మొబైల్ యాప్స్‌తో లోన్... తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మీరు మొబైల్ యాప్స్ ద్వారా క్రెడిట్ లైన్ లోన్‌కు అప్లై చేయొచ్చు. MoneyTap, LoanTap, LazyPay, ZestMoney లాంటి యాప్స్‌ని గూగుల్ ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి.

news18-telugu
Updated: January 28, 2019, 5:24 PM IST
మొబైల్ యాప్స్‌తో లోన్... తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మొబైల్ యాప్స్‌తో లోన్... తీసుకోవాల్సిన జాగ్రత్తలు
  • Share this:
ఒకప్పుడు బ్యాంకులో లోన్ కావాలంటే ముప్పుతిప్పలు పడాల్సి వచ్చేది. ఏజెంట్‌కు అప్లికేషన్ ఇచ్చిన దగ్గర్నుంచి అకౌంట్‌లో డబ్బులు పడే వరకు అంతా టెన్షనే. లోన్ వస్తుందో లేదో, ఎంత ఇస్తారో, లేక అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారేమో ఇలా అన్నీ అనుమానాలే. కానీ టెక్నాలజీ పెరిగిపోయింది. లోన్లు మంజూరు చేసే పద్ధతి కూడా మారింది. నిమిషాల్లో లోన్లు ఇచ్చేస్తున్నాయి పలు సంస్థలు. అంతేకాదు... జస్ట్ మొబైల్‌లో ఓ యాప్ ఉంటే చాలు. ఎప్పుడు కావాలంటే అప్పుడు లోన్ వచ్చేస్తోంది. ఇలా మొబైల్ యాప్స్ ద్వారా ఇచ్చే రుణాలను క్రెడిట్ లైన్ లోన్ అని కూడా పిలుస్తారు. అసలు ఏంటి ఈ క్రెడిట్ లైన్ లోన్? పర్సనల్‌ లోన్‌కు క్రెడిట్ లైన్ లోన్‌కు ఉన్న తేడాలేంటీ? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ? తెలుసుకోండి.

Read This: IRCTC: టికెట్ బుక్ చేస్తున్నారా? ఐఆర్‌సీటీసీలో 10 కొత్త ఫీచర్లు ఇవే...

moneytap interest rate, moneytap app, moneytap loan, moneytap credit card, lazypay personal loan, lazypay credit, lazypay limit, lazypay loan, lazypay credit limit, credit line loan, personal loan apps, పర్సనల్ లోన్ యాప్స్, మనీ ట్యాప్, లేజీపే, జెస్ట్ పే


క్రెడిట్ లైన్ లోన్ అంటే ఏంటీ?


క్రెడిట్ లైన్ లోన్ ప్రీ-అప్రూవ్డ్ లోన్ లాంటిదే. ఉదాహరణకు క్రెడిట్ లైన్ లోన్ కింద మీరు రూ.5 లక్షలు మంజూరు అయ్యాయి. కానీ మీరు అందులో రూ.3 లక్షలే వాడుకున్నారు. మీరు కేవలం రూ.3 లక్షలకు వడ్డీ చెల్లిస్తే చాలు. మీరు వాడుకోని డబ్బులకు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. కొన్ని రోజుల తర్వాత మీకు డబ్బులు అవసరమైతే మిగతా రూ.2 లక్షలు వాడుకోవచ్చు. దానికీ వడ్డీ చెల్లించొచ్చు.

పర్సనల్‌ లోన్‌కు క్రెడిట్ లైన్ లోన్‌కు తేడాలేంటీ?


పర్సనల్ లోన్‌లో మీ అర్హతలను బట్టి బ్యాంకు రుణాన్ని మంజూరు చేస్తుంది. మొత్తం డబ్బుల్ని ఒకేసారి మీ అకౌంట్లో వేస్తుంది. మీరు ప్రతీ నెల ఈఎంఐ చెల్లించాలి. మీరు తీసుకున్న లోన్ వాడుకున్నా, వాడుకోకపోయినా ఈఎంఐ, వడ్డీ చెల్లించాల్సిందే. మీరు రూ.5 లక్షలు పర్సనల్ లోన్ తీసుకుంటే మొత్తానికి వడ్డీ చెల్లించాలి. క్రెడిట్ లైన్ లోన్ లాగా విడతల వారీగా రుణం తీసుకునే అవకాశం ఉండదు. మీరు రూ.5 లక్షలు తీసుకొని ఎంత వాడుకున్నా వడ్డీ చెల్లించాల్సింది మాత్రం రూ.5 లక్షలకే. బ్యాంకులో పర్సనల్ లోన్‌కు కనీసం 2-3 రోజుల సమయం పడుతుంది. కానీ క్రెడిట్ లైన్ లోన్ 24 గంటల్లో వస్తుంది. పర్సనల్ లోన్ ఏడాది నుంచి 5 ఏళ్ల కాలవ్యవధిలో చెల్లించాలి. క్రెడిట్ లైన్ లోన్ 2 నుంచి 36 నెలల్లో చెల్లించొచ్చు.Read This: WhatsApp Features: వాట్సప్‌లో ఈ 9 ఫీచర్లు ట్రై చేశారా?

moneytap interest rate, moneytap app, moneytap loan, moneytap credit card, lazypay personal loan, lazypay credit, lazypay limit, lazypay loan, lazypay credit limit, credit line loan, personal loan apps, పర్సనల్ లోన్ యాప్స్, మనీ ట్యాప్, లేజీపే, జెస్ట్ పే


క్రెడిట్ లైన్ లోన్ ఎవరిస్తారు?


క్రెడిట్ లైన్ లోన్స్‌ని ఆన్‌లైన్‌లో ఆఫర్ చేస్తున్న ఫైనాన్స్ సంస్థలు చాలానే ఉన్నాయి. మీకు డబ్బు ఎంత అవసరం ఉంటుందో తెలియనప్పుడు పర్సనల్ లోన్ కన్నా క్రెడిట్ లైన్ లోన్ తీసుకోవడమే మంచిది. పెళ్లి ఖర్చులు, ఇంటి రిపేర్, ఆస్పత్రి బిల్లులు, పిల్లల చదువులు లాంటి వాటికి పర్సనల్ లోన్ కన్నా క్రెడిట్ లైన్ లోన్ ఎంచుకోవడమే మంచిది. MoneyTap, LoanTap, LazyPay, ZestMoney లాంటి పలు సంస్థలు క్రెడిట్ లైన్ లోన్స్ ఇస్తున్నాయి. వీటితో పాటు సిటీ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్ లాంటి బ్యాంక్స్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు కూడా క్రెడిట్ లైన్ లోన్లపై దృష్టిపెట్టాయి. పర్సనల్ లోన్ లాగా తిప్పలు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆన్‌లైన్‌లో లేదా మొబైల్ యాప్ ద్వారా ఈ లోన్స్ పొందొచ్చు.

Read This: Discount on Gold: బంగారంపై 10% డిస్కౌంట్... కొనేందుకు మీరు రెడీనా?

moneytap interest rate, moneytap app, moneytap loan, moneytap credit card, lazypay personal loan, lazypay credit, lazypay limit, lazypay loan, lazypay credit limit, credit line loan, personal loan apps, పర్సనల్ లోన్ యాప్స్, మనీ ట్యాప్, లేజీపే, జెస్ట్ పేమనీట్యాప్, లోన్‌ట్యాప్, లేజీపే, జెస్ట్ మనీ లాంటి ఫిన్‌టెక్ కంపెనీలు గరిష్టంగా రూ.5 లక్షల వరకు క్రెడిట్ లైన్ లోన్స్ ఆఫర్ చేస్తున్నాయి. సిటీ బ్యాంక్ అయితే గరిష్టంగా రూ.25 లక్షల వరకు లోన్ ఇస్తోంది. అయితే గరిష్టంగా లోన్ ఎంత ఇవ్వాలన్నది ఫిన్‌టెక్ కంపెనీలు, బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలపై ఆధారపడి ఉంటుంది. సులువుగా లోన్లు వస్తుండటంతో అనేకమంది ఆన్‌లైన్‌లో మొబైల్ యాప్స్ ద్వారా తీసుకునే లోన్లు ఇటీవల పెరుగుతున్నాయని 'మనీ మూడ్ 2019' పేరుతో బ్యాంక్ బజార్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. లోన్లు తీసుకోవడం మొబైల్ యాప్స్‌తో షాపింగ్ చేసినంత సులువైపోయింది. సగటున నాన్ మెట్రోస్‌లో రూ.2.8 లక్షల వరకు, మెట్రోల్లో రూ.2.55 లక్షల వరకు పర్సనల్ లోన్లు తీసుకున్నట్టు తేలింది. సగటున పురుషులు రూ.2.8 లక్షలు, మహిళలు రూ.2.73 లక్షల లోన్ తీసుకున్నట్టు ఆ అధ్యయనంలో తేలింది.

Read This: XIAOMI MI Days Sale: రెడ్‌మీ, పోకో ఫోన్లపై భారీ తగ్గింపు ప్రకటించిన షావోమీ

moneytap interest rate, moneytap app, moneytap loan, moneytap credit card, lazypay personal loan, lazypay credit, lazypay limit, lazypay loan, lazypay credit limit, credit line loan, personal loan apps, పర్సనల్ లోన్ యాప్స్, మనీ ట్యాప్, లేజీపే, జెస్ట్ పే


మొబైల్ యాప్స్‌తో లోన్ ఎలా తీసుకోవాలి?


ఉదాహరణకు మీకు రూ.3 లక్షలు అవసరం అనుకుందాం. మీరు మొబైల్ యాప్స్ ద్వారా క్రెడిట్ లైన్ లోన్‌కు అప్లై చేయొచ్చు. MoneyTap, LoanTap, LazyPay, ZestMoney లాంటి యాప్స్‌ని గూగుల్ ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీ పేరు, వయస్సు, అడ్రస్, పాన్ నెంబర్ లాంటి వివరాలతో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి. మీ ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని క్రెడిట్ లైన్ ఎలిజిబిలిటీ నిర్ణయిస్తారు. మీ క్రెడిట్ లైన్ లోన్ అప్రూవ్ అయిన తర్వాత మీకు మొబైల్ యాప్, ఇమెయిల్ ద్వారా సమాచారం అందుతుంది. ఆ తర్వాత మీ కేవైసీ డాక్యుమెంట్లు తీసుకొని తుది ఆమోదం కోసం మిమ్మల్ని సంస్థ ప్రతినిధి కలుస్తారు. ఫైనల్ అప్రూవల్ తర్వాత మీరు మీకు కేటాయించిన రుణాన్ని వాడుకోవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ కేవలం 24 గంటల్లో పూర్తవుతుంది. మీకు రూ.5 లక్షల లోన్ అప్రూవ్ చేసినా మీరు రూ.3,000 కూడా వాడుకోవచ్చు.

క్రెడిట్ లైన్ లోన్ ఛార్జీలు ఎలా ఉంటాయి?


మీరు తీసుకున్న రుణం గడువులోగా చెల్లించకపోతే జరిమానా విధిస్తాయి కంపెనీలు. ఒక్కో కంపెనీ ఛార్జీలు ఒక్కోలా ఉంటాయి. ఆలస్య రుసుము, ఈఎంఐ ఓవర్‌‌డ్యూ ఛార్జ్, ప్రీపేమెంట్ ఛార్జ్, బ్యాంక్ బోనస్ ఛార్జ్ ఇలా రకరకాల ఛార్జీలు ఉంటాయి. అందుకే ముందుగానే ఆ ఛార్జీల గురించి తెలుసుకొని లోన్ తీసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి:

Sovereign Gold Bond: గోల్డ్ బాండ్ స్కీమ్‌లో పెట్టుబడి లాభమా? నష్టమా?

JioRail App: జియో యూజర్ల కోసం ప్రత్యేకంగా రైల్ యాప్ రిలీజ్

Alert: నైట్ షిఫ్ట్ ఉద్యోగాలతో క్యాన్సర్ తప్పదా?
First published: January 28, 2019, 5:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading