హోమ్ /వార్తలు /బిజినెస్ /

Vande Bharat Express: సెప్టెంబర్ 30న పట్టాలెక్కనున్న ముంబై-అహ్మదాబాద్‌ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌.. ప్రత్యేకతలివే..

Vande Bharat Express: సెప్టెంబర్ 30న పట్టాలెక్కనున్న ముంబై-అహ్మదాబాద్‌ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌.. ప్రత్యేకతలివే..

Vande Bharat Express

Vande Bharat Express

Vande Bharat Express: ప్రస్తుతం ఇండియన్ రైల్వేస్ రెండు రూట్లలో వందే భారత్ రైళ్లను నడుపుతోంది. కాగా, మూడో రూట్ రైలు కూడా త్వరలో అందుబాటులోకి రానుంది. సెప్టెంబర్ 30న ప్రధాని మోదీ ముంబై-అహ్మదాబాద్ ట్రైన్‌ను ప్రారంభించనున్నారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

దేశంలో రైలు ప్రయాణికుల సౌకర్యార్థం భారతీయ రైల్వేశాఖ వందే భారత్ హై స్పీడ్ రైళ్ల (Vande Bharat Express)ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ రైళ్ల ద్వారా ప్రయాణికులు అతి త్వరగా తమ గమ్యస్థానానికి చేరుకోవచ్చు. రైళ్లలో ప్రయాణికులకు అత్యుత్తమమైన అప్‌గ్రేడెడ్ సౌకర్యాలు అందించనున్నారు. ప్రస్తుతం ఇండియన్ రైల్వేస్ (Indian Railways) రెండు రూట్లలో వందే భారత్ రైళ్లను నడుపుతోంది. కాగా, మూడో రూట్ రైలు కూడా త్వరలో అందుబాటులోకి రానుంది.

న్యూ ఢిల్లీ-వారణాసి, న్యూ ఢిల్లీ -మాతా వైష్ణో దేవి కాట్రా రూట్లలో రెండు వందే భారత్ ట్రైన్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. మూడో రూట్.. ముంబై-అహ్మదాబాద్‌ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు తీయనుంది. సెప్టెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోదీ గాంధీనగర్ రైల్వే స్టేషన్‌లో పచ్చ జెండా ఊపి ఈ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబై-అహ్మదాబాద్ మధ్య ఈ ట్రైన్ నడవనుంది. ఇటీవల ట్రయల్ రన్ సక్సెస్ అయిందని కేంద్ర రైల్వేశాఖ అధికారులు తెలిపారు.

* ప్రత్యేకతలు

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ 52 సెకన్లలోనే వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇది బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా వెళ్తుంది. అహ్మదాబాద్ - ముంబై మధ్య ఉన్న 492 కిలోమీటర్ల దూరాన్ని ఈ ట్రైన్ 5.10 గంటలలో కవర్ చేయగలదని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.

ఈ ఎక్స్‌ప్రెస్‌కు సీఆర్ఎస్ (Commissioner of railway safety-CRS) అనుమతి కూడా లభించిందని తెలిపారు. వందే భారత్ ట్రైన్లను స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసినట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు దేశానికి కీలకమని, ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య ట్రైన్ రూట్ కోసం 80 కిలోమీటర్ల పాటు పిల్లర్లు తవ్వినట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి : మారుతి సుజుకి గ్రాండ్ విటారా పిక్స్‌ చూశారా? ఆకట్టుకునే డిజైన్, ఇంటీరియర్‌పై ఓ లుక్కేయండి..

* వందే భారత్ ఫీచర్స్ ఇవే..

వందే భారత్ రైలులో వై-ఫై ఫెసిలిటీతో 32 అంగుళాల ఎల్‌సీడీ(LCD) టీవీ ఉంటుంది. ఎయిర్ ప్యూరిఫికేషన్ కోసం క్యాటలిటిక్ యూవీ ఎయిర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్‌ను అమర్చారు. స్వచ్ఛమైన గాలి అందించడం కోసం సరికొత్త డిజైన్‌తో ట్రైన్ రూఫ్‌ను (Roof Mounted Package Unit- RMPU) నిర్మించారు. ఇందులో వ్యాకుమ్ బేస్డ్ బయో టాయ్‌లెట్, ఆటోమేటెడ్ స్లైడింగ్ డోర్, జీపీఎస్ ఆధారంగా నడిచే సమాచార వ్యవస్థ (GPS-based information system), సీసీటీవీ కెమెరాలు (CCTV cameras)ఉంటాయి.

* ప్రారంభించనున్న మోదీ

దసరా, దీపావళి పండుగ సీజన్‌కు ముందు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించాలని ఇండియన్ రైల్వేస్ భావించింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 30న ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమయ్యే వందే భారత్ రైలు మొదటిసారి పరుగులు పెట్టనుంది. ఈ ఫెస్టివల్ సీజన్‌లో ప్రయాణికులు ఈ ట్రైన్‌లో ప్రయాణించి సురక్షితంగా, అత్యంత తక్కువ సమయంలో తమ గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఈ రూట్‌లో‌నే కాకుండా త్వరలో మరిన్ని రూట్లలో వందే భారత్ రైళ్లు అందుబాటులోకి తీసుకురావాలని ఇండియన్ రైల్వేస్ భావిస్తోంది. దేశంలోని ప్రధాన నగరాలను కనెక్ట్ చేస్తూ ఈ రైళ్లు తీసుకువస్తే బాగుంటుందని యోచిస్తోంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Indian Railways, PM Narendra Modi, Vande Bharat Train

ఉత్తమ కథలు