Home /News /business /

PRADHAN MANTRI SHRAM YOGI MAN DHAN YOJANA SAVE JUST RS 55 PER MONTH AND GET RS 36000 PENSION FROM AGE OF 60 SS

Pension Scheme: నెలకు రూ.55 జమ చేస్తే వృద్ధాప్యంలో రూ.36,000 పెన్షన్... స్కీమ్ వివరాలివే

Pension Scheme: నెలకు రూ.55 జమ చేస్తే వృద్ధాప్యంలో రూ.36,000 పెన్షన్... స్కీమ్ వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)

Pension Scheme: నెలకు రూ.55 జమ చేస్తే వృద్ధాప్యంలో రూ.36,000 పెన్షన్... స్కీమ్ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

Pension Scheme | వృద్ధాప్యంలో పెన్షన్ పొందాలనుకునే అసంఘటితరంగ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఓ పెన్షన్ పథకం ఉంది. ఈ స్కీమ్‌లో చేరితే రూ.36,000 పెన్షన్ పొందొచ్చు.

    ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేన్ (EPFO) పెన్షన్ స్కీమ్ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి పెన్షన్ పథకాలు ఉన్నాయి. అయితే అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు పెన్షన్ పథకాలు (Pension Schemes) లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన (PMSYM) పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా అసంఘటిత కార్మికులు కూడా రిటైర్మెంట్ తర్వాత ఏటా రూ.36,000 పెన్షన్ పొందొచ్చు. ఇందుకోసం ఇప్పట్నుంచే ప్రతీ నెలా కొంత మొత్తం జమ చేస్తే చాలు. నెలకు రూ.55 చొప్పున జమ చేయాల్సి ఉంటుంది. అంటే రోజుకు రూ.2 కన్నా తక్కువే.

    ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన పథకంలో ఇళ్లల్లో పనిచేసే పనిమనుషులు, వీధుల్లో వ్యాపారాలు చేసేవారు, మిడ్ డే మీల్ వర్కర్స్, ఇటుక బట్టీల్లో పనిచేసేవారు, రిక్షా పుల్లర్స్, రోజువారీ కూలీలు, వ్యవసాయ కూలీలు... ఇలా అసంఘటిత రంగంలో పనిచేసేవారు కార్మికులు ఎవరైనా చేరొచ్చు. భారతదేశంలో 42 కోట్లకు పైనే అసంఘటిత రంగ కార్మికులు ఉంటారని అంచనా. వారికి పెన్షన్ ప్రయోజనాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పథకం ఇది.

    EPFO Good News: ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్... ఆ గడువు లేదని ప్రకటించిన ఈపీఎఫ్ఓ

    ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన పథకంలో డబ్బులు జమ చేస్తున్నవారికి 60 ఏళ్ల వయస్సు నుంచి నెలకు రూ.3,000 చొప్పున ఏటా రూ.36,000 పెన్షన్ లభిస్తుంది. ఈ పెన్షన్ ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. ఒకవేళ ఈ స్కీమ్ లబ్ధిదారులు మరణిస్తే వారి జీవిత భాగస్వామికి 50 శాతం ఫ్యామిలీ పెన్షన్ లభిస్తుంది. ఫ్యామిలీ పెన్షన్ కేవలం జీవిత భాగస్వామికి మాత్రమే వర్తిస్తుంది.

    ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన స్కీమ్‌లో 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు ఉన్నవారు ఎవరైనా చేరొచ్చు. నెలకు రూ.55 నుంచి రూ.200 మధ్య జమ చేయాలి. 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు డబ్బులు జమ చేయాలి. ఉదాహరణకు 18 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి 60 ఏళ్లు వచ్చేవరకు నెలకు రూ.55 చెల్లిస్తే చాలు. 40 ఏళ్ల వయస్సులో ఈ పథకంలో చేరితే నెలకు రూ.200 చొప్పున చెల్లించాలి.

    Rs 2 Crore Returns: రిటైర్మెంట్ నాటికి రూ.2 కోట్లు... నెలకు రూ.3,500 పొదుపు చేస్తే చాలు

    ఈ పెన్షన్ స్కీమ్‌లో చేరడానికి అసంఘటిత కార్మికులు సమీపంలో ఉన్న సీఎస్‌సీ సెంటర్‌కు వెళ్లాలి. ఆధార్ కార్డు తప్పనిసరి. సేవింగ్స్ అకౌంట్ లేదా జన్ ధన్ అకౌంట్ ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ సమర్పించాలి. మొదటి వాయిదాను విలేజ్ లెవెల్ ఆంట్రప్రెన్యూర్‌కు చెల్లించాలి. ఆ తర్వాత ప్రతీ నెలా అకౌంట్ నుంచి డబ్బులు ఈ స్కీమ్‌లో జమ అవుతాయి. శ్రమ్ యోగీ పెన్షన్ అకౌంట్ నెంబర్ (SPAN) జనరేట్ అవుతుంది. శ్రమ్ యోగీ కార్డ్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Pension Scheme, Personal Finance

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు