Home /News /business /

PRICE HIKES IMPACT ON AUTOMOBILE INDUSTRY RATES ARE RISING AK GH

Vehicles: ధరల పెరుగుదలతో కార్ల కంపెనీలపై భారం.. రేట్లు పెంచుతున్న కంపెనీలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం భారత్‌లో వాహనాల (Vehicles) ధరలు మరింత ప్రియం (Costly)గా మారుతున్నాయి. వాహన తయారీ కంపెనీలన్నీ తమ వెహికల్ ధరలు పెంచేస్తున్నాయి. ఇన్‌పుట్ కాస్ట్స్ పెరగడమే ఇందుకు కారణం.

ప్రస్తుతం భారత్‌లో వాహనాల (Vehicles) ధరలు మరింత ప్రియం (Costly)గా మారుతున్నాయి. వాహన తయారీ కంపెనీలన్నీ తమ వెహికల్ ధరలు పెంచేస్తున్నాయి. ఇన్‌పుట్ కాస్ట్స్ పెరగడమే ఇందుకు కారణం. ఓ లేటెస్ట్ నివేదిక ప్రకారం... చైనా, జపాన్‌ దేశాలు సప్లై చైన్ (Supply Chain) కష్టాలను ఫేస్ చేస్తున్నాయి. ఈ దేశాలపై భారతీయ వాహన తయారీదారులు చాలావరకు ఆధార పడుతున్నారు. అయితే ఈ దేశాలు సప్లై చైన్ సమస్యలతో సతమతమవుతుండగా... ఇన్‌పుట్ కాస్ట్స్ (Input Costs) విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటిని నియంత్రించడం ఆటోమేకర్ (Automaker) కంపెనీలకు చాలా కష్టంగా మారిందని ఒక లేటెస్ట్ నివేదిక తెలిపింది. పెరుగుతున్న ప్రొడక్షన్ కాస్ట్స్ భరించలేని ఆటోమేకర్ కంపెనీలు వినియోగదారులపై ఆ భారాన్ని మోపేందుకు రెడీ అయినట్లు ఆ రిపోర్టు వెల్లడించింది. ముడిసరుకు ధరల పెంపు వల్ల ఇండియన్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు సగటున కనీసం 2 శాతం ధరలను పెంచుతున్నాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ లేటెస్ట్ రిపోర్ట్ పేర్కొంది.

రా మెటీరియల్ (Raw Material Price) ప్రైస్ పెరుగుతున్న నేపథ్యంలో కియా మోటార్స్ (KIA Motors) ఇప్పటికే తన అన్ని వాహనాల ధరలను పెంచింది. మారుతి సుజుకి (Maruti Suzuki) కూడా జనవరి నుంచి తన కార్ల సగటు ధరను 8.8 శాతం పెంచింది. “టయోటా, టాటా మోటార్స్, హ్యుందాయ్, ఎమ్‌జీ మోటార్స్ కూడా తమ వాహనాల ధరలను పెంచాయి. బీఎమ్‌డబ్ల్యూ ఇండియా, మెర్సిడెస్ బెంజ్ ఇండియా, ఆడి ఇండియా (Audi India) వంటి ప్రీమియం వాహన బ్రాండ్‌లు కూడా తమ వాహనాల ధరలను కనీసం 3 శాతం పెంచుతున్నట్లు ప్రకటించాయి" అని సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ సౌమెన్ మండల్ చెప్పారు.

ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలు (EV) తయారు చేయడం చాలా తక్కువ. ఈ కారణంగా లిథియం, కోబాల్ట్ అధిక ధరలు భారతదేశంలోని ఈవీ ఇండస్ట్రీపై నేరుగా ప్రభావం చూపలేదు. “భారత్‌లో వాహనాల ధరల పెంపుకు ప్రధాన కారణం ఉక్కు (Steel) ధరలు పెరగడం. వాహనం ఛాసిస్ (Chassis), బాడీ తయారీలో స్టీల్ యూజ్ చేస్తారు. నికెల్-కలిగిన స్టెయిన్‌లెస్ స్టీల్ కొన్ని డ్రైవ్‌ట్రెయిన్ భాగాలలో వాడటం జరుగుతుంది" అని మండల్ పేర్కొన్నారు.

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ పెంపు.. ఎంత?, ఎప్పటి నుంచి అమల్లోకి.. వివరాలివే

Petrol Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు.. రెండు వారాలుగా ఉపశమనం -ఇవాళ రేట్లు ఇలా

పెరుగుతున్న మెటీరియల్ కాస్ట్స్‌తో పాటు, మారుతున్న మారకపు రేట్లు, పెరుగుతున్న ఆపరేషనల్ కాస్ట్స్ కూడా దేశంలో ధరల పెరుగుదలకు కారణం అవుతున్నాయి. సెమీకండక్టర్ కొరత సమస్యలు కొంతవరకు తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాదిలో అమ్మకాలు పెరిగాయి. దీనితో 2022ని బెటర్ ఇయర్‌గా నిపుణులు అంచనా వేస్తున్నారు. 2021లో ఈవీ అమ్మకాలు 200 శాతానికి పైగా పెరిగాయి, అయితే ధరల పెరుగుదల ఈ వేగవంతమైన వృద్ధికి బ్రేకులు వేసే అవకాశం ఉంది. 2022 ఏడాదిలో గ్లోబల్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు సుమారు 72 మిలియన్లుగా ఉండొచ్చని.. ఇది తమ మునుపటి అంచనాల కంటే 5 మిలియన్ యూనిట్లు తక్కువ అని నివేదిక పేర్కొంది.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Automobiles

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు