హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bharat Gaurav Train: ఆంధ్రప్రదేశ్ మీదుగా షిరిడీకి భారత్ గౌరవ్ రైలు

Bharat Gaurav Train: ఆంధ్రప్రదేశ్ మీదుగా షిరిడీకి భారత్ గౌరవ్ రైలు

Bharat Gaurav Train: ఆంధ్రప్రదేశ్ మీదుగా షిరిడీకి భారత్ గౌరవ్ రైలు
(ప్రతీకాత్మక చిత్రం)

Bharat Gaurav Train: ఆంధ్రప్రదేశ్ మీదుగా షిరిడీకి భారత్ గౌరవ్ రైలు (ప్రతీకాత్మక చిత్రం)

Bharat Gaurav Train | ఆంధ్రప్రదేశ్ మీదుగా షిరిడీకి భారత్ గౌరవ్ రైలును ప్రైవేట్ ఆపరేటర్ నడపనున్నారు. కొయంబత్తూరులో బయల్దేరే టూరిస్ట్ రైలు (Tourist Train) మంత్రాలయం మీదుగా షిరిడీ చేరుకుంటుంది.

భారతీయ రైల్వే ప్రైవేట్ ఆపరేటర్ల సాయంతో కొత్తగా 'భారత్ గౌరవ్' రైళ్లను నడుపుతోంది. ఇప్పటికే రామాయణ సర్క్యుట్‌లో భారత్ గౌరవ్ రైళ్లు నడిపిస్తామని ప్రకటించింది. తాజాగా షిరిడీకి 'భారత్ గౌరవ్' రైలు నడిపేందుకు కసరత్తు చేస్తోంది. ఈ రైలు ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లనుంది. ఈ రైలు కొయంబత్తూర్ నుంచి షిరిడీ మధ్య నడవనుంది. భారతీయ రైల్వే భారత్ గౌరవ్ స్కీమ్ (Bharat Gaurav Scheme) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) రెండు రూట్లలో భారత్ గౌరవ్ రైళ్లను ప్రకటించింది. తాజాగా భారత్ గౌరవ్ స్కీమ్‌లో భాగంగా కొయంబత్తూర్-షిరిడీ మధ్య ప్రైవేట్ ఆపరేటర్ ఓ రైలును నడపనున్నారు. తొలి వీక్లీ ట్రిప్ జూన్ 14న ప్రారంభం కానుంది.

సదరన్ రైల్వే జనరల్ మేనేజర్ బీజీ మాల్యా ఇప్పటికే పొడనూర్ జంక్షన్‌లో భారత్ గౌరవ్ రైలును పరిశీలించారు. కొయంబత్తూర్ నుంచి షిరిడీకి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ప్రయాణించనుంది. మంగళవారం కొయంబత్తూర్‌లో బయల్దేరే భారత్ గౌరవ్ రైలుకు లోకో పైలట్లను, టికెట్ చెకింగ్ స్టాఫ్‌ను సదరన్ రైల్వే ఇవ్వనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ రైలు మంగళవారం కొయంబత్తూరులో బయల్దేరుతుంది. దారిలో తిరుప్పూర్, ఈరోడ్, సేలం, బెంగళూరు, మంత్రాలయం మీదుగా షిరిడీకి వెళ్తుంది. ఈ రైలు బుధవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్‌లోని మంత్రాలయం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.

IRCTC Shirdi Tour: హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో షిర్డీ టూర్... ప్యాకేజీ వివరాలివే

కొయంబత్తూరులోని సాయిబాబా కాలనీలో ఉన్న సాయిబాబా ఆలయంలో టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. సౌత్ స్టార్ రైల్ పేరుతో ఉన్న సంస్థ ఈ టూరిస్ట్ రైలును ఆపరేట్ చేస్తోంది. కొయంబత్తూరులో మంగళవారం సాయంత్రం 6 గంటలకు రైలు బయల్దేరుతుంది. ఈ రైలులో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, నాన్ ఏసీ బెర్తులు అందుబాటులో ఉన్నాయి. స్లీపర్ నాన్ ఏసీకి రూ.2,500, థర్డ్ ఏసీకి రూ.5,000, సెకండ్ ఏసీకి రూ.7,000, ఫస్ట్ ఏసీకి రూ.10,000 చెల్లించాలి. ఇందులో కొయంబత్తూర్ నుంచి షిరిడీకి, షిరిడీ నుంచి కొయంబత్తూరుకు రైలు ప్రయాణం మాత్రమే కవర్ అవుతుంది.

Bharat Gaurav Train: భారత్ గౌరవ్ ట్రైన్‌లో యోగా కోసం రెండు ప్రత్యేక కోచ్‌లు

ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. 3 రాత్రులు, 4రోజుల టూర్ ప్యాకేజీ ఇది. స్లీపర్ నాన్ ఏసీకి రూ.4,999, థర్డ్ ఏసీకి రూ.7,999, సెకండ్ ఏసీకి రూ.9,999, ఫస్ట్ ఏసీకి రూ.12,999 చెల్లించాలి. జీఎస్‌టీ అదనంగా చెల్లించాలి. ప్యాకేజీలో రైలు ప్రయాణం, ఏసీ గదిలో బస, షిరిడీలో ప్రత్యేక దర్శనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

First published:

Tags: Bharat Gaurav Train, IRCTC, Shirdi, Tourism, Travel

ఉత్తమ కథలు