కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అందిస్తుంటుంది. నిరుపేదలకు కూడా బ్యాంకింగ్ సేవల్ని దగ్గర చేయడమే లక్ష్యంగా ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) పేరుతో అతిపెద్ద కార్యక్రమానికి 2014 లో శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు జన్ ధన్ అకౌంట్ ఓపెన్ చేసినవారి సంఖ్య 47.28 కోట్లు. ఇక ఈ అకౌంట్లలో ఉన్న బ్యాలెన్స్ మొత్తం రూ.177,983 కోట్లు. సమాజంలోని వెనుకబడిన వర్గాలకు బ్యాంకింగ్ సేవల్ని అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జన్ ధన్ అకౌంట్ (Jan Dhan Account) ఖాతాదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తోంది. అసలు జన్ ధన్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఈ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి? తెలుసుకోండి.
కేంద్ర ప్రభుత్వం 2014లో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పథకాన్ని ప్రారంభించింది. 2014 ఆగస్ట్ 23 నుంచి 29 మధ్య ఎక్కువగా ఈ అకౌంట్స్ ఓపెన్ చేసినవారున్నారు. కొన్ని వారాల్లోనే కోటీ 80 లక్షల అకౌంట్లు ఓపెన్ కావడంతో ఈ పథకానికి గిన్నీస్ బుక్ ఆఫ్ వాల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్ కూడా వచ్చింది. ఇప్పుడు 47.28 కోట్లకు పైగా జన్ ధన్ అకౌంట్ హోల్డర్లు ఉన్నారు. త్వరలోనే 50 కోట్ల మార్క్ చేరుకోవడం ఖాయం.
Good News: ఈపీఎఫ్ఓ అలర్ట్... మీ అకౌంట్‌లో డబ్బులు పడుతున్నాయి... ఇలా చెక్ చేసుకోండి
జన్ ధన్ అకౌంట్ బేసిక్ సేవింగ్స్ అకౌంట్. ఎవరైనా ఈ అకౌంట్‌ను సులువుగా ఓపెన్ చేయొచ్చు. మీరు ఏ బ్యాంకులో ఇతర సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కానీ జన్ ధన్ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో దాచుకునే డబ్బులకు వడ్డీ కూడా వస్తుంది.
జన్ ధన్ అకౌంట్ హోల్డర్లకు రూపే డెబిట్ కార్డ్ ఉచితంగా లభిస్తుంది. రూపే డెబిట్ కార్డ్ ఉన్న జన్ ధన్ అకౌంట్ హోల్డర్లకు రూ.2 లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ కవర్ కూడా లభిస్తుంది. ఇక ఈ అకౌంట్‌లో రూ.10,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం ఉంది. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన లాంటి పథకాలు కూడా పొందొచ్చు.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే కాదు ప్రైవేట్ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంకుల్లో కూడా జన్ ధన్ అకౌంట్స్ తెరవొచ్చు. జన్ ధన్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే నేరుగా మీకు దగ్గర్లో ఉన్న ఏదైనా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాలి. జన్ ధన్ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ పూర్తి చేసివ్వాలి. జన్ ధన్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కేవైసీ తప్పనిసరి. పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ , ఆధార్ కార్డ్ , ఓటర్ ఐడీ కార్డ్, ఉపాధి హామీ జాబ్కార్డ్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసిన ఐడీ కార్డ్, గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసిన లెటర్‌లో ఏదైనా ప్రూఫ్ ఇవ్వొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank account, Insurance, Jan dhan account, Jan dhan yojana, Personal Finance, Pradhan Mantri Jan Dhan Yojana