పన్ను చెల్లించాలి. 2023-24 బడ్జెట్‌లో తీసుకున్న ఈ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే పేర్కొన్న తేదీ కంటే ముందు కొనుగోలు చేసిన ఏవైనా పాలసీలకు ఈ నియమం వర్తించదు. ఎవరైనా ఇన్వెస్ట్‌ చేసే ముందు నూతన నియమాల ప్రభావాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. ఎండోమెంట్ పాలసీని కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు కొత్త నియమం గురించి అర్థం చేసుకోవాలి.

* ఇన్సూరెన్స్‌ పాలసీలతో రక్షణ

బడ్జెట్‌లో ప్రకటించిన నిర్ణయం అధిక-విలువ, ట్రెడిషనల్‌ ఇన్సూరెన్స్‌లపై వినియోగదారులకు ఆసక్తిని తగ్గిస్తుంది. ఇదే సమయంలో టర్మ్ ప్లాన్‌లు, ప్యూర్‌ రిస్క్‌ కవర్‌లు, ఇన్వెస్ట్‌మెంట్‌-ఓరియెంటెడ్‌ యూనిట్ లింక్ ఇన్సూరెన్స్‌పై ఆసక్తి చూపే అవకాశం ఉంది. అయినప్పటికీ ఇన్సూరెన్స్‌ బెనిఫిట్స్‌ తగ్గుతాయని గుర్తించాలి.

ఉదాహరణకు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ గ్యారెంటీడ్ ఇన్‌కమ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో.. దీర్ఘకాలిక ఆదాయం, మెచ్యూరిటీపై హామీ ఇచ్చిన మొత్తాన్ని పాలసీదారుడు అందుకుంటాడు. డెత్‌ బెనిఫిట్‌ ఉంటుంది. కుటుంబ సభ్యుల భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది. ఇతర రకాల పెట్టుబడులతో పోలిస్తే ఇన్సూరెన్స్‌ బెస్ట్‌ ఆప్షన్‌ అని నిపుణులు చెబుతున్నారు. ఇన్సూరెన్స్‌ చేసిన వ్యక్తి కుటుంబానికి రక్షణ ఉంటుందని సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి : ఈ విధంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ చేస్తే మీకు బోలెడు లాభాలు.. అధిక రాబడి అందించే ప్లాన్‌ వివరాలివే!

* అధిక వడ్డీ పొందే అవకాశం

కొత్త నియమం హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌(HNI)పై, అలాగే విస్తృతమైన అవసరాలు ఉన్నవారిపై కూడా ప్రభావం చూపుతుంది. అందువల్ల అధిక విలువ కలిగిన పాలసీని కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అధిక ప్రీమియం పాలసీలను కొనుగోలు చేసే HNIలు 6.9 శాతం వరకు గ్యారెంటీడ్‌ ట్యాక్స్‌ ఫ్రీ యాన్యుటీలు పొందవచ్చు. ఇది సుమారుగా వడ్డీ రేటులో FDకి సమానం.

వార్షిక ఆదాయం రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య ఉన్న వ్యక్తికి 9.7 శాతం, రూ.1- రూ.2 కోట్ల మధ్య ఉన్న వ్యక్తికి సుమారు 10.2 శాతం, రూ.5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తికి సుమారు 11.1 శాతం లభిస్తుంది. ఈ రేట్లు సంబంధిత HNI చెల్లించే పన్నుపై సర్‌ఛార్జ్ శాతానికి దాదాపు అనుగుణంగా ఉంటాయి. 2023 మార్చి 31 వరకు అందుబాటులో ఉన్న ఈ అవకాశాన్ని HNIలు ఉపయోగించుకోవచ్చు. ఎంచుకున్న పాలసీని బట్టి తదుపరి 35-40 సంవత్సరాల వరకు అధిక వడ్డీ రేట్లను పొందవచ్చు.

* ఎఫ్‌డీలలో ఇన్వెస్ట్‌మెంట్‌?

భారతదేశంలో కేవలం 3 దశాబ్దాలలో బ్యాంక్ FDపై వడ్డీ రేట్లు భారీగా తగ్గాయి. 1991లో సుమారుగా 15 శాతం ఉండగా, 2021లో 6 శాతానికి చేరాయి. ఇందులో HNIల పెట్టుబడులకు 3-4 దశాబ్దాల వరకైనా అధిక ఆదాయం ఆశించే అవకాశం లేదు. కేంద్రం కొత్త ప్రతిపాదన ప్రైవేట్ బీమా సంస్థలు, పార్-పొదుపులలో అత్యంత ప్రజాదరణ పొందిన నాన్-పార్ సేవింగ్స్ వంటి నాన్-యులిప్ సేవింగ్స్ సెగ్మెంట్‌ను మాత్రమే ప్రభావితం చేస్తుంది.

యులిప్‌లు, టర్మ్ ప్రొటెక్షన్, యాన్యుటీలు ఇక్కడ కవర్ కావు. వాటిపై పన్ను రహిత ప్రయోజనాలు కొనసాగుతాయి. ఇప్పుడు చాలా మంది వ్యక్తులు తమ జీవిత బీమా పాలసీలను ముందే తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయా కంపెనీల వెబ్‌సైట్‌ల ద్వారా పాలసీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

First published:

Tags: Insurance, Life Insurance, Personal Finance

ఉత్తమ కథలు