ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత్ గౌరవ్ కాశీ దర్శన్ ట్రైన్‌ను (Bharat Gaurav Kashi Darshan Train) బెంగళూరులో ప్రారంభించారు. కర్నాటక పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) మైసూర్-చెన్నై రూట్లో ఐదో వందే భారత్ రైలును ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ నుంచి భారత్ గౌరవ్ కాశీ దర్శన్ ట్రైన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ప్రారంభించిన భారత్ గౌరవ్ స్కీమ్‌లో భాగంగా రైలు నడుపుతున్న తొలి రాష్ట్రం కర్నాటక కావడం విశేషం. కర్నాటక నుంచి కాశీకి వెళ్లాలనుకునే భక్తులకు ఈ రైలు అందుబాటులో ఉంటుంది.
కర్నాటక ముజ్రాయ్ డిపార్ట్మెంట్ భారత్ గౌరవ్ కాశీ దర్శన్ ట్రైన్‌ను నడుపుతుంది. పర్యాటకులు ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్లో టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు. కర్నాటక భారత్ గౌరవ్ కాశీ దర్శన్ పేరుతో ఈ టూర్ ప్యాకేజీ నవంబర్ 11, నవంబర్ 23 తేదీల్లో అందుబాటులో ఉంది.
Aadhaar Update: అలర్ట్... 10 ఏళ్లకోసారి ఆధార్ అప్డేట్ తప్పనిసరి కాదు... కానీ
Hon'ble PM Shri @narendramodi flagged off Bharat Gaurav Kashi Yatra Train running between Karnataka and Kashi from KSR Bengaluru Station in Karnataka, today. pic.twitter.com/puscqlK8yH
— Ministry of Railways (@RailMinIndia) November 11, 2022
ఇది 7 రాత్రులు, 8 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ ప్యాకేజీలో వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ లాంటి పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి. టూర్ ప్యాకేజీ ధర రూ.20,000. కర్నాటక ప్రభుత్వం నుంచి రూ.5,000 స్పెషల్ డిస్కౌంట్ లభిస్తుంది. టూర్ ప్యాకేజీలో థర్డ్ ఏసీ ప్రయాణం, నాన్ ఏసీ హోటళ్లలో బస, శాకాహార భోజనం, నాన్ ఏసీ బస్సుల్లో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
కర్నాటక భారత్ గౌరవ్ కాశీ దర్శన్ టూర్ మొదటి రోజు బెంగళూరులో ప్రారంభం అవుతుంది. పర్యాటకులు బిరూర్, హవేరి, హుబ్బలి, బెలగావి, రాయ్‌బాగ్ స్టేషన్లో ఈ రైలు ఎక్కొచ్చు. మొదటి రోజు, రెండో రోజంతా ప్రయాణం ఉంటుంది. మూడో రోజు మధ్యాహ్నం వారణాసి రైల్వే స్టేషన్ చేరుకుంటారు. రాత్రికి వారణాసిలో బస చేయాలి. నాలుగో రోజు ఉదయం తులసీ మందిర్, సంకట్ మోచన్ హనుమాన్ మందిర్ సందర్సన ఉంటుంది. లంచ్ తర్వాత కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించొచ్చు. గంగా తీరంలో స్నానాలు చేయొచ్చు. రాత్రికి వారణాసిలో బస చేయాలి.
Business Loan: బిజినెస్ చేస్తారా? రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తున్న ఎస్బీఐ
ఐదో రోజు వారణాసి నుంచి అయోధ్య బయల్దేరాలి. మధ్యాహ్నం అయోధ్య చేరుకుంటారు. రామ జన్మభూమి, హనుమాన్ గఢి సందర్శించవచ్చు. సాయంత్రం సరయు తీరంలో సంధ్యాహారతిలో పాల్గొనొచ్చు. ఆ తర్వాత అయోధ్య నుంచి ప్రయాగ్‌రాజ్ బయల్దేరాలి. ఆరో రోజు ఉదయం ప్రయాగ్‌రాజ్ చేరుకుంటారు. ఆ తర్వాత త్రివేణి సంగమం, హనుమాన్ ఆలయం సందర్శించవచ్చు. అదే రోజు మధ్యాహ్నం తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఏడో రోజంతా ప్రయాణం ఉంటుంది. ఎనిమిదో రోజు బెంగళూరు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Railways, IRCTC, Pm modi, PM Narendra Modi, Railways