హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business idea: కొబ్బరిచిప్పలతో లక్షల్లో బిజినెస్‌.. చిన్న ఐడియా అతని జీవితాన్నే మార్చేసింది..!

Business idea: కొబ్బరిచిప్పలతో లక్షల్లో బిజినెస్‌.. చిన్న ఐడియా అతని జీవితాన్నే మార్చేసింది..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొబ్బరి ప్రసాద్‌ (Kobbari Prasad).. ఒకప్పుడు అతనో టైలర్‌ (Tailor)..కానీ కరోనా దెబ్బకు కుదేలైన అతని ఆర్థిక  పరిస్థితి కుదేలైంది. కానీ అతనికొచ్చిన ఒక చిన్న ఆలోచన (Small Business idea)..అతని జీవితాన్నే మార్చేసింది

(uday raj, bhadradri kothagudem)

కొబ్బరి ప్రసాద్‌ (Kobbari Prasad).. ఒకప్పుడు అతనో టైలర్‌ (Tailor)..కానీ కరోనా దెబ్బకు కుదేలైన అతని ఆర్థిక  పరిస్థితి కుదేలైంది. కానీ అతనికొచ్చిన ఒక చిన్న ఆలోచన (Small Business idea)..అతని జీవితాన్నే మార్చేసింది. కొబ్బరిచిప్పలతో (Coconut shell) లక్షలు సంపాదిస్తున్నాడు. స్వయం ఉపాధివైపు అడుగులు వేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అతడే భద్రాధ్రికొత్తగూడెం (Bhadradri kothagudem) జిల్లా కొత్తగూడెం పట్టణానికి చెందిన పిచ్చేటి ప్రసాద్ (Picheti Prasad) అలియాస్ కొబ్బరి ప్రసాద్? ఇంతకీ ఎవరీ ప్రసాద్‌… ఇంతకీ అతను ప్రస్తుతం ఏంచేస్తున్నాడు?

వివరాల్లోకి వెళితే…. కొత్తగూడెం పట్టణం గాజులరాజం బస్తీకి చెందిన పిచ్చేటి ప్రసాద్ (Picheti Prasad) స్థానికంగా టైలరింగ్ పనిచేసే వాడు. వచ్చే ఆ కొద్దిపాటి సంపాదనతో (Income) పాటు కుట్టుమిషన్లు రిపేర్ చేస్తూ జీవనం గడిపేవాడు. వచ్చే వినియోగదారులకు బట్టలు కుట్టడం అలా వచ్చిన సంపాదనతో కుటుంబాన్ని పోషించడమే ఆయనకు తెలుసు. దాదాపు పన్నెండేళ్లుగా సాఫీగా సాగిన అతడి సంసారం కరోనా (Corona)తో ఒక్కసారిగా కుదేలయింది. శుభకార్యాలు లేక అతడి దగ్గరకు వచ్చే కస్టమర్ల సంఖ్య క్రమంగా పడిపోవటంతో అతన్ని ఆర్థిక సమస్యలు వెంటాడాయి.. ఓవైపు కరోనా కల్లోలం.. మరోవైపు ఆర్థిక సంక్షోభం అయినా అతను ఏమాత్రం ఆందోళన చెందలేదు.

ఆర్థిక కల్లోలం గురించి అతడిని గట్టెక్కించిన వ్యాపార ఆలోచన..!

ప్రపంచాన్ని కబలించిన కరోనా అతడి వ్యాపారంపై (Business) ప్రభావం చూపడంతో ఆర్థికంగా చితికిపోయిన ప్రసాద్ ప్రత్యామ్నాయ మార్గాలను (Alternative ways) అన్వేషించాడు. గుడికి వెళ్లి ఆర్థిక సమస్యలనుంచి గట్టెక్కించమని దేవున్ని కోరుకుని కొబ్బరికాయ కొట్టాడు. కొబ్బరికాయ పడలడంతోనే అతని బుర్రలో ఓ ఆలోచన (Business Idea) పుట్టింది. అప్పుడు వచ్చిన ఆ ఐడియానే… ప్రస్తుతం ప్రసాద్ ను సమస్యల సుడిగుండం నుంచి బయటపడేసింది. అదే కొబ్బరి చిప్పల (Coconut shells) వినియోగం.

అనుకుందే తడువుగా కొబ్బరి టెంకల వినియోగం (Usage) గురించి అధ్యయనం చేశాడు.  ఎండుకొబ్బరి చిప్పలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందని తెలుసుకున్నాడు. ఎక్కువ మొత్తంలో కొబ్బరి చిప్పలను సేకరించేందుకు ఆలయాల కార్వనిర్వాహక విభాగంతో ఒప్పందం చేసుకున్నాడు. పచ్చి చిప్పలను ఆరబెట్టి, తక్కువ వేడి సెగ తగిలించి.. ఆపై చిప్పలుగా మార్చే కుటీర పరిశ్రమను ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్నాడు.


తన కష్టార్జితన్నే పెట్టుబడిగా పెట్టి సరికొత్త ప్రయాణం ప్రారంభించాడు. ఎండుకొబ్బరిని కొనుగోలు చేసే కేరళ, ఆంధ్రాలోని కొబ్బరిపరిశ్రమలతో ఒప్పందం చేసుకున్నాడు. ప్రతి నెల టన్నుల్లో ఎండుకొబ్బరిని సరఫరా చేస్తూ మరో ఇద్దరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాడు.సీజన్ ను బట్టి ఎండుకొబ్బరికి డిమాండ్ ఉంటుందని క్వింటా ధర ప్రస్తుతం దాదాపు పన్నెండు వేలు పలుకుతుందని చెబుతున్నాడు ప్రసాద్. ఎండుకొబ్బరి పోగా మిగిలిన చిప్పలను సైతం కొన్నిపరిశ్రమలు కొనుగోలు చేస్తాయని అంటున్నాడు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే కొబ్బరి పరిశ్రమలకు ముడిసరుకును ఏర్పాటు చేసే పరిశ్రమను స్థాపించి తన లాంటి వాళ్లకు ఉపాధి కల్పించేలా చేస్తానని చెబుతున్నాడు. ఆలోచనకు ఆత్మవిశ్వాసం తోడైతే మనం అనుకున్నది సాదించవచ్చని నిరూపించాడు ప్రసాద్‌.

First published:

Tags: Bhadradri kothagudem, Business Ideas

ఉత్తమ కథలు