PMSYM Scheme: మీ జీతం రూ.15 వేల కన్నా తక్కువా? ఈ పెన్షన్ స్కీమ్ మీ కోసమే...

Pradhan Mantri Shram Yogi Maan-Dhan scheme | ప్రధాన మంత్రి శ్రమ్ యోగీ మాన్-ధన్ పథకం(PMSYM) అసంఘటిత రంగంలో పనిచేస్తున్న 18 నుంచి 40 ఏళ్ల వయస్సు వారికి. వారి జీతం రూ.15,000 లోపు ఉండాలి. బ్యాంక్ అకౌంట్, ఆధార్ నెంబర్ ఉండాలి.

news18-telugu
Updated: February 17, 2019, 8:07 AM IST
PMSYM Scheme: మీ జీతం రూ.15 వేల కన్నా తక్కువా? ఈ పెన్షన్ స్కీమ్ మీ కోసమే...
PF Settlement: ఉద్యోగం మానేశారా? పీఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ ఇలా చేసుకోవాలి
  • Share this:
ప్రధాన మంత్రి శ్రమ్ యోగీ మాన్-ధన్(PMSYM)... కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన సరికొత్త పెన్షన్ స్కీమ్. ఫిబ్రవరి 15న అధికారికంగా ప్రారంభమైన పెన్షన్ స్కీమ్‌లో చేరినవారికి 60 ఏళ్ల తర్వాత జీవితాంతం నెలకు రూ.3,000 పెన్షన్ లభిస్తుంది. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కోసం రూపొందించిన పెన్షన్ స్కీమ్ ఇది. ఈ స్కీమ్‌లో చేరినవాళ్లు 60 ఏళ్ల వరకు నెలకు కొంత డబ్బును చెల్లించాల్సి ఉంటుంది. అంతే మొత్తం ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. ఆర్గనైజ్డ్ సెక్టార్‌లో పనిచేసేవారికోసం ఉన్న ఈపీఎఫ్ స్కీమ్ లాంటిదే ప్రధాన మంత్రి శ్రమ్ యోగీ మాన్-ధన్ పథకం.

Read this: PAN Card: మీ పాన్ కార్డులో తప్పులున్నాయా? ఇలా చేయండి

PMSYM పథకం ఎవరికి?


ప్రధాన మంత్రి శ్రమ్ యోగీ మాన్-ధన్ పథకం అసంఘటిత రంగంలో పనిచేస్తున్న 18 నుంచి 40 ఏళ్ల వయస్సు వారికి. వారి జీతం రూ.15,000 లోపు ఉండాలి. బ్యాంక్ అకౌంట్, ఆధార్ నెంబర్ ఉండాలి. వీధుల్లో దుకాణాలు నిర్వహించేవాళ్లు, ఇళ్లల్లో పనిచేసేవాళ్లు, మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసేవాళ్లు, రిక్షా పుల్లర్లు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు... ఇలా అసంఘటిత రంగంలో పనిచేసేవాళ్లు ఎవరైనా ఈ పథకంలో చేరొచ్చు. ఈ స్కీమ్‌లో 8 శాతం వడ్డీ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Read this: IRCTC APP: ఐఆర్‌సీటీసీ మొబైల్ యాప్‌‌తో ఉపయోగాలు ఇవే...

PMSYM scheme details, PM pension scheme details, Pradhan Mantri Shram Yogi Maan-Dhan, pension scheme, PMSYM Eligibility, PMSYM pension chart, ప్రధాన మంత్రి శ్రమ్ యోగీ మాన్-ధన్, పీఎం పెన్షన్ స్కీమ్, పీఎంఎస్‌వైఎం స్కీమ్, పీఎం పెన్షన్ చార్ట్


PMSYM పథకం ఎంత వరకు లాభం?

ఈ పథకం ఎంచుకున్న వాళ్లు వారి వయస్సును బట్టి రూ.55 నుంచి రూ.200 మధ్య చెల్లించాల్సి ఉంటుంది. అంతే మొత్తం ప్రభుత్వం తరఫున జమ అవుతుంది. ఈ పథకం ఎంచుకున్నవారికి 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3,000 పెన్షన్ లభిస్తుంది. లబ్ధిదారులు చనిపోతే వారి జీవితభాగస్వామికి జీవితాంతం సగం పెన్షన్ లభిస్తుంది. అయితే ఏ వయస్సువాళ్లు ఎంత చెల్లించాలన్నదానిపై స్పష్టతనిచ్చింది కేంద్ర కార్మిక శాఖ. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఇక ఏవయస్సు వాళ్లు ఎంత చెల్లించాలో ఈ కింద ఉన్న చార్ట్‌లో చూడొచ్చు.

PMSYM scheme details, PM pension scheme details, Pradhan Mantri Shram Yogi Maan-Dhan, pension scheme, PMSYM Eligibility, PMSYM pension chart, ప్రధాన మంత్రి శ్రమ్ యోగీ మాన్-ధన్, పీఎం పెన్షన్ స్కీమ్, పీఎంఎస్‌వైఎం స్కీమ్, పీఎం పెన్షన్ చార్ట్
image: https://labour.gov.in

PMSYM పథకంలో ఎలా చేరాలి?


ప్రధాన మంత్రి శ్రమ్ యోగీ మాన్-ధన్ పథకం చేరాలంటే బ్యాంక్ అకౌంట్, ఆధార్ నెంబర్ తప్పనిసరి. ఎల్ఐసీ, ఈఎస్ఐసీ, ఈపీఎఫ్ఓ ఆఫీసులతో పాటు కేంద్ర, రాష్ట్ర కార్మిక శాఖ కార్యాలయాల్లో ఈ పథకంలో చేరొచ్చు.

Fake Apps: మీరు వాడే యాప్ ఒరిజినలా? ఫేకా? ఈ 10 టిప్స్ మీకోసమే

ఇవి కూడా చదవండి:

Flipkart TV Days: టీవీ కొనాలా? ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ ఆఫర్స్ ఇవే...

Business Idea: రూ.1 లక్ష పెట్టుబడితో నెలకు రూ.14 వేల ఆదాయం
First published: February 17, 2019, 8:05 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading