హోమ్ /వార్తలు /బిజినెస్ /

Pension Rules: ప్రైవేట్ ఉద్యోగులకు పెన్షన్... రూల్స్ ఇవే

Pension Rules: ప్రైవేట్ ఉద్యోగులకు పెన్షన్... రూల్స్ ఇవే

Pension Rules: ప్రైవేట్ ఉద్యోగులకు పెన్షన్... రూల్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Pension Rules: ప్రైవేట్ ఉద్యోగులకు పెన్షన్... రూల్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Pension Rules | ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాదు ప్రైవేట్ ఉద్యోగులు కూడా ప్రతీ నెలా పెన్షన్ (Monthly Pension) పొందొచ్చు. ఇందుకోసం కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వస్తుంది. ప్రైవేట్ ఉద్యోగులు కూడా పెన్షన్ పొందొచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా పెన్షన్ ఇచ్చేందుకు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) నిర్వహిస్తోంది. ఉద్యోగులు అందరికీ సామాజిక భద్రత అందించడమే లక్ష్యంగా ఈపీఎస్ స్కీమ్‌ను నిర్వహిస్తోంది ఈపీఎఫ్ఓ. ఈ స్కీమ్ ద్వారా సంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగులు 58 ఏళ్లకు రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రతీ నెలా పెన్షన్ పొందొచ్చు. అయితే ఈ పెన్షన్ పొందడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటో, ఎవరికి పెన్షన్ వస్తుందో తెలుసుకోండి.

ఈపీఎస్ పెన్షన్ 1995 నుంచి అందుబాటులోకి వచ్చింది. అప్పటికి ఉన్న, ఆ తర్వాత చేరిన ఈపీఎఫ్ ఉద్యోగులకు ఈ పెన్షన్ స్కీమ్ వర్తిస్తుంది. ఈ స్కీమ్ ద్వారా ప్రైవేట్ ఉద్యోగులు పెన్షన్ పొందాలంటే కనీసం 10 ఏళ్లు సర్వీస్ ఉండాలి. వరుసగా పదేళ్ల సర్వీస్ లేకపోయినా ఫర్వాలేదు. కానీ మొత్తం సర్వీస్ 10 ఏళ్లు ఉండాలి. 10 ఏళ్ల సర్వీస్ ఉంటే సరిపోదు. 10 ఏళ్ల పాటు ఈపీఎఫ్ పెన్షన్ స్కీమ్‌లో కంట్రిబ్యూషన్ కూడా ఉండాలి. వారికి మాత్రమే 58 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత పెన్షన్ లభిస్తుంది.

Savings Scheme: రూ.95 చొప్పున పొదుపు చేస్తే రూ.13 లక్షల పైనే రిటర్న్స్... ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా?

ఇక ఈపీఎస్ పెన్షన్ స్కీమ్‌లో జమ చేసిన మొత్తాన్ని డ్రా చేయాలనుకుంటే కనీసం 50 ఏళ్ల వయస్సు ఉండాలి. ఇక పెన్షన్ తీసుకోవడాన్ని 2 ఏళ్లు వాయిదా వేసినట్టైతే వారికి 60 ఏళ్ల వయస్సు నుంచి పెన్షన్ వస్తుంది. సంవత్సరానికి 4 శాతం చొప్పున ఈపీఎస్ పెన్షన్ పొందడానికి అర్హత పొందుతారు. ఒకవేళ ఉద్యోగి కంపెనీ మారితే పెన్షన్ వర్తిస్తుందా లేదా అన్న సందేహం ఉద్యోగుల్లో ఉంటుంది.

ఉద్యోగి ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినప్పుడు రెండు ఫామ్స్ సబ్మిట్ చేయాలి. ఈపీఎఫ్ స్కీమ్స్‌లో మీరు సభ్యులు అని సర్టిఫై చేయడానికి ఫామ్ 11 సబ్మిట్ చేయాలి. ఇక మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను పాత కంపెనీ నుంచి కొత్త సంస్థకు మార్చడానికి ఫామ్ 13 సబ్మిట్ చేయాలి. ఒకవేళ ఒకే యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (UAN) ఉంటే, ఈపీఎఫ్ డేటాబేస్‌లో ఆధార్ నెంబర్‌తో లింక్ అయి ఉంటే ఫామ్ 11 సబ్మిట్ చేస్తే సరిపోతుంది.

LIC Plan: ఒక్కసారి ప్రీమియం కడితే కోటి రూపాయల వరకు బెనిఫిట్... ఎల్ఐసీ పాలసీ వివరాలివే

ప్రైవేట్ ఉద్యోగులు తమ బేసిక్ వేతనంలో ప్రతీ నెలా 12 శాతం ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ చేయాలి. కంపెనీ కూడా 12 శాతం ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ చేస్తుంది. కంపెనీ యాజమాన్యం జమచేసే 12 శాతంలో 3.67 శాతం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్‌లో, 8.33 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్‌లో జమ అవుతుంది. 0.50 శాతం ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ (EDLI) స్కీమ్‌లో జమ అవుతుంది. ఈపీఎఫ్ అడ్మినిస్ట్రేషన్ ఛార్జీలు 1.10 శాతం, EDLI స్కీమ్ అడ్మినిస్టేషన్ ఛార్జీలు 0.01 శాతం ఉంటాయి.

First published:

Tags: EPFO, Pension Scheme, Personal Finance

ఉత్తమ కథలు