కరోనా లాక్ డౌన్ కారణంగా బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి లోనయింది. ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రభుత్వ ఆర్థిక సహాయ సహకారాలతో ఆ ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోగలుగుతున్నాయి. అయితే ప్రైవేట్ బ్యాంకులు (Private banks) మాత్రం విఫలమవుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక నివేదిక (Reserve Bank of India annual report) 2021-22 ప్రకారం ప్రైవేట్ బ్యాంకులు 2021-22 సంవత్సరంలో అత్యధిక మోసాలను (witnessed the highest number of frauds) చవిచూశాయి. 2021-22లో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు నివేదించిన మోసం కేసులు పెరిగాయని నివేదిక తెలిపింది. అయితే గత సంవత్సరం క్రితం జరిగిన మొత్తం మెసాల సంఖ్యలో ఇది సగమేనని స్పష్టం చేసింది.
రుణాల పోర్ట్ ఫోలియోలోనే అత్యధికంగా మోసాలు..
గత మూడేళ్లలో బ్యాంకు గ్రూపుల వారీగా జరిగిన మోసం కేసుల అంచనా ప్రకారం ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో గరిష్ట సంఖ్యలో మోసాలు (highest number of frauds) పెరిగాయి. రుణాల పోర్ట్ ఫోలియోలోనే (Debt portfolio) అత్యధికంగా మోసాలు జరుగుతున్నాయని ఆర్బీఐ నివేదిక వెల్లండించింది. ఈ రిపోర్టు ప్రకారం వీటిలో ఎక్కువ ప్రభుత్వ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. భారత మార్కెట్లో బ్యాంకుల రుణాలు ఇవ్వడంలో ప్రభుత్వ బ్యాంకులు అన్నిటికంటే ముందున్నాయి.
5,334 కేసులు ప్రైవేట్ బ్యాంకుల నుంచే..
2021-22 ఆర్థిక సంవత్సరంలో 5,334 కేసులు ప్రైవేట్ బ్యాంకుల నుంచే నమోదయ్యాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 3,078 మోసాల కేసులు నమోదు కాగా, విదేశీ బ్యాంకుల నుంచి 494, చిన్న ఆర్థిక బ్యాంకుల నుంచి 155, పేమెంట్స్ బ్యాంకుల నుంచి 30, ఆర్థిక సంస్థల నుంచి 10, స్థానిక బ్యాంకుల నుంచి 2 కేసులు నమోదయ్యాయని నివేదికలో పేర్కొంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.40,282 కోట్ల నష్టం జరిగింది. ప్రైవేట్ రంగ బ్యాంకుల నుంచి రూ.17,588 కోట్లు, ఆర్థిక సంస్థల నుంచి రూ.1,305 కోట్లు, విదేశీ బ్యాంకుల నుంచి రూ.1,206 కోట్లు, ఫైనాన్స్ బ్యాంకుల నుంచి రూ.30 కోట్లు, లోకల్ ఏరియా బ్యాంకుల నుంచి రూ.2 కోట్లు, పేమెంట్స్ బ్యాంకుల నుంచి రూ.1 కోటి మొత్తంలో కుంభకోణాలు నమోదయ్యాయి.
రూ. 58,328 కోట్ల మొత్తంలో మోసాలు..
ప్రైవేట్ బ్యాంకుల్లో ఇంటర్నెట్ మోసాల సంఖ్యే ఎక్కువగా ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రుణ పోర్ట్ ఫోలియోలో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆర్బీఐ నివేదికలో పేర్కొంది. రుణ పోర్ట్ ఫోలియోలో ఎక్కువ మొత్తంలో మోసాలు జరిగాయి. అడ్వాన్స్ లు 42.2 శాతం, విలువ పరంగా దాదాపు 97 శాతం అంటే రూ. 58,328 కోట్ల మొత్తంలో మోసాలు జరిగాయి.
ఇంటర్నెట్ మోసాలు 39.5 శాతంగా నివేదికలో పేర్కొంది. అయితే విలువ పరంగా ఇంటర్నెట్ మోసాలు కేవలం 0.2శాతం మాత్రమే నమోదయ్యాయని తెలిపింది. ఈ సంవత్సర కాలంలోనే మోసాల విలువ శాతం పెరిగిందని వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరాల్లో 2020-21లో 91.71 శాతం ఉండగా.. ఇప్పుడు 2021-22లో 93.73శాతానికి పెరిగింది.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.