హోమ్ /వార్తలు /business /

PM Modi: గాంధీనగర్‌లో హైటెక్ రైల్వే స్టేషన్, 5-స్టార్ హోటల్ ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi: గాంధీనగర్‌లో హైటెక్ రైల్వే స్టేషన్, 5-స్టార్ హోటల్ ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi | గాంధీనగర్ క్యాపిటల్ రైల్వే స్టేషన్‌తో పాటు, రైల్వే స్టేషన్‌పైన నిర్మించిన 5-స్టార్ హోటల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

PM Modi | గాంధీనగర్ క్యాపిటల్ రైల్వే స్టేషన్‌తో పాటు, రైల్వే స్టేషన్‌పైన నిర్మించిన 5-స్టార్ హోటల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

PM Modi | గాంధీనగర్ క్యాపిటల్ రైల్వే స్టేషన్‌తో పాటు, రైల్వే స్టేషన్‌పైన నిర్మించిన 5-స్టార్ హోటల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

  హైటెక్ హంగులతో గుజరాత్ రాజధానిలో నిర్మించిన రైల్వే స్టేషన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఎయిర్‌పోర్ట్ లాంటి సౌకర్యాలు, సదుపాయాలు, హంగులతో నిర్మించిన హైటెక్ రైల్వే స్టేషన్ ఇది. గాంధీనగర్ క్యాపిటల్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు ఎయిర్‌పోర్టు లాంటి సౌకర్యాలు లభిస్తాయి. రైల్వే స్టేషన్‌తో పాటు రైల్వే స్టేషన్ పైన నిర్మించిన 5-స్టార్ హోటల్‌ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. గాంధీనగర్, అహ్మదాబాద్ సైన్స్ సిటీలో అభివృద్ధి చేసిన నిర్మాణాలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ప్రజలు నమ్మలేకపోయారని, అవి ఇండియాలో, అది కూడా గుజరాత్‌కు చెందినవని నమ్మట్లేదని మోదీ అన్నారు.

  Railway Station: నమ్మండి... ఇది ఎయిర్‌పోర్ట్ కాదు... ఈ రైల్వే స్టేషన్ ఎక్కడో తెలుసుకోండి

  IRCTC Araku Tour: విశాఖపట్నం నుంచి అరకు టూర్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

  రైల్వే స్టేషన్‌పైన 250 అడుగుల 5-స్టార్ హోటల్ ప్రధానాకర్షణ. ఇందులో 318 రూమ్స్ ఉన్నాయి. గాంధీనగర్ క్యాపిటల్ రైల్వే స్టేషన్, హోటల్ ఎదురుగా మహాత్మా మంది కన్వెన్షన్ సెంటర్, గుజరాత్ అసెంబ్లీ, దండీ కాటేజ్ కనిపిస్తాయి. గాంధీనగర్‌లో కొత్త రైల్వే స్టేషన్‌లో 5-స్టార్ హోటల్‌ మాత్రమే కాదు అతిపెద్ద ఎకనమిక్ జోన్ కూడా సిద్ధమైంది. గాంధీనగర్ రైల్వే అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఈ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేసింది. స్టేషన్‌లో 7,600 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంది. త్వరలో ఇందులో ఫుడ్ కోర్ట్ మల్టీప్లెక్స్ అందుబాటులోకి వస్తాయి.

  LIC Pension Policy: 60 ఏళ్లకు కాదు... ఈ పాలసీతో 40 ఏళ్ల నుంచే పెన్షన్ తీసుకోవచ్చు

  ATM Charges: ఆగస్ట్ 1 నుంచి కొత్త ఏటీఎం ఛార్జీలు... మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే

  ఇక కొత్త రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ లాంటి సౌకర్యాలు ప్రయాణికులకు లభిస్తాయి. రెండు ఎస్కలేటర్లు, మూడు లిఫ్టులు, రెండు అండర్‌గ్రౌండ్ సబ్‌వేస్ ప్లాట్‌ఫామ్‌ను కనెక్ట్ చేస్తాయి. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ర్యాంపులు, స్పెషల్ టికెట్ కౌంటర్, ప్రత్యేకమైన పార్కింగ్ స్పేస్ ఉన్నాయి. ఇక గాంధీనగర్ కొత్త రైల్వే స్టేషన్, 5-స్టార్ హోటల్ ప్రారంభోత్సవంతో పాటు గాంధీనగర్-వారణాసి రూట్‌లో వీక్లీ సూపర్‌ఫాస్ట్ రైలు అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ప్రధాని మోదీ సొంతూరైన వడ్‌నగర్‌కు కనెక్ట్ అయ్యే మెహ్సానా వరేతా ఎలక్ట్రిక్ లైన్ ప్రారంభించారు.

  First published:

  ఉత్తమ కథలు