ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న దేశంలోని 75 జిల్లాల్లో డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్‌ని (DBUs) ప్రారంభించనున్నారు. ఈ డిజిటల్ బ్యాంకులన్నీ (Digital Banks) పేపర్‌లెస్ అంటే కాగిత రహితంగా ఉంటాయి. ఖాతాదారులకు డిజిటల్ ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలుగా నిలుస్తాయి. ఈ డిజిటల్ బ్యాంకుల్ని 75 జిల్లాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని బడ్జెట్ సమావేశంలో ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం కోరింది. అయితే ఏఏ జిల్లాల్లో ఇవి ప్రారంభం కానున్నాయన్న స్పష్టత లేదు.
బ్యాంకులు ఇప్పటికే 75 జిల్లాలను సెలెక్ట్ చేశాయని, డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ ఏర్పాటుకు కావాల్సిన పనులు మొదలయ్యాయని వార్తలొస్తున్నాయి. ఇవి 2022 జూలై నాటికి అందుబాటులోకి వస్తాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగస్ట్ 15న అధికారికంగా వీటిని ప్రారంభిస్తారు. ఇక ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇప్పటికే డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం గైడ్‌లైన్స్ విడుదల చేసింది.
EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త... ఈసారి ముందుగానే వడ్డీ జమ... ఎప్పుడంటే
డిజిటల్ బ్యాంకింగ్ ఉత్పత్తులు, సేవలను అందించడానికి పనిచేసే కేంద్రమే డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్, డిజిటల్ కిట్, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ, భీమ్ ఆధార్, పాయింట్ ఆఫ్ సేల్, పలు ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు రీటైల్, ఎంఎస్ఎంఈ లోన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ రుణాల ప్రాసెస్ అంటే లోన్ అప్లికేషన్ నుంచి రుణం మంజూరు చేయడం వరకు మొత్తం డిజిటల్ పద్ధతిలోనే సాగుతుంది. డిజిటల్ ఆర్థిక సేవల విస్తరణతో పాటు ప్రజలకు ఆర్థిక సేవల్ని అందించడమే DBU లక్ష్యం.
Money Saving Tips: కోటీశ్వరులు కావాలంటే నెలకు రూ.1,000 పొదుపు చేసినా చాలు
ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం గత డిజిటల్ బ్యాంకింగ్ అనుభవం ఉన్న షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు ఆర్‌బీఐ నుంచి అనుమతి తీసుకోనవసరం లేకుండా టైర్ 1 నుంచి టైర్ 6 కేంద్రాలలో డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్‌ని తెరవచ్చు. బ్యాంకుల DBUలను బ్యాంకింగ్ అవుట్‌లెట్‌లుగా పరిగణిస్తారు. ప్రస్తుత ఫార్మాట్లు, డిజైన్లతో ఉన్న బ్యాంకింగ్ అవుట్‌లెట్ నుంచి డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు వేరుగా ఉంటాయని ఆర్‌బీఐ తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banking, Mobile Banking, Personal Finance, Reserve Bank of India