Business Idea | లాక్ డౌన్‌లోనూ లాభాలిచ్చే బిజినెస్.. రూ.2.5 లక్షల పెట్టుబడితో...

కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా అన్ని రకాల వ్యాపారాలు మూతపడ్డాయి. అయితే, ఈ వ్యాపారం మాత్రం ఢోకాలేకుండా కొనసాగుతోంది.

news18-telugu
Updated: May 9, 2020, 9:06 PM IST
Business Idea | లాక్ డౌన్‌లోనూ లాభాలిచ్చే బిజినెస్.. రూ.2.5 లక్షల పెట్టుబడితో...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా అన్ని రకాల వ్యాపారాలు మూతపడ్డాయి. అయితే, ఈ వ్యాపారం మాత్రం ఢోకాలేకుండా కొనసాగుతోంది. అదే ప్రధానమంత్రి జన ఔషధ కేంద్రం. ఈ కేంద్రాలు నిర్వహిస్తున్న వారికి లాభాలు కూడా ఆర్జిస్తోంది. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ యోజన కింద తక్కువ ధరకే మందులు అందివ్వాలనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. అందులో భాగంగానే ఈ జన ఔషధ కేంద్రాలను తీసుకొచ్చింది. బ్రాండెడ్ మందుల రేట్లు చాలా ఎక్కువ. ఇందులో తక్కువ ధరకే మందులు విక్రయిస్తారు. మార్కెట్ ధర కంటే కొన్ని మందుల రేట్లు 90 శాతం తక్కువ ధరకే ఇక్కడ లభిస్తాయి. దేశంలోని అన్ని జిల్లాల్లోనూ, నలుమూలలకూ జన ఔషధ కేంద్రాలను తీసుకుని వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి, జన ఔషధ కేంద్రం అనేది నిరుద్యోగ యువత డబ్బు సంపాదించడానికి ఓ మంచి అవకాశం. జనరిక్ మందుల వినియోగాన్ని కేంద్రం కూడా ప్రోత్సహిస్తోంది. అందుకే కొత్త దుకాణాల ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తోంది. మినిస్ట్రీ ఆఫ్ కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్ ప్రకారం దేశంలో 6300 జన ఔషధ కేంద్రాలున్నాయి. ప్రధానమంత్రి జన ఔషధ కేంద్రం ఎంతగా ప్రజల్లో ఆదరణ పొందిందంటే.. ఈ ఏడాది మార్చిలో రూ.42 కోట్ల టర్నోవర్ జరిగితే, ఏప్రిల్ నెలలో రూ.52 కోట్ల టర్నోవర్ సాధించింది. లాక్ డౌన్‌లో ఎలాంటి మందులు సరఫరా చేసే అవకాశం లేకపోయినా, వాట్సాప్, ఈమెయిల్ ద్వారా ఆర్డర్లు తీసుకుంటూ ముందుకు వెళ్తోంది.

Pradhan Mantri Jan-Aushadhi Yojana, Janaushadhi Kendra, Janaushadhi Kendra near me, Janaushadhi Kendra business idea, Janaushadhi Kendra business model, Janaushadhi Kendra business application, Janaushadhi Kendra business apply, Business idea, ప్రధాన మంత్రి జన్ ఔషధి యోజన, జన ఔషధి కేంద్రం, జన ఔషధి కేంద్రం వ్యాపారం, జన ఔషధి కేంద్రం బిజినెస్, జన ఔషధి కేంద్రం దరఖాస్తు, జన ఔషధి కేంద్రం అప్లికేషన్, బిజినెస్ ఐడియా
ప్రధానమంత్రి జన ఔషధ కేంద్రం


జన ఔషధ కేంద్రం ఎలా ఓపెన్ చేయాలి?
జన ఔషధ కేంద్రం ప్రారంభించాలంటే ఆరంభంలో రూ.2.5 లక్షల పెట్టుబడి అవసరం. మిగిలిన ఖర్చు ప్రభుత్వం భరిస్తుంది. దీన్ని మూడు కేటగిరీల వారు ఏర్పాటు చేయవచ్చు.

1. నిరుద్యోగ ఫార్మాసిస్టులు. డాక్టర్ లేదా గుర్తింపు పొందిన మెడికల్ ప్రాక్టీషనర్ అర్హులు.
2. ట్రస్టులు, ఎన్జీవోలు, ప్రైవేట్ ఆస్పత్రులు, సొసైటీ స్వయం సహాయక సంఘాలు.
3. రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసిన ఏజెన్సీలు. అయితే, వారు 120 చదరపు అడుగుల్లో షాపు ఉండాలి. 900 రకాల మందులను ప్రభుత్వం ఇస్తుంది.ఎలా దరఖాస్తు చేయాలి?
జన ఔషధి కేంద్రం పేరుతో అభ్యర్థి రిటైల్ డ్రగ్ లైసెన్స్ తీసుకోవాలి. http://janaushadhi.gov.in వెబ్‌సైట్ నుంచి ఫాం డౌన్ లోడ్ చేసుకోవాలి. దాన్ని నింపి బ్యూరో ఆఫ్ ఫార్మా పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ జనరల్ మేనేజర్‌కి పంపాలి. ఆ వివరాలు వెబ్ సైట్‌లో ఉంటాయి.

Pradhan Mantri Jan-Aushadhi Yojana, Janaushadhi Kendra, Janaushadhi Kendra near me, Janaushadhi Kendra business idea, Janaushadhi Kendra business model, Janaushadhi Kendra business application, Janaushadhi Kendra business apply, Business idea, ప్రధాన మంత్రి జన్ ఔషధి యోజన, జన ఔషధి కేంద్రం, జన ఔషధి కేంద్రం వ్యాపారం, జన ఔషధి కేంద్రం బిజినెస్, జన ఔషధి కేంద్రం దరఖాస్తు, జన ఔషధి కేంద్రం అప్లికేషన్, బిజినెస్ ఐడియా
Janaushadhi Kendra: తక్కువ పెట్టుబడితో జనఔషధి కేంద్రం... ఏర్పాటు చేయండిలా
(ప్రతీకాత్మక చిత్రం)


ఈ షాపులు ఓపెన్ చేయడానికి ఎవరెవరు అర్హులు
వ్యాపారులు, ఆస్పత్రులు, ఎన్జీఓలు. ఫార్మాసిస్టులు, డాక్టర్లు, మెడికల్ ప్రాక్టీషనర్లు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.50000 విలువైన మందులను అడ్వాన్స్‌గా ఇస్తారు. దీనికి ప్రధానమంత్రి జన ఔషధ కేంద్రం అని పేరు ఉంటుంది. దరఖాస్తు చేయడానికి ఆధార్, పాన్ నెంబర్ కావాలి.

ఎంత ఆదాయం వస్తుంది?
నెలలో జరిపిన విక్రయాల్లో షాపు యజమానికి 20 శాతం కమిషన్ వస్తుంది. నెలలో రూ.లక్ష విలువైన మందులు విక్రయిస్తే కమిషన్ కింద రూ.20వేల ఆదాయం వస్తుంది.

ఇతరత్రా ప్రయోజనాలు
1. రూ.2లక్షల ఆర్థిక సాయం లభిస్తుంది.
2. ఏడాదికి జరిపిన విక్రయాలపై అత్యధికంగా రూ.10000 వరకు ఇన్సెంటివ్ లభిస్తుంది.
3. ఈశాన్య రాష్ట్రాలు, నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో 15 శాతం వరకు ఇన్సెంటివ్‌లు ఇస్తారు. డబ్బుగా లెక్కిస్తే ఇది రూ.15000 వరకు ఉంటుంది.
First published: May 9, 2020, 8:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading