హోమ్ /వార్తలు /బిజినెస్ /

PM-Kisan Scheme: ఈ చిన్న తప్పుతో అకౌంట్‌లోకి డబ్బులు రావు

PM-Kisan Scheme: ఈ చిన్న తప్పుతో అకౌంట్‌లోకి డబ్బులు రావు

PM-Kisan Scheme: ఈ చిన్న తప్పుతో అకౌంట్‌లోకి డబ్బులు రావు
(ప్రతీకాత్మక చిత్రం)

PM-Kisan Scheme: ఈ చిన్న తప్పుతో అకౌంట్‌లోకి డబ్బులు రావు (ప్రతీకాత్మక చిత్రం)

Pradhan Mantri Kisan Samman Nidhi Scheme | మీ అకౌంట్‌లోకి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌ డబ్బులు రాలేదా? అయితే ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోండి.

  ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌లో భాగంగా రైతుల అకౌంట్లలోకి కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6,000 జమ చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు విడతల్లో రూ.2,000 చొప్పున నిధుల్ని విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. 14.3 కోట్ల మంది రైతులు ఈ స్కీమ్ ద్వారా ఏడాదికి రూ.6,000 పొందుతున్నారు. ఇటీవల లబ్ధిదారులకు రూ.2,000 మనీ ట్రాన్స్‌ఫర్ చేసింది ప్రభుత్వం. ఒక్క చిన్న తప్పు వల్ల 70 లక్షల మంది రైతుల అకౌంట్లలో డబ్బులు జమ కాలేదని తెలిసింది. ఈ రైతుల అకౌంట్లలోకి మూడు విడతల్లో రూ.4,200 కోట్లు జమ కావాల్సి ఉంది. కానీ ఆ తప్పు వల్ల ఈ డబ్బులు వారి అకౌంట్లో జమ అయ్యే అవకాశం లేదు. ఇంతకీ ఆ తప్పు ఏంటో తెలుసా? స్పెల్లింగ్ మిస్టేక్.

  అవును పేరులో చిన్న తప్పు వల్ల రైతుల అకౌంట్‌లోకి డబ్బులు జమ కావట్లేదు. ఈ తప్పు సరిదిద్దుకోకపోతే వారి అకౌంట్‌లోకి డబ్బులు జమ అయ్యే ఛాన్సే లేదు. లబ్ధిదారులు సమర్పించిన డాక్యుమెంట్లలో, బ్యాంకు అకౌంట్లలో పేర్లు వేర్వేరుగా ఉండటం వల్ల ఈ సమస్య తలెత్తుతోంది. ఆటోమెటిక్ సిస్టమ్ ద్వారా డబ్బుల్ని ఒకేసారి జమ చేస్తుంది ప్రభుత్వం. పేర్లు మ్యాచ్ కాకపోతే మనీ ట్రాన్స్‌ఫర్ జరగదు. డాక్యుమెంట్‌లో ఒక పేరు, బ్యాంకు అకౌంట్‌లో మరో పేరు ఉండటం వల్ల ఈ సమస్య వస్తోంది. ఇలా స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్న రైతుల సంఖ్య 70 లక్షల వరకు ఉంటుందని పీఎం కిసాన్ స్కీమ్ సీఈఓ వివేక్ అగర్వాల్ తెలిపారు. వీరిలో 60 లక్షల వరకు ఆధార్ కార్డులో పేరు వేరుగా ఉందన్నారు.

  లబ్ధిదారులు తమ పేరును సరిదిద్దుకోవచ్చు. ఇందుకోసం పీఎం కిసాన్ స్కీమ్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయాలి. అందులో ఫార్మర్స్ కార్నర్ పైన క్లిక్ చేయాలి. ఎడిట్ ఆధార్ డీటెయిల్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత వివరాలు కనిపిస్తాయి. వివరాలు చెక్ చేసుకొని సరిదిద్దుకోవాలి. ఇంకా ఏవైనా తప్పులు ఉంటే స్థానిక వ్యవసాయ అధికారుల్ని సంప్రదించాలి.

  ఇవి కూడా చదవండి:

  Lockdown: లాక్‌డౌన్‌లో బాగా నడిచిన బిజినెస్ ఇదే... వ్యాపారం చేయడానికి ప్రభుత్వ సాయం

  SBI Gold Loan: తక్కువ వడ్డీకే ఎస్‌బీఐలో గోల్డ్ లోన్

  Credit Card: క్రెడిట్ కార్డుపై మారటోరియంతో మీకే నష్టం... ఎలాగంటే

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Farmer, PM Kisan Scheme, Pradhan Mantri Kisan Samman Nidhi

  ఉత్తమ కథలు