హోమ్ /వార్తలు /బిజినెస్ /

Onion Price: ద్యావుడా.. కిలో చికెన్ రూ.300, కేజీ ఉల్లిపాయలు రూ.900.. ఆకాశాన్ని తాకిన రేట్లు!

Onion Price: ద్యావుడా.. కిలో చికెన్ రూ.300, కేజీ ఉల్లిపాయలు రూ.900.. ఆకాశాన్ని తాకిన రేట్లు!

Onion Price: ద్యావుడా.. కిలో చికెన్ రూ.300, కేజీ ఉల్లిపాయలు రూ.900.. ఆకాశాన్ని తాకిన రేట్లు!

Onion Price: ద్యావుడా.. కిలో చికెన్ రూ.300, కేజీ ఉల్లిపాయలు రూ.900.. ఆకాశాన్ని తాకిన రేట్లు!

Price Hike | ఉల్లిపాయల ధర కేజీకి రూ.900కు చేరింది. అలాగే చికెన్ రేటు అయితే రూ. 300కు పెరిగింది. ఇది శ్రీలంకలోనో.. లేదంటే పాకిస్తాన్‌లోనో కాదు. మరో దేశంలో కూడా ధరలు ఆకాశాన్ని తాకాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Onion Rate | ఉల్లి ధర.. ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టమే. ఎందుకంటే ఉల్లి ధర రూపాయికి (Rupee) పడిపోతుంది. మరోవైపు ఆకాశాన్ని తాకుంది. ఇలా ఉల్లి నవ్విస్తుంది. ఏడిపిస్తుంది. ఇప్పుడు ఈ ఉల్లి గోల ఏంటని ఆలోచిస్తున్నారా? అక్కడికే వస్తున్నాను. ఉల్లి ధర కేజీకి ఏకంగా రూ. 900 పైకి చేరింది. ఇది మన దగ్గర మాత్రం కాదు. అలాగని పాకిస్థాన్ లేదా శ్రీలంకలో ఉల్లి ధర ఈ స్థాయిలో పెరిగి ఉంటుందని అనుకుంటున్నారేమో? అక్కడ కూడా కాదు. మరి ఎక్కడ ఉల్లి (Onion) ధర రూ. 900కు చేరింది? అని అనుకుంటున్నారా? ఫిలిప్పిన్స్‌లో ఈ పరిస్థితి నెలకొంది.

బీబీసీ రిపోర్ట్ ప్రకారం చూస్తే.. ఫిలిప్పిన్స్‌లో కేజి ఉల్లి ధర రూ. 900కు చేరింది. అలాగే కేజీ చికెన్ రేటు రూ. 300 వద్ద ఉంది. మన దేశంలో ఉల్లి ధర కేజీకి రూ.20 వద్ద ఉందని చెప్పుకోవచ్చు. అలాగే చికెన్ రేటు కేజీకి రూ. 200కు పైన ఉంది. అంటే పిలిప్పిన్స్‌లో ఉల్లి గడ్డల కన్నా చికెన్ ధర తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఫిలిప్పిన్స్‌లో లేబర్ రోజూవారీ సగటు వేతనం కన్నా ఉల్లి రేటు ఎక్కువగా ఉండటం గమనార్హం.

ఇక ఈ నెలలో బ్యాంకులు పని చేసేది 3 రోజులే.. 5 రోజులు సెలవులు!

జనవరి నెల ఆరంభంలో 31 వేల డాలర్ల విలువై ఉల్లి సరుకును ఫిలిప్పిన్స్‌లో సీజ్ చేశారు. దుస్తుల పేరుతో చైనా నుంచి ఈ ఉల్లిపాయలను తీసుకువచ్చారు. అంటే ఏ స్థాయిలో ఉల్లి గడ్డలకు డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఫిలిప్పిన్స్‌లో ఉల్లి ధరలు ఈ స్థాయిలో పెరగడానికి కారణాలు ఏంటివో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. దీనికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి.

బజాజ్ ఫైనాన్స్ కీలక నిర్ణయం.. కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త!

ఉల్లి దిగుబడి పడిపోవడం ప్రధాన కారణం. దీని వల్ల ధరలు పైపైకి చేరాయి. అలాగే సముద్ర తుఫాను కారణంగా ఉల్లి పంట బాగా దెబ్బతినడం మరో కారణం. ఉల్లి ధరలు పెరిగిపోవడంతో అక్కడి ప్రభుత్వం ఇప్పుడు దిగుమతులపై ఆధారపడుతోంది. ఫిలిప్పిన్స్‌లో ప్రజలు వారు పండించే ఉల్లి పంట కన్నా ఎక్కువగా ఉల్లిని ఉపయోగిస్తున్నారు. కేవలం పిలిప్పిన్స్‌లో మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా చూసినా కూడా ఉల్లి అనేది ఎక్కువగా ఉపయోగించే మూడో వెజిటబుల్ కావడం గమనార్హం. ఇకపోతే మన దేశంలో కూడా రానున్న రోజుల్లో ఉల్లి ధర పైకి చేరొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. కాగా ఉల్లిని మన దేశంలో రాజకీయంగా కూడా చేస్తారు. ధరలు పెరిగితే రాజకీయ పార్టీలు దాన్ని అవకాశంగా మార్చుకుంటూ ఉండటాన్ని మనం చూస్తూనే ఉంటాం.

First published:

Tags: Chicken, Chicken rate, Onion, Onion price, Onion Prices, Price Hike

ఉత్తమ కథలు