Home /News /business /

PREPAYING HOME LOAN DO IT EARLY TO SAVE MORE ON INTEREST MK GH

Prepaying Home Loan: గడువుకు ముందే హోమ్ లోన్ చెల్లిస్తున్నారా? ఎక్కువ లబ్ధి కోసం పాటించాల్సిన నిబంధనలివే

చాలామంది హోమ్ లోన్ తీసుకొని కొన్నేళ్ల పాటు దాని ఈఎంఐ కడుతూ ఉంటారు. అయితే ఈ మధ్యలో ఎప్పుడైనా కాస్త డబ్బు ఎక్కువగా వస్తే.. ఆ లోన్‌ను ప్రీ పేమెంట్ చేస్తూ ఉంటారు. అంటే నిర్ధిష్ట గడువుకు ముందే లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించాలనుకుంటారు. ఈ విషయంలో కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.. ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని ఆర్థిక నిపుణులు వెల్లడిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...

మోహన్ తన ఇంటి పై 75 లక్షల రూపాయల లోన్ తీసుకున్నాడు. 25 సంవత్సరాలకు గాను 7.5 శాతం వడ్డీ రేటుతో.. నెలకు రూ.55, 424 ఈఎంఐ కడుతున్నాడు. ఈ 25 సంవత్సరాల్లో.. అతడు తీసుకున్న లోన్, దానికి వడ్డీ కలిపి రూ.91.2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ముందు కాస్త ప్రీపేమెంట్ చేస్తే ఈ మొత్తం చాలా వరకు తగ్గే వీలుంటుంది.

దీనిగురించి తెలుసుకోవాలంటే ముందు హోమ్ లోన్ ఈఎంఐలు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈఎంఐ లో కొంత మొత్తం వడ్డీ, మరికొంత అసలు కలిపి చెల్లించాల్సి ఉంటుంది. లోన్ తీసుకున్న మొదటి కొన్ని సంవత్సరాలలో ఈఎంఐలో ఎక్కువ భాగం వడ్డీ కిందకే వెళ్తుంది. చాలా తక్కువ మొత్తమే అసలు మొత్తంలో తగ్గుతుంది. ఉదాహరణకు 75 లక్షల రూపాయల లోన్ తీసుకుంటే మొదటి సంవత్సరంలో కేవలం 16 శాతం మాత్రమే అసలు మొత్తానికి వెళ్తుంది. మిగిలిన మొత్తం అంతా వడ్డీయే అని చెప్పుకోవచ్చు. అంటే సంవత్సరంలో మనం చెల్లించే 6.65 లక్షల రూపాయలు (నెలకు 55,424) చొప్పున చెల్లించిన మొత్తంలో కేవలం 16 శాతం మాత్రమే అసలు మొత్తం అన్నమాట. 10 సంవత్సరాలకు ఈ మొత్తం 31 శాతానికి, 20వ సంవత్సరం 66 శాతానికి పెరుగుతుంది. ప్రతి నెల అసలు మొత్తం తగ్గుతున్న కొద్దీ వడ్డీ శాతం కూడా తగ్గుతూ పోతుంది.

అందుకే లోన్ తీసుకున్న మొదటి కొన్ని సంవత్సరాల్లోనే ప్రీపేమెంట్ చేయడానికి ప్రయత్నించాలి. దీనివల్ల అసలు మొత్తం తగ్గుతూ, వడ్డీ మొత్తం కూడా ఎక్కువగా తగ్గే వీలుంటుంది. ఉదాహరణకు మీరు మీ ప్రీపేమెంట్ గా రూ. 15 లక్షలు చెల్లించాలని భావించారనుకోండి. అదే రెండో సంవత్సరంలో చేసిన దానికి పన్నెండో సంవత్సరంలో చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. రెండో సంవత్సరంలో ప్రీ పేమెంట్ చేయడం వల్ల మీరు చెల్లించాల్సిన ఈఎంఐలో మార్పు లేకపోయినా మీరు ఈఎంఐ కట్టాల్సిన గడువు ఎనిమిది సంవత్సరాల మేర తగ్గుతుంది. మీరు చెల్లించాల్సిన వడ్డీ రూ.91 లక్షల నుంచి రూ.47 లక్షలకు తగ్గుతుంది.

అదే పన్నెండో సంవత్సరంలో రూ. 15 లక్షలు ప్రీపేమెంట్ చేస్తే.. మీరు ఈఎంఐ కట్టాల్సిన గడువు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే తగ్గుతుంది. ఈ మేరకు వడ్డీతో పాటు అసలు కూడా మిగులుతుంది. ఇలా రూ.73. 4 లక్షల వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అందుకే వీలైనంత వరకు ప్రీపేమెంట్ ని మొదట కొన్ని సంవత్సరాల్లో చేయడం మంచిది.

అయితే మొదటి సంవత్సరాల్లో మీ దగ్గర ప్రీపేమెంట్ చేయడానికి తగిన మొత్తం లేకపోతే ఎలా అనుకుంటున్నారా? నెలకు రూ.10, 000 చొప్పున ప్రతి నెల కడితే కూడా మీరు చెల్లించాల్సిన మొత్తం తగ్గుతుంది.

మూడో సంవత్సరంలో నెలకు రూ. 10 వేల చొప్పున ప్రీ పేమెంట్ చేయడం ప్రారంభిస్తే మొత్తం చెల్లించాల్సిన వడ్డీ రూ. 63.1 లక్షలు.. అదే 13వ సంవత్సరంలో ఇలా రూ. 10,000 చెల్లించడం ప్రారంభిస్తే.. మొత్తం చెల్లించాల్సిన వడ్డీ పెద్దగా తగ్గదు. కేవలం రూ.91 లక్షల నుంచి రూ.83 లక్షల వరకు మాత్రమే తగ్గుతుంది. చాలామంది ఒకేసారి పెద్ద మొత్తాన్ని తీసుకురావడం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే నెలకు కొంత మొత్తం చొప్పున ప్రీ పేమెంట్ చేయడం మంచిది.
Published by:Krishna Adithya
First published:

Tags: Home loan

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు