మోదీ 'మన్ కీ బాత్' ఆమె జీవితాన్ని మార్చేసింది

సొంతగా ఏదైనా చేయాలనుకున్న జ్యోతి సింగ్ గూగుల్‌ వ్యాపారవకాశాలను వెతకడం మొదలుపెట్టింది. తేనెటీగల పెంపకం గురించి తెలుసుకుంది. ఆ వ్యాపారం గురించి అధ్యయనం చేసింది.

news18-telugu
Updated: August 3, 2019, 4:15 PM IST
మోదీ 'మన్ కీ బాత్' ఆమె జీవితాన్ని మార్చేసింది
మోదీ 'మన్ కీ బాత్' ఆమె జీవితాన్ని మార్చేసింది
news18-telugu
Updated: August 3, 2019, 4:15 PM IST
మన్ కీ బాత్... ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేరుగా ప్రజలతో సంభాషించే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ పంచుకునే ఆలోచనలు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంటాయి. విభిన్న వర్గాలకు సరికొత్త దారి చూపిస్తుంటాయి. అలా మోదీ పంచుకున్న ఆలోచనలు ఓ యువతి జీవితాన్ని మార్చేశాయి. మల్టీ నేషనల్ కంపెనీలో లక్షల రూపాయల జీతానికి పనిచేస్తున్న ఆమె... మంచి ఉద్యోగాన్ని వదులుకొంది. సొంతూరికి వచ్చేసింది. వ్యాపారం మొదలుపెట్టింది. ఇదీ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన జ్యోతి సింగ్ కథ. మీరట్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన జ్యోతి సింగ్ డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసింది. ఓ మల్టీ నేషనల్ కంపెనీలో ఆపరేషనల్ మేనేజర్‌గా ఉద్యోగం చేసేది. లక్షల్లో జీతం. ఓసారి 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మోదీ ప్రసంగాన్ని విని స్ఫూర్తిని పొందింది. అంతే ఏదైనా కొత్తగా చేయాలనుకుంది.

Prime Minister Narendra Modi, Mann ki baat, pm narendra modi, beekeeping, Uttar Pradesh, Meerut, jyoti singh, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మన్ కీ బాత్, పీఎం నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్, మీరట్, జ్యోతి సింగ్
తేనెటీగల పెంపకం వ్యాపారంలో జ్యోతి సింగ్


సొంతగా ఏదైనా చేయాలనుకున్న జ్యోతి సింగ్ గూగుల్‌ వ్యాపారవకాశాలను వెతకడం మొదలుపెట్టింది. తేనెటీగల పెంపకం గురించి తెలుసుకుంది. ఆ వ్యాపారం గురించి అధ్యయనం చేసింది. విదేశాల్లో తేనెటీగల పెంపకం చేస్తున్నవారితో వీడియో కాల్‌లో మాట్లాడి సమాచారం తెలుసుకుంది. పట్నాగర్ విశ్వవిద్యాలయంలో తేనెటీగల పెంపకంలో శిక్షణ తీసుకుంది. 15 రోజుల శిక్షణ తర్వాత ప్రభుత్వ పథకం ద్వారా రూ.3 లక్షల లోన్ తీసుకొని వ్యాపారం మొదలుపెట్టింది. ఆమెకు రూ.18 వేల సబ్సిడీ కూడా వచ్చింది. మొదట 50 బాక్సులతో తేనెటీగల పెంపకం ప్రారంభించింది. మంచి ఉద్యోగం వదిలేసి ఈ వ్యాపారం చేస్తున్నందుకు మొదట జ్యోతి స్నేహితులు, గ్రామస్తులు నానా మాటలు అన్నారు. కానీ ఇప్పుడు ఆ వ్యాపారం బాగా నడుస్తుండటంతో ప్రోత్సహిస్తున్నారు. ఈ వ్యాపారంలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Prime Minister Narendra Modi, Mann ki baat, pm narendra modi, beekeeping, Uttar Pradesh, Meerut, jyoti singh, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మన్ కీ బాత్, పీఎం నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్, మీరట్, జ్యోతి సింగ్
ప్రతీకాత్మక చిత్రం
జ్యోతి వయస్సు పాతికేళ్లు మాత్రమే. రెండుమూడేళ్లు ఉద్యోగం చేసింది. కానీ ఉదయాన్నే 9 గంటలకు వెళ్లి 5 గంటలకు తిరిగొచ్చే ఉద్యోగం నచ్చలేదు. ఇప్పుడు ఈ వ్యాపారంలో బాగా రాణిస్తున్నారామె. ఆమె మరో ఇద్దరికి ఉద్యోగం కూడా ఇచ్చింది. ఇప్పుడు ఈ తేనెటీగలు తన స్నేహితులుగా మారిపోయాయని, వాటిని బాగా చూసుకోకుండా ఉండలేనంటోంది జ్యోతి. తన కంపెనీని రిజిస్టర్ చేసిన జ్యోతి... ఉత్పత్తుల్ని ఎక్స్‌పోర్ట్ చేసే ఆలోచనలో ఉంది.

Friendship Day 2019: మీ ఫ్రెండ్‌కు గిఫ్ట్ ఇవ్వాలా? ఈ 12 గ్యాడ్జెట్స్ ట్రై చేయండి

Loading...
ఇవి కూడా చదవండి:

Friendship Day Stickers: ఫ్రెండ్‌షిప్ డే స్టిక్కర్స్ డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా

Huawei Y9 Prime: ఇండియాలో రిలీజైన హువావే వై9 ప్రైమ్... ఎలా ఉందో చూడండి

SBI Wealth: మీకు ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? 'ఎస్‌బీఐ వెల్త్' గురించి తెలుసా?
First published: August 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...