Home /News /business /

PRIME MINISTER NARENDRA MODI ASKS TO PARTICIPATE IN LOGO DESIGN CONTEST FOR INDIAS FORTHCOMING G20 PRESIDENCY SS

Contest: కేంద్ర ప్రభుత్వం కాంటెస్ట్... రూ.1,50,000 గెలుచుకునే ఛాన్స్

Contest: కేంద్ర ప్రభుత్వం కాంటెస్ట్... రూ.1,50,000 గెలుచుకునే ఛాన్స్
(ప్రతీకాత్మక చిత్రం)

Contest: కేంద్ర ప్రభుత్వం కాంటెస్ట్... రూ.1,50,000 గెలుచుకునే ఛాన్స్ (ప్రతీకాత్మక చిత్రం)

Contest | కేంద్ర ప్రభుత్వం ఓ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఈ కాంటెస్ట్‌లో పాల్గొని గెలిచినవారికి రూ.1,50,000 ప్రైజ్ మనీ ప్రకటించడం విశేషం. భారతదేశం జీ20 అధ్యక్ష పదవి (G20 Presidency) చేపట్టనున్న నేపథ్యంలో లోగో డిజైన్ చేయాల్సి ఉంటుంది.

ఇంకా చదవండి ...
భారతదేశం జీ20 అధ్యక్ష పదవి (G20 Presidency) చేపట్టనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. భారతదేశం జీ-20 సభ్య దేశాల గ్రూప్ అధ్యక్ష పదవి చేపట్టనుంది. ఫిబ్రవరిలోనే జీ-20 సెక్రటేరియట్ ఏర్పాటు చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి వర్గం ఆమోదం కూడా తెలిపింది. భారతదేశం 2022 డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకు జీ-20 అధ్యక్ష బాధ్యతల్ని చూసుకోనుంది. ఆ తర్వాత 2023 లో జీ20 శిఖరాగ్ర సమావేశానికి (G20 Summit) భారతదేశం ఆతిథ్యం కూడా ఇవ్వనుంది. దీంతో ఈ కార్యక్రమాన్ని భారతదేశం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇందుకోసం లోగో డిజైన్ చేసేందుకు ఓ కాంటెస్ట్ ప్రకటించింది.

కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఈ కాంటెస్ట్‌కు సంబంధించిన వివరాలను ట్వీట్ చేశారు. భారతదేశం రాబోయే G20 ప్రెసిడెన్సీ కోసం లోగో డిజైన్ కాంటెస్ట్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందని, ప్రత్యేకంగా భారతీయ G20కి ప్రాతినిధ్యం వహించే మీ ఆలోచనల్ని తమతో పంచుకోవాలని, 2022 జూన్ 7 వరకు ఎంట్రీలు పంపొచ్చన్నది ఆ ట్వీట్ సారాంశం. ఈ కాంటెస్ట్‌లో పాల్గొనాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరారు.

Aadhaar Update: ఇక ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు... ఈ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే


ఈ కాంటెస్ట్‌లో ఎవరైనా పాల్గొనొచ్చు. కాంటెస్ట్‌లో పాల్గొనేవారు భారతీయ జీ20ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రతిబింబించేలా లోగో రూపొందించాలి. లోగోలో త్రివర్ణపతాకం ఉండాలి. G20 లోగోలో ప్రధానంగా కనిపించాలి. భారతీయ సంస్కృతి, వారసత్వం, తత్వశాస్త్రం ప్రతిబింబించే భారతీయ చిహ్నాలు,వాస్తుశిల్పం, జాతీయ చిహ్నాలు, ఆర్థిక పురోగతి, శాస్త్రీయ సాధన, భిన్నత్వంలో ఏకత్వం లాంటివి ఉపయోగించుకోవచ్చు. లోగోలోని టెక్స్‌ట్ ఇంగ్లీష్‌లో ఉండాలి.

ఆసక్తిగలవారు లోగోలు తయారు చేసి 2022 జూన్ 7 వరకు ఎంట్రీలు పంపొచ్చు. మొదటి విజేతకు రూ.1,50,000 లభిస్తుంది. ఆ తర్వాత ఐదు బెస్ట్ ఎంట్రీలకు రూ.15,000 చొప్పున లభిస్తుంది. ఆ తర్వాత షార్ట్‌లిస్ట్ అయిన ఐదు ఎంట్రీలకు రూ.10,000 చొప్పున లభిస్తుంది. టీడీఎస్ మినహాయించిన తర్వాత ప్రైజ్ మనీ ఇస్తారు.

Price Hike: స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టీవీ కొనాలంటే ఇప్పుడే కొనేయండి... త్వరలో ధరలు పెరుగుతాయి

అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి జీ20 ప్రధాన వేదిక. ప్రపంచ ఆర్థిక పాలనలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. భారతదేశం తొలిసారి జీ20 అధ్యక్ష పదవిని చేపట్టబోతోంది. 2022 డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకు ఈ పదవీకాలం ఉంటుంది. 2023లో జీ20 శిఖరాగ్ర సమావేశం ముగుస్తుంది. భారతదేశం తన ప్రెసిడెన్సీ సమయంలో, ఆ ఏడాదికి ఎజెండాను నిర్దేశిస్తుంది. వాతావరణం, పర్యావరణం, వాణిజ్యం, పెట్టుబడి, ఆరోగ్యం, వ్యవసాయం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, ఇంధనం, అవినీతి నిరోధకం, ఉపాధి, విద్య, పర్యాటకం, సంస్కృతి లాంటి అంశాలపై చర్చలు జరుపుతుంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: G20 Summit, Modi, Narendra modi, Pm modi

తదుపరి వార్తలు