హోమ్ /వార్తలు /బిజినెస్ /

Pension Scheme: గుడ్ న్యూస్... నెలకు రూ.10,000 పెన్షన్ వచ్చే స్కీమ్ గడువు పెంపు

Pension Scheme: గుడ్ న్యూస్... నెలకు రూ.10,000 పెన్షన్ వచ్చే స్కీమ్ గడువు పెంపు

రేషన్ డీలర్లకు చెల్లించాల్సిన కమిషన్ మొత్తం రూ.36.36 కోట్లను ప్రభుత్వ విడుదల చేసింది.

రేషన్ డీలర్లకు చెల్లించాల్సిన కమిషన్ మొత్తం రూ.36.36 కోట్లను ప్రభుత్వ విడుదల చేసింది.

Pradhan Mantri Vaya Vandana Yojana | వృద్ధాప్యంలో పెన్షన్ పొందాలనుకునేవారికి శుభవార్త. నెలకు రూ.10,000 వరకు పెన్షన్ పొందాలనుకునేవారి కోసం ప్రధాన మంత్రి వయ వందన యోజన స్కీమ్‌ గడువును పొడిగించింది కేంద్ర ప్రభుత్వం.

ప్రధాన మంత్రి వయ వందన యోజన-PMVVY పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ ఏడాది మార్చి 31న ముగిసిన స్కీమ్‌ను మరో మూడేళ్లు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అంటే ఈ స్కీమ్‌లో చేరాలనుకునేవారికి 2023 మార్చి 31 వరకు అవకాశం ఉంది. వృద్ధాప్యంలో పెన్షన్ ద్వారా అసరా పొందాలనుకునే వృద్ధుల కోసం కేంద్ర ప్రభుత్వం 2017లో ప్రారంభించిన పెన్షన్ స్కీమ్ ప్రధాన మంత్రి వయ వందన యోజన-PMVVY. ప్రస్తుతం ఉన్న పొదుపు పథకాలతో పోలిస్తే ప్రధాన మంత్రి వయ వందన యోజన స్కీమ్‌లోనే ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ఈ స్కీమ్‌లో 2020-21 ఆర్థిక సంవత్సరానికి 7.4 శాతం వడ్డీని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. గతంలో ఈ వడ్డీ ఇంకా ఎక్కువ ఉండేది. కానీ వడ్డీ రేటును తగ్గించింది. ప్రతీ ఏడాది వడ్డీని నిర్ణయిస్తుంది కేంద్ర ప్రభుత్వం.

భారత ప్రభుత్వానికి చెందిన బీమా రంగ సంస్థ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC ఈ స్కీమ్‌ను మేనేజ్ చేస్తోంది. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఈ స్కీమ్ తీసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకోవాలంటే ఆధార్ నెంబర్ తప్పనిసరి. ఈ స్కీమ్‌ ద్వారా నెలనెలా పెన్షన్ పొందేందుకు ముందుగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్‌లో పెట్టిన పెట్టుబడిని బట్టి నెలకు రూ.1,000 నుంచి రూ.10,000 మధ్య పెన్షన్ పొందొచ్చు. నెలకు రూ.10,000 పెన్షన్ కావాలనుకుంటే రూ.15,66,580 పెట్టుబడి పెట్టాలి. ఇన్వెస్ట్ చేసిన నాటి నుంచి 10 ఏళ్ల వరకు పెన్షన్ లభిస్తుంది. 10 ఏళ్లు పూర్తైన తర్వాత పెట్టుబడి మొత్తం తిరిగివస్తుంది.

Pradhan Mantri Vaya Vandana Yojana: ప్రధాన మంత్రి వయ వందన యోజన స్కీమ్ వివరాలివే...


కనీస వయస్సు- 60 ఏళ్లు

గరిష్ట వయస్సు- గరిష్ట పరిమితి లేదు

పాలసీ గడువు- 10 ఏళ్లు

కనీస పెన్షన్- నెలకు రూ.1,000, మూడు నెలలకు రూ.3,000, ఆరు నెలలకు రూ.6,000, ఏడాదికి రూ.12,000

గరిష్ట పెన్షన్- నెలకు రూ.10,000, మూడు నెలలకు రూ.30,000, ఆరు నెలలకు రూ.60,000, ఏడాదికి రూ.1,20,000

పెట్టుబడి- ఏడాదికి రూ.12,000 పెన్షన్ పొందాలనుకుంటే రూ.1,56,658 ఇన్వెస్ట్ చేయాలి. నెలకు రూ.1,20,000 పెన్షన్ కావాలంటే రూ.15,66,580 ఇన్వెస్ట్ చేయాలి.

లోన్ సదుపాయం- పాలసీ మూడేళ్లు పూర్తైన తర్వాత గరిష్టంగా 75% రుణం తీసుకోవచ్చు. వడ్డీ ఏడాదికి 10% చెల్లించాలి.

ఫ్రీ లుక్ పీరియడ్- పాలసీ నచ్చకపోతే తీసుకున్న 15 రోజుల్లో వెనక్కి ఇచ్చేయొచ్చు. ఆన్‌లైన్‌లో తీసుకుంటే 30 రోజుల ఫ్రీ లుక్ పీరియడ్ ఉంటుంది.

ప్రీమెచ్యూర్ ఎగ్జిట్- 10 ఏళ్ల గడువు పూర్తికాకముందే పాలసీ వద్దనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 98% మాత్రమే వెనక్కి వస్తుంది.

ఉదాహరణకు 60 ఏళ్ల వయస్సుగల వ్యక్తి 2020 సంవత్సరంలో ఈ స్కీమ్‌లో రూ.15,66,580 పెట్టుబడి పెడితే ఏడాదికి రూ.1,20,000 చొప్పున 10 ఏళ్ల పాటు పెన్షన్ లభిస్తుంది. 10 ఏళ్లు పూర్తైన తర్వాత పెట్టుబడి వెనక్కి వస్తుంది.. ఒకవేళ 10 ఏళ్లు పూర్తికాకముందే పెట్టుబడి పెట్టిన వ్యక్తి చనిపోతే పెట్టుబడి మొత్తం వారి జీవితభాగస్వామి లేదా పిల్లలు లేదా నామినీకి వస్తాయి.

ఇవి కూడా చదవండి:

Credit Card Loan: క్రెడిట్ కార్డుపై లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి

PAN Card: పాన్ కార్డు పోయిందా? డూప్లికేట్ కార్డుకు ఆన్‌లైన్‌లో అప్లై చేయండిలా

Lockdown: క్రెడిట్ కార్డ్ ఉందా? లాక్‌డౌన్‌లో ఈ తప్పులు చేయొద్దు

First published:

Tags: Business, BUSINESS NEWS, LIC, Pension Scheme, Personal Finance

ఉత్తమ కథలు