ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉజ్వల 2.0 పథకాన్ని ప్రారంభించారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన-PMUY పథకం పేరుతో ఈ స్కీమ్ బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. మొదటి దశ విజయవంతం కావడంతో రెండో దశను ప్రారంభించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఉత్తర ప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో పీఎం ఉజ్వల స్కీమ్ రెండో దశను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. నిరుపేద కుటుంబాలకు ఉచితంగా ఎల్‌పీజీ కనెక్షన్, సిలిండర్ ఇచ్చే స్కీమ్ ఇది. పీఎం ఉజ్వల స్కీమ్ మొదటి దశలో 1,47,43,862 ఎల్‌పీజీ కనెక్షన్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కొంతకాలంగా పీఎం ఉజ్వల స్కీమ్ దరఖాస్తుల్ని స్వీకరించట్లేదు. కొన్ని అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్లు రెండో దశలో కవర్ కానున్నాయి. దీంతో పాటు కొత్తగా ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
IRCTC: ఐఆర్‌సీటీసీ బిజినెస్ ఆఫర్... నెలకు రూ.80,000 సంపాదించండి ఇలా
Online Business: రూ.12 లక్షల పెట్టుబడితో బిజినెస్... కోట్ల రూపాయల టర్నోవర్
కేంద్ర ప్రభుత్వం 2016లో ఈ స్కీమ్ ప్రారంభించింది. మొత్తం దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న ఐదు కోట్ల మంది మహిళలకు ఉచితంగా ఎల్‌పీజీ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2018లో మొత్తం ఏడు కేటగిరీలను ఇందులో చేర్చింది. ఎస్‌సీ, ఎస్‌టీ, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-PMAY, అంత్యోదయ అన్న యోజన-AAY, చాలా వెనుకబడిన తరగతులు, టీ తోటల్లో పనిచేసేవారు, అడవుల్లో నివసించేవారు, మారుమూల ప్రాంతాల్లో నివసించే మహిళలకు ఈ పథకాన్ని అందిస్తున్నారు. కానీ 1,47,43,862 కనెక్షన్లు మాత్రమే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. రెండో దశలో 8 కోట్ల మందికి కొత్త ఎల్‌పీజీ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రెండో దశలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే కోటి కనెక్షన్లు ఇవ్వాలన్నది మోదీ ప్రభుత్వం లక్ష్యం.
Aadhaar Number: ఆధార్ నెంబర్ వెరిఫై చేయాలా? ఈ స్టెప్స్ ఫాలో అవండి
Bank Loan: ష్యూరిటీ లేకుండా రూ.5 లక్షల వరకు లోన్... ఎస్‌బీఐ సహా లోన్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన-PMUY స్కీమ్ మొదటి శలో ఉచితంగా ఎల్‌పీజీ కనెక్షన్ తీసుకోవాలనుకునేవారికి రూ.1,600 ఆర్థిక సహకారం అందించింది కేంద్ర ప్రభుత్వం. రెండో దశ ద్వారా ఉచితంగా గ్యాస్ స్టవ్‌తో పాటు, ఉచితంగా గ్యాస్ సిలిండర్ కూడా లభిస్తుంది. పీఎం ఉజ్వల యోజన స్కీమ్‌కు దరఖాస్తు చేయడం చాలా సులువు. వలస కూలీలు రేషన్ కార్డుల్ని, అడ్రస్ ప్రూఫ్‌ను సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ డిక్లరేషన్, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డిక్లరేషన్ ఇస్తే చాలు. మహిళలు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేయాలి. 18 ఏళ్లు దాటిన మహిళలు మాత్రమే అప్లై చేయాలి. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న మహిళలు మాత్రమే అర్హులు. బీపీఎల్ కార్డ్ లేదా రేషన్ కార్డ్ ఉండాలి. వారి కుటుంబానికి చెందిన ఎవరి పేరు మీదా ఎల్‌పీజీ కనెక్షన్ ఉండకూడదు.
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన-PMUY స్కీమ్‌కు ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయొచ్చు. దగ్గర్లో ఉన్న ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీకి వెళ్లి అప్లికేషన్ ఫామ్ ఇవ్వాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలంటే https://pmujjwalayojana.com వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకొని, పూర్తి చేసి ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలో ఇవ్వాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bharat Gas, Gas, HP gas, Indane Gas, LPG Cylinder, LPG Cylinder New Rates, Lpg Cylinder Price, PM Ujjwala Scheme