Garib Kalyan Yojana | మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డు (Ration Card) కలిగిన వారికి అదిరే శుభవార్త అందించింది. ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ అన్నా యోజన పథకాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. మరో 3 నెలల పాటు ఈ స్కీమ్ అందుబాటులో ఉండనుంది. కేంద్ర ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ఊరట కలుగుతుంది. మరో 3 నెలల పాటు ఉచిత రేషన్ (Free Ration) పొందొచ్చు. దీని వల్ల కేంద్రంపై రూ. 40 వేల కోట్ల మేర భారం పడనుంది.
ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ అన్నా యోజన స్కీమ్ పొడిగింపు వల్ల దాదాపు 80 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో ఈ స్కీమ్‌ను తీసుకువచ్చింది. 2020 మార్చిలో ఈ పథకాన్ని ఆవిష్కరించింది. ఈ స్కీమ్ కింద రేషన్ కార్డు కలిగిన వారికి ఉచితంగా 5 కేజీల బియ్యం లభిస్తాయి. ఒక్కో వ్యక్తికి 5 కేజీలు వస్తాయి. అంటే రేషన్ కార్డులో నలుగురు ఉంటే వారికి ఉచితంగా 20 కేజీల బియ్యం లభిస్తాయి.
ఉద్యోగులకు, పెన్షనర్లకు మోదీ దసరా కానుక.. కేంద్రం కీలక నిర్ణయం!
ఇలా వ్యక్తి ప్రాతిపదికన ఒక్కొక్కరికి 5 కేజీల బియ్యాన్ని ఇంకో మూడు నెలల పాటు ఉచితంగా పొందొచ్చు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ప్రయోజనం పొందే వారందరికీ ఈ బెనిఫిట్ లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రేషన్ సరుకులకు ఈ ఉచిత బియ్యం అదనం అని గుర్తించుకోవాలి. కాగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు మార్లు ఈ స్కీమ్ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
శుభవార్త.. పడిపోయిన బంగారం ధర!
2020-21లో ఈ స్కీమ్‌ను తొలిగా మూడు నెలలు మాత్రమే అందించాలని కేంద్రం భావించింది. అంటే 2020 ఏప్రిల్, మే, జూన్ నెలలకు మాత్రమే ఈ బెనిఫిట్ వర్తింపజేయాలని యోచించింది. అయితే తర్వాత దీన్ని 2020 జూలై నుంచి నవంబర్ కాలానికి పొడిగించింది. అటుపైన ఈ స్కీమ్‌ను మళ్లీ 2021 మే, జూన్ నెలలకు ఎక్స్‌టెండ్ చేశారు.
తర్వాత మళ్లీ 2021 జూలై నుంచి నవంబర్ వరకు పథకాన్ని పొడిగించారు. అటుపైన మళ్లీ ఈ పథకాన్ని 2021 డిసెంబర్ నుంచి 2022 మార్చి వరకు పొడిగించారు. మార్చి 26న మళ్లీ ఈ పథకాన్ని ఆరు నెలలు కేంద్రం పొడిగించింది. అంటే సెప్టెంబర్ 30 వరకు ఎక్స్‌టెండ్ చేసింది. ఇప్పుడు మళ్లీ 3 నెలలు స్కీమ్ పొడిగించారు. ఉచిత రేషన్ స్కీమ్ గడువు సాధారణంగా సెప్టెంబర్ 30తో ముగియాల్సి ఉంది. అయితే ప్రభుత్వం దీన్ని మూడు నెలలు పొడిగించింది. అంటే డిసెంబర్ వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉండనుంది. కాగా కేంద్ర ప్రభుత్వానికి ఈ స్కీమ్ వల్ల దాదాపు రూ.3.4 లక్షల కోట్ల మేర భారం పడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: DA Hike, Dearness allowance, Free Ration, Ration card