Jan Dhan Account: జన్ ధన్ అకౌంట్లలో రూ.97 వేల కోట్ల డిపాజిట్లు

Pradhan Mantri Jan Dhan Yojana | వారంవారం జన్ ధన్ అకౌంట్లలో డిపాజిట్లు పెరుగుతూనే ఉన్నాయి. జన్ ధన్ ఖాతాల్లో డిపాజిట్లు రూ.1 లక్ష కోట్ల మార్క్‌ దాటడానికి ఇంకా ఎక్కువ రోజులు పట్టదు.

news18-telugu
Updated: April 23, 2019, 11:20 AM IST
Jan Dhan Account: జన్ ధన్ అకౌంట్లలో రూ.97 వేల కోట్ల డిపాజిట్లు
Jan Dhan Account: జన్ ధన్ అకౌంట్లలో రూ.97 వేల కోట్ల డిపాజిట్లు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మోడీ ప్రభుత్వం ఐదేళ్ల క్రితం ప్రారంభించిన జన్ ధన్ అకౌంట్లలో డిపాజిట్లు రూ.1 లక్ష కోట్ల దిశగా పయనిస్తుండటం విశేషం. ఏప్రిల్ 3 వరకు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కల ప్రకారం జన్ ధన్ ఖాతాల్లో డిపాజిట్ల మొత్తం రూ.97,665.66 కోట్లు. సరిగ్గా వారం ముందు అంటే మార్చి 27న రూ.96,107.35 కోట్ల డిపాజిట్లు ఉండగా, అంతకంటే ముందు వారం రూ.95,382.14 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. వారంవారం జన్ ధన్ అకౌంట్లలో డిపాజిట్లు పెరుగుతూనే ఉన్నాయి. జన్ ధన్ ఖాతాల్లో డిపాజిట్లు రూ.1 లక్ష కోట్ల మార్క్‌ దాటడానికి ఇంకా ఎక్కువ రోజులు పట్టదు.

Read this: Minimum Balance: బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్‌ లెక్కించేది ఇలాగే...

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన-PMJDY పథకాన్ని 2018 ఆగస్ట్ 28న ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. దేశంలోనే ప్రతీ ఒక్కరికీ బ్యాంకు సేవలు అందించడమే లక్ష్యంగా ప్రారంభించిన పథకం ఇది. ఈ పథకంలో భాగంగా మొత్తం 35.39 కోట్ల మంది జన్ ధన్ ఖాతాలు తీసుకున్నారు. 27.89 కోట్ల మంది అకౌంట్ హోల్డర్లకు రూపే డెబిట్ కార్డులు జారీ చేశాయి బ్యాంకులు. ఈ పథకంలో భాగంగా అకౌంట్ తీసుకున్నవారికి రూ.2 లక్షల ప్రమాద బీమా ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. అంతకుముందు ఈ బీమా రూ.1 లక్ష మాత్రమే ఉండేది. ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్‌ను కూడా రూ.10,000 చేయడం విశేషం.

Read this: SSC MTS Jobs: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్

జన్ ధన్ అకౌంట్లు ఉన్నవారిలో 50 శాతం మంది మహిళలున్నారు. 59 శాతం అకౌంట్లు రూరల్, సెమీ-అర్బన్ ప్రాంతాల్లోనే ఉన్నాయి. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నిర్వహించడంతో పాటు చెల్లింపులు, అప్పులు, బీమా, పెన్షన్ లాంటి సౌకర్యాలు తక్కువ ఆదాయం గల వర్గాలకు అందించడమే ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన లక్ష్యం. అంతే కాదు ప్రభుత్వ పథకాలకు చెందిన నిధుల్ని నేరుగా PMJDY అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తోంది కేంద్రం.

Realme 3 Pro: రిలీజైన రియల్‌మీ 3 ప్రో... ఎలా ఉందో చూశారా?
ఇవి కూడా చదవండి:

Indian Railways: మీరు ఎక్కిన రైలు డర్టీగా ఉందా? ఇలా కంప్లైంట్ చేయండి

IRCTC-ePayLater: డబ్బులు లేవా? అయినా ట్రైన్ టికెట్ బుక్ చేయొచ్చు ఇలా...

SBI Loan: ఎస్‌బీఐలో ఎలక్ట్రిక్ వాహనాల లోన్‌పై డిస్కౌంట్
First published: April 23, 2019, 11:20 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading