భారత పౌరులకు ఆధార్ కార్డ్ ఉంటుంది. ప్రతీ ఒక్కరికీ విభిన్న ఆధార్ నెంబర్ (Aadhaar Number) ఉంటుంది. ఒక ఆధార్ నెంబర్ లాగా మరో ఆధార్ నెంబర్ ఉండదు. ఇప్పుడు అలాంటి మరో కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రారంభించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ను లాంఛ్ చేశారు. ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) మూడో వార్షికోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ ( PM-DHM) పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారత పౌరులకు డిజిటల్ హెల్త్ ఐడీని (Digital Health ID) అందించే ప్రత్యేక కార్యక్రమం ఇది. ఆధార్ నెంబర్ లాగానే ప్రతీ ఒక్కరికీ భిన్నమైన డిజిటల్ హెల్త్ ఐడీ ఉంటుంది. ఈ ఐడీలో హెల్త్ రికార్డ్స్ అన్నీ స్టోర్ అయి ఉంటాయి. నేషనల్ హెల్త్ అథారిటీ కలిసి ఈ మిషన్ పనిచేస్తుంది.
myAadhaar Portal: ఆధార్ కొత్త వెబ్సైట్లో లభించే 11 రకాల సేవలు ఇవే
ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పైలట్ పద్ధతిన నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే ఒక లక్షకు పైగా యూనిక్ హెల్త్ ఐడీలను క్రియేట్ చేశారు. ప్రధాన మంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ యూనిక్ ఐడీలో 14 అంకెలు ఉంటాయి. పౌరులందరికీ త్వరలో ఈ ఐడీలు వస్తాయి. ఇది వ్యక్తిగత హెల్త్ అకౌంట్ లాంటిది. ఇందులో సదరు వ్యక్తికి సంబంధించిన ఆరోగ్య సమాచారం మొత్తం ఉంటుంది. దీర్ఘకాలం పాటు హెల్త్ రికార్డ్స్ స్టోర్ చేయడానికి, ఎవరితోనైనా షేర్ చేయడానికి ఈ హెల్త్ ఐడీ ఉపయోగపడుతుంది.
Postal Saving Scheme: ప్రతినెలా కొంత పొదుపు చేస్తే రూ. 16 లక్షలు మీవే... స్కీమ్ వివరాలు తెలుసుకోండి
Speaking at the launch of Ayushman Bharat Digital Mission. https://t.co/OjfHVbQdT7
— Narendra Modi (@narendramodi) September 27, 2021
హెల్త్ అకౌంట్లో సదరు వ్యక్తి కన్సల్ట్ అయిన ప్రతీ డాక్టర్ వివరాలు ఉంటాయి. వారికి ఉన్న వ్యాధుల సమాచారం, చేయించుకున్న టెస్టుల వివరాలు ఉంటాయి. ఇతర డాక్టర్ల దగ్గరకు వెళ్లినప్పుడు డిజిటల్ హెల్త్ ఐడీ ఇస్తే చాలు... ఆ ఆస్పత్రి సిబ్బందికి పేషెంట్ ఆరోగ్య చరిత్ర మొత్తం తెలుస్తుంది. ఆరోగ్య చరిత్రతో పాటు వ్యక్తిగత వివరాలు, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ కూడా హెల్త్ ఐడీలో ఉంటాయి. మొబైల్ అప్లికేషన్ ద్వారా పర్సనల్ హెల్త్ రికార్డ్స్ యాక్సెస్ చేయొచ్చు.
నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ద్వారా పౌరులు ఎవరైనా హెల్త్ ఐడీని ఉచితంగా పొందొచ్చు. హెల్త్ ఐడీ పొందడం ఉచితం. హెల్త్ ఐడీ పొందడం తప్పనిసరి కాదు. స్వచ్ఛందం మాత్రమే. త్వరలో అన్ని రాష్ట్రాల్లోని పౌరులు హెల్త్ ఐడీ తీసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health, Modi, Narendra modi, Pm modi, PM Narendra Modi