• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • PPF FOR MINOR CHILD YOU CAN CREATE A PROVIDENT FUND ACCOUNT FOR YOUR MINOR CHILD WITH MANY BENEFITS HERE IS THE WAY NK GH

PPF in Minor Child's name: పిల్లల పేరుతో ప్రావిడెంట్ ఫండ్ ఖాతా... ఇలా తెరవండి

PPF in Minor Child's name: పిల్లల పేరుతో ప్రావిడెంట్ ఫండ్ ఖాతా... ఇలా తెరవండి (ప్రతీకాత్మక చిత్రం)

PPF in Minor Child's name: చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పాపులర్ అయిన దీర్ఘకాల పెట్టుబడిగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (Public Provident Fund) ప్రాధాన్యం సంపాదించుకుంది. ఈ పీపీఎఫ్‌ ఖాతాను మీ చిన్నారుల పేరుతో కూడా తెరవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.

  • Share this:
ప్రభుత్వ పథకం: EEE ట్యాక్సేషన్ బెనిఫిట్ (taxation benefit)తో ప్రభుత్వం ప్రారంభించిన పొదుపు పథకంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (Public Provident Fund) మంచి ఆదరణ పొందుతోంది. దీనికి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద మినహాయింపు లభిస్తుంది. వడ్డీ ఆదాయం, మెచ్యూరిటీ మొత్తాలపై రెండింటికీ ట్యాక్స్ వర్తించదు. దీన్నే EEE ట్యాక్సేషన్ బెనిఫిట్ బెనిఫిట్ అంటారు. మైనర్లైన మీ పిల్లల పేరుతో ఖాతా తెరిచేందుకు ప్రారంభ మొత్తంగా కనీసం రూ.100 అవసరం. మీ చిన్నారుల పేరుతో PPF ఖాతా తెరవాలనుకుంటే ఏడాదికి డిపాజిట్ చేయాల్సిన కనీస మొత్తం రూ.500 కాగా గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు జమ చేయవచ్చు. మీ పిల్లల భవిష్యత్తుకు ఈ డబ్బు ఎంతగానో ఉపయోగపడుతుంది.

మేజర్లయ్యాక వారే ఆపరేట్ చేయవచ్చు:
తల్లిదండ్రులుగా, లేదా గార్డియన్‌గా మీ పిల్లల పేరుపై మైనర్ గార్డియన్‌గా పీపీఎఫ్ ఖాతా తెరవండి. పిల్లలకు 18 ఏళ్లు నిండాక... వారి ఖాతా వారే స్వయంగా ఆపరేట్ చేసుకోవచ్చు లేదా తల్లిందండ్రులు ఆపరేట్ చేయవచ్చు. అంతేకాదు మైనర్ అకౌంట్‌పై కొంత మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. ఇదే కాకుండా లోన్ కూడా తీసుకునే సౌలభ్యం ఉంది.

ఇప్పటికే అకౌంట్ ఉంటే:
పిల్లల పేరుతో పీపీఎఫ్ ఖాతా తెరిచే సమయానికి తల్లిదండ్రులకు పీపీఎఫ్ అకౌంట్ ఉన్నట్టైతే ఏడాదికి గరిష్ఠంగా రూ.1.5 లక్షలు మాత్రమే జమచేసేందుకు అవకాశం ఉంటుంది. 15 ఏళ్ల పాటు లాక్-ఇన్ పీరియడ్ ఉన్న పీపీఎఫ్ దీర్ఘకాల పెట్టుబడి (long term investment) కనుక ఆకర్షణీయమైన రిటర్నులు ఉంటాయి. కాబట్టి మీరు ఎంత త్వరగా మీ పిల్లల పేరుతో అకౌంట్ ఓపన్ చేస్తే అంత త్వరగా అది మీ చేతికి అందుతుంది. ఒకవేళ మీ పాప లేదా బాబుకు 10 ఏళ్ల వయసు వచ్చాక మీరు వారి పేరుతో పీపీఎఫ్ ఖాతా తెరిచారు అనుకుందాం. అలాంటప్పుడు 15 ఏళ్ల లాక్-ఇన్ పీరియడ్ తరువాత అంటే వారికి 25-26 ఏళ్లు వచ్చాకే ఈ పీపీఎఫ్ మొత్తం చేతికి వస్తుంది. ఇక మెచ్యూరిటీ సమయానికి మీ పిల్లలకు ఆ డబ్బుతో అవసరం లేదనుకుంటే పీపీఎఫ్ ఖాతాను మళ్లీ పొడగించవచ్చు కూడా. ఇలా పెంచాలంటే ప్రతి 5 ఏళ్లకోసారి గడువును పెంచుకుంటూ పోవచ్చు.

పైన చెప్పినట్టు 25 ఏళ్ల వయసులో పీపీఎఫ్ మొత్తం తీసుకునే అవసరం లేదని మీ పిల్లలు భావిస్తే దాన్ని 30 ఏళ్ల వరకు పొడగించుకోవచ్చు. అప్పుడు కూడా వద్దనుకుంటే మరో 5 ఏళ్లు గడువు పెంచుకునే వెసులుబాటుంది. ఇలా 5 ఏళ్లకోసారి గడువును మరో 5 ఏళ్ల పాటు పెంచుకోవచ్చు. మీ పిల్లల రిటైర్మెంట్ ఫండ్‌గా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇదంతా మీ పిల్లల ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. ఇలా గడువు పెంచే క్రమంలో డిపాజిట్లు చేయాలా వద్దా అనేది వారి ఇష్టం. ప్రస్తుతమున్న ఆదాయపన్ను చట్టాల ప్రకారం ఇలా ఎక్స్ టెన్షన్ పీరియడ్‌లో చేసే డిపాజిట్ మాత్రం ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తుంది. ప్రసుతం పీపీఎఫ్ వడ్డీ 7.1 శాతంగా ఉంది.

పేరెంట్స్‌కు ట్యాక్స్ బెనిఫిట్ ఉండదు:
మైనర్ పిల్లల పేరుతో చేసే ఇలాంటి పీపీఎఫ్ పెట్టుబడులతో తల్లిదండ్రులకు ప్రత్యేకమైన ట్యాక్స్ బెనిఫిట్లు ఏమీ దక్కవు. కాకపోతే ఇది మీ పిల్లల భవిష్యత్తుకు చక్కగా సాయపడుతుంది. మీ పిల్లలు మేజర్లు అయినప్పుడు మాత్రమే అది ట్యాక్స్ బెనిఫిట్‌గా మీ పిల్లలకు ఉపయోగపడుతుంది. ఇలాంటి పీపీఎఫ్ ఖాతాలపై సెక్షన్ 10(32) కింద ప్రతి ఏటా కేవలం రూ.1,500 మాత్రమే మీరు ఆదాయపన్ను మినహాయింపు పొందవచ్చు. ఇద్దరు పిల్లలపై ఈ మినహాయింపు పొందవచ్చు.

ఇది కూడా చదవండి:Puri Jagannath Temple: పూరీ జగన్నాథ ఆలయంలో భక్తులకు అనుమతి. అద్భుత దృశ్యాలు

ఇది మీరు పిల్లల పేరుతో చేస్తున్న భవిష్య నిధి పొదుపు పథకం కనుక మీలో ఇది ఆర్థిక క్రమశిక్షణ తెచ్చేందుకు ఎమోషనల్ అస్త్రంగా పనిచేస్తుంది. అంతేకాదు పిల్లల పేరుతో ఏటా కనీసం ఎంతో కొంత పీపీఎఫ్ ఖాతాలో జమచేయాలి కనుక అది గోల్ బేస్డ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా పనికొస్తుంది.
Published by:Krishna Kumar N
First published: