హోమ్ /వార్తలు /బిజినెస్ /

Price Hike: ఎఫ్‌సీఐ గోధుమల కోసం ఎదురుచూస్తున్న కంపెనీలు.. బ్రెడ్, బిస్కెట్ ధరలు పెరిగే అవకాశం..

Price Hike: ఎఫ్‌సీఐ గోధుమల కోసం ఎదురుచూస్తున్న కంపెనీలు.. బ్రెడ్, బిస్కెట్ ధరలు పెరిగే అవకాశం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుత సంవత్సరంలో గోధుమల కోసం కేంద్ర ప్రభుత్వం ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్(OMSS)ని ఇంకా ప్రకటించలేదు. దీంతో వచ్చే నెల నుంచి బ్రెడ్, బిస్కెట్లు, రోటీ, పరాఠా ధరలు పెరిగే అవకాశం ఉంది.

ప్రస్తుత సంవత్సరంలో గోధుమల కోసం కేంద్ర ప్రభుత్వం(Government) ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్(OMSS)ని ఇంకా ప్రకటించలేదు. దీంతో వచ్చే నెల నుంచి బ్రెడ్, బిస్కెట్లు(Biscuits), రోటీ, పరాఠా ధరలు పెరిగే అవకాశం ఉంది. బహిరంగ మార్కెట్ సరఫరా, ధరలను నియంత్రించే OMSS పథకం లేకపోవడంతో గోధుమపిండి, రొట్టె, బిస్కెట్ తయారీదారులు ద్రవ్యోల్బణం, లీన్ సీజన్ కొరత గురించి భయపడుతున్నారు. వర్షాకాలం ప్రారంభం కారణంగా విద్యాసంస్థలు పునఃప్రారంభం కావడం, చిరుతిళ్లలో పెరుగుదల కారణంగా సాంప్రదాయకంగా డిమాండ్ పెరిగినప్పుడు జూన్ నుంచి ఈ ప్రభావం కనిపించవచ్చు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(FCI-Food Corporation Of India) తన వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు ఆహార ధాన్యాల సరఫరాను మెరుగుపరచడానికి, ముఖ్యంగా లీన్ సీజన్‌లో గోధుమలను పెంచడానికి తద్వారా లోటు ప్రాంతాలలో బహిరంగ మార్కెట్ ధరలను నియంత్రించడానికి OMSS కింద గోధుమలను విక్రయిస్తుంది.

ఆహార మంత్రిత్వ శాఖకు ఫ్లోర్‌ మిల్లింగ్ పరిశ్రమ లేఖ

మార్కెట్‌లో గోధుమల స్థితిని బట్టి, మిల్లింగ్ పరిశ్రమల ద్వారా FCI గోధుమలను కొనుగోలు చేయడం ఒక సంవత్సరంలో దాదాపు 7- 8 మిలియన్ టన్నుల వరకు ఉండవచ్చు. భారతదేశం గత 3 సంవత్సరాలలో మిగులు గోధుమలు ఉన్నాయి. ఎక్కువగా ఉన్న నిల్వలను తగ్గిచేందుకు FCI డిస్కౌంట్లు, సరకు రవాణా సబ్సిడీలను అందించింది. దేశీయ గోధుమ ప్రాసెసింగ్ పరిశ్రమ 2021-22లో ప్రభుత్వం నుండి 7 మిలియన్ టన్నుల గోధుమలను సేకరించింది. ఈ సంవత్సరం, ప్రభుత్వం OMSS విధానం కొనసాగింపును ప్రకటించకపోతే, పరిశ్రమ బహిరంగ మార్కెట్ నుండి 100 శాతం గోధుమలను కొనుగోలు చేయవలసి ఉంటుంది.

ఫ్లోర్‌ మిల్లింగ్ పరిశ్రమ ఆహార మంత్రిత్వ శాఖకు ఇటీవల రాసిన లేఖలో..‘సంవత్సరం చివరి భాగంలో OMSS ద్వారా మార్కెట్‌లోకి గోధుమలు పంపడానికి ప్రభుత్వం వద్ద నిల్వలు లేవని స్పష్టమైంది. తమ సొంత సంక్షేమ పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు గోధుమ సరఫరా కూడా నిలిచిపోయింది. ఇది ఊహించిన సంక్షోభాన్ని ప్రతిబింబిస్తుంది. భవిష్యత్తులో మార్కెట్‌లో గోధుమ పిండిని సరసమైన ధరలకు సరఫరా చేయగలమా? అని పరిశ్రమ భయపడుతోంది. దీని ఫలితంగా బ్రెడ్, బిస్కెట్ పరిశ్రమలపై కూడా ప్రభావం కనిపించవచ్చు.’ అని పేర్కొన్నారు.

Business Idea: ఈ బిజినెస్ కు సర్కార్ సాయం.. లక్షల కొద్దీ ఆదాయం.. తెలుసుకోండి

ధరల నియంత్రణకు ఏకైక ఆయుధం ఓఎంఎస్‌ఎస్‌

ముంబయికి చెందిన ఫ్లోర్ మిల్లర్, ఎగుమతిదారు అజయ్ గోయెల్ మాట్లాడుతూ.‘ఓఎంఎస్ఎస్ బహిరంగ మార్కెట్ గోధుమ ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న ఏకైక ఆయుధం. దీనిని ప్రభుత్వం మార్కెట్ నియంత్రణ కార్యక్రమంగా ఉపయోగిస్తుంది. దేశంలోని మిల్లింగ్ పరిశ్రమ గతంలో ఇలాంటి ధరల అస్థిరతను చూడలేదు. స్టాకిస్టులు, ఎగుమతిదారులు చాలా ఎక్కువ ధరలకు గోధుమలను కొనుగోలు చేస్తున్నందున.. గోధుమల ధర సమస్య ఏర్పడుతుంది. చాలా మంది మధ్యస్థ, చిన్న సైజు మిల్లర్లు ఏడాది పొడవునా గోధుమలను నిల్వ చేయలేరు’ అని చెప్పారు.

ప్రభుత్వం వద్ద గోధముల నిల్వలు లేకపోయే ప్రమాదం..

ప్రస్తుతం కోతలు కొనసాగుతున్నందున మండీల్లో గోధుమలు అందుబాటులో ఉన్నాయి. గోధుమ లభ్యత తక్కువగా ఉండే సీజన్ అయిన నవంబర్/డిసెంబర్ వరకు స్టాకిస్టులు గోధుమలను మార్కెట్‌కి తీసుకురాకపోవచ్చు. కాబట్టి ధరలపై నిజమైన ప్రభావం నెల తర్వాత కనిపించే సూచనలు ఉన్నాయి. ఇతర ధరల ఆవిష్కరణ విధానం లేనప్పుడు, OMSS ధరలు గోధుమలకు మార్కెట్ బెంచ్‌మార్క్ ధరగా పనిచేస్తాయి. కొనసాగుతున్న రబీ మార్కెటింగ్ సీజన్‌లో ప్రభుత్వం 19.5 మిలియన్ టన్నుల గోధుమలను సేకరించాలని భావిస్తోంది. ఇది 18.99 మిలియన్ టన్నుల స్టాక్‌ను కొనసాగిస్తోంది. ఈ విధంగా 38.5 మిలియన్ టన్నుల నిల్వలో.. వివిధ సంక్షేమ పథకాలకు 30.5 మిలియన్ టన్నులు అవసరమవుతాయి. అత్యవసర అవసరాల కోసం 7.5 మిలియన్ టన్నుల గోధుమలను నిల్వ చేయవచ్చు. వీటి అనంతరం ప్రభుత్వం వద్ద గోధుమల నిల్వలు ఉండవని పరిశ్రమ భయపడుతోంది.

First published:

Tags: Cosnumers, Fci, Food prices, Open market, Sales

ఉత్తమ కథలు