హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gas Subsidy: గ్యాస్‌పై కేంద్రం ప్రకటించిన రూ.200 సబ్సిడీ కావాలా? అయితే ఈ స్కీమ్‌లో చేరండి

Gas Subsidy: గ్యాస్‌పై కేంద్రం ప్రకటించిన రూ.200 సబ్సిడీ కావాలా? అయితే ఈ స్కీమ్‌లో చేరండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Gas Subsidy | కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఆపేసి దాదాపు రెండేళ్లవుతోంది. తాజాగా గ్యాస్ సిలిండర్‌పై (Gas Cylinder) రూ.200 సబ్సిడీ ప్రకటించింది. అయితే ఈ సబ్సిడీ కస్టమర్లు అందరికీ రాదు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

కేంద్ర ప్రభుత్వం ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లపై (LPG Gas Cylinder) రూ.200 సబ్సిడీ ప్రకటించింది. అయితే ఈ సబ్సిడీ అందరికీ రాదు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) పథకంలో ఉన్నవారికి మాత్రమే ఈ సబ్సిడీ లభిస్తుంది. ఈ స్కీమ్‌ను పీఎం ఉజ్వల పథకం (PM Ujjwala Scheme) అని కూడా పిలుస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం గతంలో గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ ఇచ్చేది. సబ్సిడీ మొత్తం నేరుగా లబ్ధిదారుల అకౌంట్‌లో జమ అయ్యేది. 2020 జూన్ నుంచి సబ్సిడీ ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం. సాధారణ ప్రజలతో పాటు పీఎం ఉజ్వల స్కీమ్‌లో ఉన్నవారికి కూడా దాదాపు రెండేళ్లుగా సబ్సిడీ రావట్లేదు.

తాజాగా పీఎం ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులకు ఒక సిలిండర్‌పై రూ.200 సబ్సిడీ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ , పీఎం ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులకు రూ.200 సబ్సిడీని కూడా ప్రకటించారు. పీఎం ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులు ఏడాదిలో 12 సిలిండర్లకు సబ్సిడీ పొందొచ్చు. అంటే గరిష్టంగా రూ.2,400 సబ్సిడీ పొందొచ్చు. అంటే సబ్సిడీ మొత్తం రెండు సిలిండర్ల మొత్తంతో సమానం. హైదరాబాద్‌లో ప్రస్తుతం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,055. పీఎం ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులకు రూ.200 సబ్సిడీ వస్తుంది కాబట్టి వారికి రూ.855 ధరకే సిలిండర్ వస్తుంది.

Govt Scheme: ఆ స్కీమ్‌లో ఉన్నవారికి అలర్ట్... మే 31 లాస్ట్ డేట్

పీఎం ఉజ్వల స్కీమ్ లక్ష్యం

కేంద్ర ప్రభుత్వం 2016లో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న మహిళలకు ఉచితంగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు ఇచ్చేందుకు ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ మొదటి దశను విజయవంతం చేసిన కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టులో రెండో దశను ప్రకటించింది. రెండో దశలో మొత్తం 8 కోట్ల కొత్త ఎల్‌పీజీ కనెక్షన్లు ఇవ్వాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. 2022 ఏప్రిల్ 25 నాటికి పీఎం ఉజ్వల స్కీమ్ ద్వారా 9,17,54,371 కనెక్షన్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. పీఎం ఉజ్వల స్కీమ్ 2.0 ద్వారా 2022 ఏప్రిల్ 25 నాటికి 1,18,51,240 కనెక్షన్స్ ఇవ్వడం విశేషం.

పీఎం ఉజ్వల స్కీమ్ ఎవరికి?

ఎస్‌సీ, ఎస్‌టీ, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, అంత్యోదయ అన్న యోజన, చాలా వెనుకబడిన తరగతులు, టీ తోటల్లో పనిచేసేవారు, అడవుల్లో నివసించేవారు, మారుమూల ప్రాంతాల్లో నివసించే మహిళలు ఈ పథకం ద్వారా ఎల్‌పీజీ కనెక్షన్‌కు అప్లై చేయొచ్చు. 18 ఏళ్లు దాటిన మహిళలు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేయాలి. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న మహిళలు మాత్రమే అర్హులు. ఈ స్కీమ్ ద్వారా ఉచితంగా గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండర్ లభిస్తాయి.

RBI: గుర్తుంచుకోండి... జూన్ 8న ఆర్‌బీఐ నుంచి మరో షాక్

పీఎం ఉజ్వల స్కీమ్‌కు ఎలా అప్లై చేయాలి?

పీఎం ఉజ్వల స్కీమ్‌కు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. https://www.pmuy.gov.in/ వెబ్‌సైట్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజీలో Apply for New Ujjwala 2.0 Connection ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. వివరాలన్నీ చదివిన తర్వాత Online Portal లింక్ పైన క్లిక్ చేయాలి. ఇండేన్ గ్యాస్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ కస్టమర్లకు వేర్వేరుగా లింక్స్ కనిపిస్తాయి. ఆ తర్వాత మహిళలు తమ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసి అప్లై చేయాలి.

కావాల్సిన డాక్యుమెంట్స్

ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కార్డ్ .

ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్‌కే ఎల్‌పీజీ కనెక్షన్ కావాలంటే అడ్రస్ ప్రూఫ్‌గా ఆధార్ కార్డ్ ఇవ్వొచ్చు.

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డ్ లేదా కుటుంబ సభ్యుల పేర్లు ఉన్న ఏదైనా డాక్యుమెంట్.

వలస కూలీలైతే సెల్ఫ్ డిక్లరేషన్.

బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్.

ఫ్యామిలీ స్టేటస్ వివరించేలా సప్లిమెంటరీ కేవైసీ.

First published:

Tags: Bharat Gas, HP gas, Indane Gas, LPG Cylinder, Lpg Cylinder Price, PM Ujjwala Scheme

ఉత్తమ కథలు