Home /News /business /

PRIVATE COMPANY EMPLOYEE INCOME TAX CALCULATION 2022 REIMBURSEMENT PF GRATUITY HRA LTA GH VB

Tax Exemption: మీరు ప్రైవేట్ ఉద్యోగులా..? అయితే HRA, LTAపై ట్యాక్స్ మినహాయింపు ఎలా పొందాలో తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆదాయ పన్ను గణన కోసం వార్షిక CTC రూపొందించాల్సి ఉంటుంది. ఈ CTCలో గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్, ఇంటి అద్దె అలవెన్స్ (HRA), LTA, రీయింబర్స్‌మెంట్లపై పన్ను ఎలా విధిస్తారో తెలుసుకుందాం.

ప్రైవేట్ కంపెనీలో(Private Company) పనిచేస్తున్న ఉద్యోగులు(Employee) ఆదాయ పన్ను(Tax) గణన కోసం వార్షిక CTC రూపొందించాల్సి ఉంటుంది. ఈ CTCలో ట్యాక్స్ సంబంధించిన అంశాలు చాలా ఉంటాయి. LTA, HRA, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ కాంట్రిబ్యూషన్, ఎంటర్ ట్రైన్‌మెంట్ రీయింబర్స్‌మెంట్ టెలిఫోన్ బిల్లు, రవాణా తదితర అంశాలు ప్రస్తావించాల్సి ఉంటుంది. CTC కాంపోనెంట్లు ఒక కంపెనీకి మరో కంపెనీకి వేరుగా ఉండవచ్చు. అయితే వాటికి వర్తించే పన్ను నియమాలు మాత్రం ఒకేలా ఉంటాయి. జీతంలో కొన్ని కాంపోనెంట్లు పూర్తిగా పన్ను పరిధిలోకి రానున్నాయి. మరికొన్ని అంశాలకు పూర్తి మినహాయింపు ఉండగా.. ఇంకొన్నిటికి ఆదాయపన్ను నుంచి పాక్షిక మినహాయింపు లభించనుంది. గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్, ఇంటి అద్దె అలవెన్స్ (HRA), LTA, రీయింబర్స్‌మెంట్లపై పన్ను ఎలా విధిస్తారో తెలుసుకుందాం.

 HRAపై ఆదాయ పన్ను
CTCలో హెచ్‌ఆర్‌ఏ కీలకం. ఉద్యోగులు అద్దె ఇంట్లో నివసిస్తూ ఉంటే పన్ను ప్రయోజనం పొందవచ్చు. ఒకవేళ అద్దె ఇంట్లో లేకపోతే హెచ్‌ఆర్‌ఏపై ట్యాక్స్ విధిస్తారు. సెక్షన్ 10(13A) ప్రకారం కింది సందర్భాల్లో కనీసం పన్ను మినహాయింపుగా క్లెయిమ్ చేయవచ్చు. (i) ఉద్యోగి తీసుకున్న వాస్తవ జీతంపై పన్ను మినహాయింపు క్లైమ్ చేసుకోవచ్చు. (ii) మెట్రో నగరాలైన ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతాల్లో నివసిస్తున్నట్లయితే జీతంలో 50%పై హెచ్‌ఆర్‌ఏను పన్ను మినహాయింపుగా క్లైయిమ్ చేసుకోవచ్చు. ఇతర సందర్భాల్లో జీతంలో 40% క్లైయిమ్ చేసుకోవచ్చు. (iii) మొత్తం జీతంలో 10% కంటే ఎక్కువగా అద్దె చెల్లిస్తుంటే పన్ను మినహాయింపు లభిస్తుంది.

Maruti Suzuki: త్వరలోనే మారుతి సుజుకి నుంచి మరో సీఎన్​జీ కారు.. ధర, ఇతర వివరాలిలా..


రీయింబర్స్‌మెంట్‌పై ఆదాయపు పన్ను
ఉద్యోగులకు కంపెనీలు వివిధ రకాల అలవెన్సులను కల్పిస్తుంటాయి. పుస్తకాలు, ఎంటర్‌టైన్‌మెంట్, టెలిఫోన్, ఇంటర్‌నెట్ తదితర అంశాల్లో అలవెన్సులను ఇస్తుంటాయి. ఆదాయపన్ను చట్టం సెక్షన్ 10(14) ప్రకారం ఉద్యోగులకు కల్పిస్తున్న అలవెన్సులకు ట్యాక్స్ నుండి మినహాయింపు ఉంటుంది. అయితే వాస్తవంలో ఉద్యోగులు వాటిని వినియోగించినట్లయితేనే ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంటుంది. రవాణా అలవెన్సు, టెలిఫోన్ బిల్లు, ఇంటర్‌నెట్.... ఆదాయపన్ను రూల్3(7) (ix) ప్రకారం ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంటుంది.

ప్రైవేట్ ఉద్యోగుల విషయంలో ఎంటర్టైన్‌మెంట్ అలవెన్సు పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. అయితే కంపెనీ తన వ్యాపార ప్రయోజనం కోసం ఈ ఖర్చు చేస్తే.. అది ట్యాక్స్ నుంచి మినహాయింపుగా క్లెయిమ్ చేసుకోవచ్చు. రీయింబర్స్‌మెంట్‌పై పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోవడానికి ఖర్చులకు సంబంధించిన బిల్లులను చెల్లించాల్సి ఉంటుంది.

ప్రావిడెంట్ ఫండ్‌పై ఆదాయపు పన్ను
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ప్రావిడెంట్ ఫండ్‌ విరాళంపై ట్యాక్స్ మినహాయింపునకు అర్హత ఉంది.

Stock Market: భారీగా పెరిగిన ఆ షేర్ వ్యాల్యూ.. రూ.లక్ష పెట్టుబడితో రూ.2 కోట్ల రాబడి.. వివరాలిలా..


గ్రాట్యుటీపై ఆదాయపు పన్ను
ఉద్యోగులు ఉపాధి సమయంలో పొందే గ్రాట్యుటీ పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. రిటైర్మెంట్ సమయంలో, యజమాని గ్రాట్యుటీ చట్టం కింద కవర్ అయితే గ్రాట్యుటీపై పన్ను ప్రయోజనం పొందవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10 (10) ప్రకారం గ్రాట్యుటీ మొత్తం అందినప్పుడు, లేక రూ.20లక్షల గ్రాట్యూటీ లేక 15 రోజుల జీతం 6 నెలల కంటే ఎక్కువ పూర్తి చేసిన ప్రతి సంవత్సరం లేదా దానిలో కొంత భాగాన్ని చివరిగా తీసుకున్న జీతం ఆధారంగా ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంటుంది.

గ్రాట్యూటీని ఈవిధంగా లెక్కిస్తారు.. జీతం అంటే బేసిక్ పే + డియర్‌నెస్ అలవెన్స్ కలిపి గ్రాట్యూటీని లెక్కిస్తారు. యజమాని చెల్లింపు గ్రాట్యుటీ చట్టం కింద కవర్ చేయని పక్షంలో కింది సందర్భాల్లో కనీసం మినహాయింపు ఉంటుంది. (1) అసలు మొత్తం అందినప్పుడు (2) రూ.2లక్షలు (3) పూర్తి చేసిన ప్రతి సంవత్సరానికి సగం నెల జీతం. (నెల జీతంలో సగం)

LTAపై ఆదాయపు పన్ను
సెలవు ప్రయాణ భత్యంపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాస్తవ ప్రయాణం పన్ను చెల్లింపుదారుడు చేసుండాలి. ఇందులో దేశీయ ప్రయాణాలకు అయ్యే ఖర్చును మాత్రమే ట్యాక్స్ మినహాయింపు నుంచి క్లైయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి, పిల్లలు, ఆధారపడిన తల్లిదండ్రులు, ఉద్యోగి సోదరులు, సోదరీమణులతో సహా ఉద్యోగికి ఒంటరిగా లేదా అతని కుటుంబానికి ట్యాక్స్ నుంచి మినహాయింపు అందుబాటులో ఉంటుంది. అయితే, 1 అక్టోబర్ 1998 తర్వాత పుట్టిన పిల్లలు ఉంటే వారి ఇద్దరి కంటే ఎక్కువగా ఉంటే ట్యాక్స్ మినహాయింపు వర్తించదు.
Published by:Veera Babu
First published:

Tags: Hra, Income tax, Private employee, Private Jobs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు