PRADHAN MANTRI KISAN SAMMAN NIDHI PM KISAN MORE THAN 4 LAKH TRANSACTIONS FAILED AADHAAR MAY MANDATORY FOR NEXT INSTALLMENT SS
PM Kisan Scheme: రైతులు కాకపోయినా అకౌంట్లో పడుతున్న డబ్బులు... ఇక ఆధార్ తప్పనిసరేనా?
ప్రతీకాత్మక చిత్రం
Pradhan Mantri Kisan Samman Nidhi (PM-KISAN) Scheme | పీఎం కిసాన్ స్కీమ్ మొదటి విడత ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా రైతులను ఆదుకునేందుకు ప్రతీ ఏటా రూ.2,000 చొప్పున మూడుసార్లు మొత్తం రూ.6,000 జమ చేస్తోంది కేంద్రం.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో అనేక చిక్కులు ఎదురవుతున్నాయి. మొదటి విడతకు సంబంధించి ఏకంగా 4 లక్షల ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయ్యాయి. చాలామంది రైతుల అకౌంట్లోకి మొదటి విడత డబ్బులు జమకాలేదు. సాంకేతిక సమస్యల వల్ల రైతులు కానివాళ్ల అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయి. ఇంకొందరు రైతులకైతే రెండు అకౌంట్లు ఉంటే రెండు అకౌంట్లలోకి డబ్బులు వెళ్లాయి. ఈ సమస్యలపై అధికారులకు ఇప్పటికే అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. పీఎం కిసాన్ స్కీమ్ పథకంలో మొదటి విడత డబ్బుల కోసం ఆధార్ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దీంతో ఆధార్‌తో సంబంధం లేకుండా లబ్ధిదారుల్ని ఎంపిక చేసి డబ్బులు జమ చేయడం ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో సమస్యలు వస్తున్నాయి. ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతున్నాయి. ఏకంగా 4 లక్షల ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ కావడం దుమారాన్ని రేపుతోంది. దీనిపై దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
పీఎం కిసాన్ స్కీమ్ మొదటి విడత ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా రైతులను ఆదుకునేందుకు ప్రతీ ఏటా రూ.2,000 చొప్పున మూడుసార్లు మొత్తం రూ.6,000 జమ చేస్తోంది కేంద్రం. రెండో విడత ఏప్రిల్ 1న ప్రారంభం కానుంది. రెండో విడతకు కూడా ఆధార్ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ... ప్రస్తుతం తలెత్తుతున్న సాంకేతిక సమస్యలతో రెండో విడతకు ఆధార్ తప్పనిసరి చేస్తారన్న చర్చ జరుగుతోంది. ఆధార్ నెంబర్ తప్పనిసరి చేస్తే తప్ప ఇలాంటి లోపాలు లేకుండా రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ చేయొచ్చన్న వాదన వినిపిస్తోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇక పీఎం కిసాన్ స్కీమ్ సాయం పొందాలంటే ఆధార్ తప్పనిసరి. Holi 2019: దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు... కలర్‌ఫుల్ ఫోటోలు చూడండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.