Home /News /business /

PRABHUDAS LILLADHER BETS ON THESE 8 AUTO STOCKS FOR AN UPSIDE OF UP TO 42 MK

Prabhudas Lilladher Stocks: 2022లో సిరులు కురిపించే ఆటో మొబైల్ రంగ స్టాక్స్ ఇవే...టాటా మోటార్స్ లో ఇంకా సత్తా ఉందా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Prabhudas Lilladher Stocks: ఆటో మొబైల్స్ మార్కెట్ గత కోవిడ్ లాక్ డౌన్ నష్టాల నుంచి తేరుకొని నెమ్మదిగా ముందుకు నడుస్తోంది. తాజాగా టూ వీలర్, ఫోర్ వీలర్, కమర్షియల్ వెహికల్స్ అమ్మకాలు నెమ్మదిగా పుంజుకున్నాయి. అయితే గతంలో పొందిన భారీ బ్యాక్‌లాగ్ ఆర్డర్‌లను క్లియర్ చేయడం ద్వారా కమర్షియల్ వాహనాల విక్రయాలు మెరుగుపడవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఇంకా చదవండి ...
    Prabhudas Lilladher Stocks:  ఆటో మొబైల్స్ మార్కెట్ గత కోవిడ్ లాక్ డౌన్ నష్టాల నుంచి తేరుకొని నెమ్మదిగా ముందుకు నడుస్తోంది. తాజాగా టూ వీలర్, ఫోర్ వీలర్, కమర్షియల్ వెహికల్స్ అమ్మకాలు నెమ్మదిగా పుంజుకున్నాయి. అయితే గతంలో పొందిన భారీ బ్యాక్‌లాగ్ ఆర్డర్‌లను క్లియర్ చేయడం ద్వారా కమర్షియల్ వాహనాల విక్రయాలు మెరుగుపడవచ్చని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు SUVలు, లగ్జరీ కార్ల కోసం డిమాండ్ 4 వీలర్ వెహికల్ సెగ్మెంట్‌లో బలంగా ఉండటం కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. అయినప్పటికీ ఒమిక్రాన్ ఎఫెక్ట్ వల్ల కొన్ని ప్రాంతాల్లో వెయిటింగ్ పీరియడ్ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ద్విచక్ర వాహనాల్లో, సెమీకండక్టర్ల కొరత కారణంగా ప్రీమియం బైక్‌ల విక్రయాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే సెంటిమెంట్ మెరుగవుతోంది. ఈ నేపథ్యంలో 2022లో ద్విచక్ర వాహనాల విక్రయాలు నెమ్మదిగా పుంజుకునే వీలుంది. అయితే బైక్‌ల ధరలు పెరగడం, ఇంధన ధరల పెంపు, పరిస్థితుల కారణంగా డిమాండ్‌ దెబ్బతింది. ఇదిలా ఉంటే ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ప్రభుదాస్ లీలాధర్ మాత్రం మెరుగైన ఫ్లీట్ , ముడి వస్తువుల లభ్యత, కారణంగా కమర్షియల్ వాహనాల అమ్మకాల్లో మెరుగుదల పొందే అవకాశం ఉందనే పేర్కొంది. అందుకే బ్రోకరేజ్ సంస్థ ప్రభుదాస్ లీలాధర్ రానున్న సంవత్సరం 42 శాతం వరకు బలమైన రాబడిని ఇవ్వగల ఆటో స్టాక్‌లను సూచించంది. అవేంటో ఓసారి లుక్కేద్దాం.

    Smart Watch: ఇలాంటి Smart Watch మీరెప్పుడు చూసి ఉండరు.. 10 రోజుల బ్యాటరీ బ్యాకప్ తో.. అదిరిపోయే ఫీచర్లు..


    Ashok Leyland | Rating: Buy | LTP: Rs 121 | Target: Rs 170 | Upside: 40 percent

    ప్రముఖ కమర్షియల్ వాహనాల సంస్థ అయిన అశోక్ లేల్యాండ్ కు ప్రభుదాస్ లీలాధర్ సంస్థ బయ్ రేటింగ్ ఇచ్చింది. ప్రస్తుతం 121 రూపాయల వద్ద ట్రేడవుతున్న ఈ స్టాక్ రానున్న రోజుల్లో దాదాపు 40 శాతం వరకూ పెరిగే చాన్స్ ఉందని పేర్కొంది. అంతేకాదు ఈ స్టాక్ టార్గెట్ ను సైతం రూ.170 గా నిర్ణయంచింది.

    Bharat Forge | Rating: Buy | LTP: Rs 701 | Target: Rs 997 | Upside: 42 percent

    కమర్షియవల్ వెహికిల్ సెగ్మెంట్ లో మరో దిగ్గజ సంస్థ అయినటువంటి భారత్ ఫోర్జ్ కు సైతం బయ్ రేటింగ్ దక్కింది.  ప్రస్తుతం 701 రూపాయల వద్ద ట్రేడవుతున్న ఈ స్టాక్ కు, టార్గెట్ ధరగా 997 రూపాయలను ఫిక్స్ చేశారు. ఇందులో దాదాపు 42 శాతం అప్ సైడ్ ఉన్నట్లు పేర్కొంటున్నారు.

    Exide Industries | Rating: Buy | LTP: Rs 166 | Target: Rs 208 | Upside: 25 percent

    ఎక్సైడ్ ఇండస్ట్రీస్, ఆటో బ్యాటరీల ఉత్పత్తి రంగంలోని ఈ స్టాక్ కు సైతం ప్రభుదాస్ లీలాధర్ టార్గెట్ ధరగా 208 రూపాయలను ఫిక్స్ చేసింది. ఇందులో దాదాపు 25 శాతం వరకూ రిటర్న్ ఆశించవచ్చని తెలిపింది.

    Hero MotoCorp | Rating: Buy | LTP: Rs 2,435 | Target: Rs 3,115 | Upside: 28 percent

    హీరో మోటో కార్ప్, ద్విచక్రవాహనాల సెగ్మెంట్ లో దూసుకెళ్తున్న ఈ సంస్థకు సైతం బ్రోకరేజి సంస్థ బయ్ రేటింగ్ ఇచ్చింది. దీనికి కూడా టార్గెట్ గా రూ.3115 నిర్ణయంచారు. పెరుగుతున్న రూరల్ డిమాండ్ దీనికి కలిసి వచ్చే అవకాశం ఉంది.

    Tata Motors | Rating: Buy | LTP: Rs 475 | Target: Rs 648 | Upside: 36 percent

    టాటా మోటార్స్, ఇఫ్పటికే ఈ స్టాక్ గత సంవత్సరం ఔట్ పెర్ఫార్మ్ చేసింది. అయితే ఈ స్టాక్ లో మరో 36 శాతం రిటర్న్ ఎక్స్ పెక్ట్ చేయవచ్చని బ్రోకరేజీ సంస్థ ఆశిస్తోంది. అంతే కాదు దీని టార్గెట్ ధరగా రూ.648ని ఫిక్స్ చేసింది.

    Ola Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో సాంకేతిక సమస్యలు.. ఆ సమస్యలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు..


    Disclaimer: పైన పేర్కొన్నటువంటి రికమండేషన్స్ కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. న్యూస్ 18 తెలుగు వెబ్ సైట్ మీ పెట్టుబడులు, లావాదేవీలకు ఎటువంటి సలహాలు అందించదు. స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. పెట్టుబడి పెట్టే ముందు సర్టిఫైడ్ పైనాన్స్ అడ్వైజర్లు సంప్రదిస్తే మంచిది.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Stock Market

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు