Maruti Swift కారు...కొత్త బైకు ధరలోనే మీ సొంతం...ఇక్కడే...

నేటి కాలంలో కారు అనేది ఒక అవసరంగా మారింది. రూ .3 లక్షల వరకు కారు కొనలేకపోతే నిరాశ చెందకండి. అయితే ప్రస్తతుం కొత్త బైక్‌ ఖర్చుతో మారుతి ఆల్టో, స్విఫ్ట్ వంటి కార్లు లభిస్తున్నాయి.

Krishna Adithya | news18-telugu
Updated: August 4, 2020, 9:58 AM IST
Maruti Swift కారు...కొత్త బైకు ధరలోనే మీ సొంతం...ఇక్కడే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కారు కొనడం అనేది సామాన్యుడి కల...ముఖ్యంగా కరోనా సంక్షోభంలో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాడకం అనేది వైరస్ వ్యాప్తికి కారణం అవుతుంది. దీంతో కారు కొనుగోళ్లపై ఇప్పుుడు అందరి దృష్టి పడింది. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఒక చౌక కారు కొనాలంటే...కనీసం రూ. 3 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అయితే అంత మొత్తం మీ బడ్జెట్ లో ఉండకపోవచ్చు. కానీ నేటి కాలంలో కారు అనేది ఒక అవసరంగా మారింది. రూ .3 లక్షల వరకు కారు కొనలేకపోతే నిరాశ చెందకండి. అయితే ప్రస్తతుం కొత్త బైక్‌ ఖర్చుతో మారుతి ఆల్టో, స్విఫ్ట్ వంటి కార్లు లభిస్తున్నాయి. అయితే కార్స్ సెకండ్ సేల్స్ లో మీకు అద్భుతమైన పనితీరు ఉన్న కార్లు లభిస్తాయి. సెకండ్ హ్యాండ్ కారు అంటే అనుమానం సహజమే...అయితే మారుతి సంస్థ స్వయంగా నిర్వహిస్తున్న Maruti Suzuki True Value ద్వారా Certified Used Cars‎ను పొందవచ్చు. స్వయంగా మారుతి కార్లను తయారు చేసే సంస్థే సెకండ్స్ సేల్స్ కు వేదికగా నిలవడం కస్టమర్లకు కొండంత భరోసాను ఇస్తోంది.

మారుతి వాగన్ ఆర్ (Maruti Suzuki WagonR)కేవలం రూ .33000 మాత్రమే...

అవును మీరు విన్నది నిజమే మారుతి సంస్థలో అత్యంత ప్రజాదరణ పొందిన కారు Maruti Suzuki WagonRను కేవలం రూ .33000 కే ట్రూ వేల్యూలో పొందవచ్చు. అయితే, మీరు ఈ కారు 2006 మోడల్‌ ఈ ప్రైస్ రేంజ్ లో అందుబాటులో ఉంది. True Value సమాచారం ప్రకారం, ఈ కారు ఇప్పటికే 1 లక్ష కిలోమీటర్లకు పైగా నడిచింది. ఇప్పుడు ఈ కారు కేవలం రూ .33000 ధరకే పలుకుతోంది.

మారుతి స్విఫ్ట్‌ (Maruti Suzuki Swift) రూ .50000కే లభిస్తుంది...
మరో ప్రసిద్ధ మారుతి కారు స్విఫ్ట్ కూడా True Valueలో అమ్మకానికి ఉంది. ఇది 2006 మోడల్ ఈ కారు 1 లక్ష కిలోమీటర్ల కన్నా తక్కువ నడిచినప్పటికీ. ఈ మోడల్‌ను 50000 రూపాయలకు పొందుతారు.

మారుతి ఆల్టో 800 (Maruti Suzuki Alto)
ఆల్టో 800 మారుతి సెకండ్ హ్యాండ్ కార్ ప్లాట్‌ఫాం ట్రూవాల్యూలో కూడా అమ్మకానికి ఉంది. ఆల్టో 800 లాక్సి వేరియంట్ 1,90,000 రూపాయలకు లభిస్తుంది. 2014 మోడల్ ఆల్టో 800 కారు ఇప్పటికే 88000 కి.మీ కంటే ఎక్కువ నడిచినప్పటికీ. దీని కండీషన్ గురించి ట్రూ వేల్యూ భరోసా ఇస్తోంది.పేపర్ వర్క్ చాలా సులభం...
మీరు బయట ఎక్కడి నుంచో సెకండ్ హ్యాండ్ కారు కొంటే, అక్కడ పేపర్ వర్క్ అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే వాటిని అమ్మిన యజమానుల నుంచి సరైన పత్రాలు లభించకపోతే...మీరు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. కానీ True Value వద్ద కారు కొనడం పేపర్ వర్క్ ప్రక్రియను చాలా సులభం చేస్తుంది. True Valueలోని అన్ని కార్లు, అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి, తక్కువ కాగితపు పనిని కలిగి ఉంటాయి మరియు ప్రాసెస్ చేయడం చాలా సులభం. మీరు సెకండ్ హ్యాండ్ కారు కొనాలని ప్లాన్ చేస్తే, మీరు ఈ ప్లాట్‌ఫామ్‌లో ఒకసారి ప్రయత్నించవచ్చు, ఇక్కడ మీకు నచ్చిన కారును చాలా తక్కువ ధరకు మరియు చాలా తక్కువ పేపర్ వర్క్ తో పొందవచ్చు.
Published by: Krishna Adithya
First published: August 4, 2020, 9:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading