టీవీ, ఫ్రిజ్ కొంటారా? ధరలు పెరగనున్నాయి...

ఫెస్టివల్ సీజన్‌లో ధరలు పెంచలేదు కంపెనీలు. పండుగ సీజన్ తర్వాత హోమ్ అప్లయెన్సెస్ ధరలు పెరుగుతాయన్న వాదన కూడా చాలాకాలంగా వినిపిస్తోంది. ఇప్పుడు పండుగ సీజన్ ముగియడంతో ధరల్ని పెంచడం వైపు మొగ్గుచూపుతున్నాయి కంపెనీలు.

news18-telugu
Updated: November 26, 2018, 11:03 AM IST
టీవీ, ఫ్రిజ్ కొంటారా? ధరలు పెరగనున్నాయి...
ప్రతీకాత్మక చిత్రం (Reuters)
  • Share this:
కొత్త సంవత్సరంలో కొత్త టీవీ కొనాలనుకుంటున్నారా? న్యూ ఇయర్ సేల్‌లో ఫ్రిజ్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే మీరు అనుకున్న బడ్జెట్ కన్నా కాస్త ఎక్కువగానే డబ్బులు పెట్టుకోండి. ఎందుకంటారా? టీవీ, ఫ్రిజ్‌లాంటి హోమ్ అప్లయెన్సెస్ ధరలు భారీగా పెరగనున్నాయి. ఫెస్టీవ్ సీజన్ సేల్స్ ముగియడంతో ఇక కంపెనీలన్నీ ధరలు పెంచే ఆలోచనలో ఉన్నాయి. ఇన్‌పుట్ కాస్ట్ ప్రభావం, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం, కస్టమ్ డ్యూటీ కూడా పెరగడం లాంటి కారణాలతో ధరలు పెంచక తప్పదన్నది కంపెనీల వాదన. ఇప్పటికే పలు కంపెనీలు ధరల్ని పెంచాయి. పానాసోనిక్ ఇండియా కూడా 5-7 శాతం వరకు ధరల్ని పెంచే ఆలోచనలో ఉంది.

దసరా, దీపావళి, ఓనమ్ పండుగల సందర్భంగా ఇంట్లోకి కొత్త వస్తువులు కొనడం చాలామందికి అలవాటు. ఈ సమయంలోనే టీవీ, ప్రిజ్‌, వాషింగ్ మెషీన్, ఏసీ లాంటి హోమ్ అప్లయెన్సెస్ అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ఏడాది మొత్తం అమ్మకాల్లో 30 శాతం సేల్స్ ఈ పండుగ సీజన్‌లోనే ఉంటాయి. అందుకే ఫెస్టివల్ సీజన్‌లో ధరలు పెంచలేదు కంపెనీలు. పండుగ సీజన్ తర్వాత హోమ్ అప్లయెన్సెస్ ధరలు పెరుగుతాయన్న వాదన కూడా చాలాకాలంగా వినిపిస్తోంది. ఇప్పుడు పండుగ సీజన్ ముగియడంతో ధరల్ని పెంచడం వైపు మొగ్గుచూపుతున్నాయి కంపెనీలు.

సెప్టెంబర్‌లోనే 3-4 శాతం ధరలు పెంచినా అంతగా ఒరిగిందేమీ లేదన్నది కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్(సీఈఓఎంఓ) వాదన. కారణం... పండుగ సీజనే. ఓవైపు ధరలు పెంచినా... అమ్మకాలు పెంచుకోవాలన్న కారణంతో కంపెనీలు... డిస్కౌంట్ ఆఫర్లిచ్చాయి. దీంతో పెంచిన ధరలు అమల్లోకి రాలేదు. ఇక ఇప్పుడు పండుగ సీజన్ ముగిసిపోయింది. ధరలు పెంచక తప్పదన్న ఆలోచనలో ఉన్నాయి కంపెనీలు.

ఇవి కూడా చదవండి:రూ.2 లక్షల్లోపు టాప్ 5 మోటార్ సైకిళ్లు ఇవే...

గుడ్ న్యూస్: ఇక డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ మొబైల్‌లో చూపిస్తే చాలు

మీ ఏటీఎం కార్డు బ్లాక్: ఎస్‌‌బీఐ ఖాతాదారులకు హెచ్చరికచిరువ్యాపారులకు డిజిటల్ స్కిల్స్ నేర్పనున్న ఫేస్‌బుక్
First published: November 26, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు