దేశంలోని ప్రముఖ బ్యాంకులు వరుసగా వడ్డీరేట్లను పెంచుతున్నాయి. డిపాజిటర్లను ఆకర్షించడానికి ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఈమేరకు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ జాబితాలో తాజాగా నైనీటాల్ బ్యాంక్ లిమిటెడ్ (Nainital Bank) కూడా చేరింది. ఈ సంస్థను స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా, ఫిక్స్డ్ డిపాజిట్ల(FDs)పై వడ్డీ రేట్లను పెంచింది. సవరించిన వడ్డీ రేట్లు నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చినట్లు బ్యాంక్ వెల్లడించింది. నైనిటాల్ బ్యాంకు 7 రోజుల నుంచి పదేళ్ల కాలపరిమితి గల ఎఫ్డీలపై 3.25 శాతం నుంచి గరిష్టంగా 5.35 శాతం వరకు వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఈ బ్యాంక్ తాజాగా ‘నైని శతాబ్ది ప్లస్ డిపాజిట్-700 డేస్’ పేరుతో స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ (Fixed Deposits)ను లాంచ్ చేసింది.
* తాజా వడ్డీ రేట్లు ఇలా..
నైనీటాల్ బ్యాంక్ 7 రోజుల నుంచి 45 రోజుల FDలపై 3.25% వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. 46 రోజుల నుంచి 179 రోజుల ఎఫ్డీలపై 4.25%, 180- 270 రోజుల FDలపై 4.95%, 270 రోజుల నుంచి 1 సంవత్సరం లోపు కాలపరిమితి ఉండే డిపాజిట్లపై 5.05% వడ్డీ రేటును అందిస్తోంది. 1 సంవత్సరం నుంచి 18 నెలల ఫిక్స్డ్ డిపాజిట్లపై నైనీటాల్ బ్యాంక్ 5.75% వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. ఇక, నైనీ సెంటెనరీ డిపాజిట్ స్కీమ్ - 625 డేస్ కింద ఈ బ్యాంక్ 6.25% వడ్డీ రేటును అందిస్తోంది.
18 నెలల నుంచి మూడేళ్లలోపు కాలపరిమితి ఉండే FDలపై నైనీటాల్ బ్యాంక్ తాజాగా 5.60% వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. 3-5 సంవత్సరాల FDలపై 5.75%, ఐదేళ్ల నుంచి పదేళ్ల ఎఫ్డీలపై 5.35% వడ్డీని తాజాగా పొందవచ్చు. నైనీ ట్యాక్స్ సేవర్ స్కీమ్‌పై ఈ బ్యాంక్ 5.75% వడ్డీని అందిస్తోంది.
Online Shopping: ఇ-కామర్స్ సైట్లకు రేపటి నుంచి కొత్త రూల్స్
* డిఫెన్స్ అండ్ పారా మిలిటరీ పర్సనల్స్ కోసం..
డిఫెన్స్ అండ్ పారా మిలిటరీ పర్సనల్స్ కోసం నైనిటాల్ బ్యాంక్ సాధారణ ప్రజలతో పోల్చితే అదనంగా ఎక్కువగా వడ్డీని ఆఫర్ చేస్తోంది. 60 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారికి సాధారణ రేట్లపై 0.10% అదనపు వడ్డీ ఉంటుంది. 60 ఏళ్ల నుంచి 80 ఏళ్ల లోపు వారికి సాధారణ రేట్లపై 0.55% అదనపు వడ్డీ అందించనుంది. ఇక, డిఫెన్స్ అండ్ పారా మిలిటరీ పర్సనల్స్ వయసు 80 సంవత్సరాలు పైబడి ఉంటే సాధారణ రేట్లపై 0.65% అదనపు వడ్డీని బ్యాంక్ ఆఫర్ చేస్తోంది.
* కొత్త స్పెషనల్ FD స్కీమ్ వివరాలు..
కొత్త స్పెషల్ FD స్కీమ్.. నైనీ శతాబ్ది ప్లస్ డిపాజిట్ (కాలబుల్) -700 డేస్, నైనీ శతాబ్ది ప్లస్ డిపాజిట్ (నాన్ కాలబుల్) – 700 డేస్‌పై వడ్డీ రేట్లు వరుసగా 6.80%, 6.90% గా ఉన్నాయి. ఈ న్యూ స్కీమ్‌ను ఈ ఏడాది నవంబర్ 21న ప్రారంభించినట్లు బ్యాంక్ తన వెబ్సైట్లో పేర్కొంది.
* సీనియర్ సిటిజన్స్‌కు ఇలా..
నైని ట్యాక్స్ సేవర్ స్కీమ్ మినహా, వివిధ కాలపరిమితి గల ఎఫ్డీలపై వడ్డీ రేట్లు సాధారణ ప్రజలతో పోల్చితే అదనంగా 0.50% వడ్డీని ఆఫర్ చేస్తోంది. సూపర్ సీనియర్ సిటిజన్స్ (80 ఏళ్లు పైబడి)కు 0.60% (0.50% + 0.10%) అదనపు వడ్డీని అందిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.