అసంఘటిత రంగ కార్మికులకు వృద్ధాప్యంలో చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి శ్రమ్ యోగీ మాన్ ధన్-PMSYM స్కీమ్‌ను ప్రారంభించింది. ఈ స్కీమ్‌లో చేరినవారికి 60 ఏళ్ల వయస్సు నుంచి నెలకు రూ.3,000 పెన్షన్ లభిస్తుంది. 10 కోట్లకు పైగా అసంఘటితరంగ కార్మికుల కోసం రెండేళ్ల క్రితం ప్రారభించిన ఈ స్కీమ్‌లో చేరినవారి సంఖ్య లక్షల్లోనే ఉంది. 2021 జూన్ 17 నాటికి ప్రధాన మంత్రి శ్రమ్ యోగీ మాన్ ధన్-PMSYM స్కీమ్‌లో చేరినవారి సంఖ్య 45,06,294 మాత్రమే. కేంద్ర ప్రభుత్వం 10 కోట్ల టార్గెట్ పెట్టుకున్నా, ఈ స్కీమ్‌లో అరకోటి మంది సభ్యులు కూడా చేరలేదు. అయితే ఈ పెన్షన్ స్కీమ్ గురించి అవగాహన లేకపోవడంతో ఇందులో ఎక్కువగా సబ్స్క్రైబర్లు చేరట్లేదు. మరోవైపు ఇటీవల కాలంలో ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోవడం, ఆదాయాలు తగ్గిపోవడంతో ఈ స్కీమ్‌లో చేరుతున్నవారి సంఖ్య భారీగా తగ్గిపోయింది.
ప్రధాన మంత్రి శ్రమ్ యోగీ మాన్ ధన్-PMSYM స్కీమ్‌ను 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్-ESIC, న్యూ పెన్షన్ స్కీమ్-NPS లాంటి పెన్షన్ పథకాల్లో కవర్ కానివారి కోసం రూపొందించిన సామాజిక భద్రతా పథకం ఇది. వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులు, రిక్షా కార్మికులు, ఇళ్లల్లో పనిచేసేవాళ్లు, దినసరి కూలీలు, వ్యవసాయ కూలీలు, నిర్మాణ రంగ కార్మికులు, బీడీ వర్కర్లు, చేనేత కార్మికులు ఇలా తక్కువ ఆదాయం ఉన్న అసంఘటిత రంగ కార్మికులు ఎవరైనా ఈ స్కీమ్‌లో చేరొచ్చు. రూ.15,000 లోపు వేతనం పొందుతున్నవారంతా ఈ స్కీమ్‌లో చేరడానికి అర్హులు.
Aadhaar Card: ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మార్చాలా? ఈ లింక్ క్లిక్ చేసి అప్డేట్ చేయండి
IRCTC Tirupati Tour: తిరుమలలో శ్రీవారి దర్శనంతో ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ
ప్రధాన మంత్రి శ్రమ్ యోగీ మాన్ ధన్-PMSYM స్కీమ్‌లో చేరడానికి పెద్దగా డాక్యుమెంట్స్ కూడా అవసరం లేదు. ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు. ఈ స్కీమ్‌లో చేరడానికి కనీస వయస్సు 18 ఏళ్లు కాగా గరిష్ట వయస్సు 40 ఏళ్లు. ఈ స్కీమ్‌లో చేరిన తర్వాత కనీసం నెలకు రూ.55 నుంచి రూ.200 మధ్య జమ చేయాలి. వయస్సును బట్టి జమ చేయాల్సిన మొత్తం మారుతుంది. లబ్ధిదారులు ఎంత చెల్లిస్తే ప్రభుత్వం కూడా అంతే మొత్తం జమ చేస్తుంది. అంటే 18 ఏళ్ల వ్యక్తి రూ.55 చెల్లిస్తే, ప్రభుత్వం రూ.55 చెల్లిస్తుంది. మొత్తం రూ.110 అతని పేరు మీద జమ అవుతుంది. ఇలా 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు జమ చేయాల్సి ఉంటుంది. 60 ఏళ్ల వయస్సుకు చేరుకోగానే జీవితాంతం నెలకు రూ.3,000 చొప్పున పెన్షన్ వస్తుంది. లబ్ధిదారులు చనిపోతే వారి జీవిత భాగస్వామికి జీవితాంతం సగం పెన్షన్ అంటే రూ.1,500 లభిస్తుంది.
PAN Aadhaar Linking: పాన్-ఆధార్ లింకింగ్‌కు 2 వారాలే గడువు... చేయకపోతే ఈ చిక్కులు తప్పవు
LIC Policy: మీ జీతంలో కొంత పొదుపు చేయండి... మెచ్యూరిటీ తర్వాత రూ.70 లక్షలు మీవే
మరి మీరు కూడా ప్రధాన మంత్రి శ్రమ్ యోగీ మాన్ ధన్-PMSYM స్కీమ్‌లో చేరాలనుకుంటున్నారా? మీకు దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్లో ఎన్రోల్ చేయొచ్చు. ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్ లేదా జన్ ధన్ అకౌంట్ వివరాలు తీసుకెళ్లాలి. అన్ని ఎల్ఐసీ, ఈఎస్ఐసీ, ఈపీఎఫ్ఓ, కేంద్ర, రాష్ట్ర, లేబర్ కార్యాలయాల్లో కూడా ఈ స్కీమ్‌లో చేరొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: National Pension Scheme, Pension Scheme, Personal Finance