కేంద్ర ప్రభుత్వం సామాన్యుల కోసం అనేక పొదుపు పథకాలను (Savings Schemes) అందిస్తున్నాయి. పిల్లల పైచదువులు, పెళ్లి ఖర్చులు, రిటైర్మెంట్ తర్వాతి అవసరాలు... ఇలా పలు కారణాలతో డబ్బు పొదుపు చేయాలనుకునేవారికి (Money Saving Ideas) అనేక పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ ద్వారా ఈ పథకాల్లో (Post Office Schemes) చేరొచ్చు. పోస్ట్ ఆఫీసుల్లో లభిస్తున్న పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) కూడా ఒకటి. ఈ స్కీమ్‌లో పొదుపు చేయడం ద్వారా మంచి రిటర్న్స్ పొందడంతో పాటు పన్ను ప్రయోజనాలు కూడా పొందొచ్చు. అందుకే ట్యాక్స్ సేవింగ్ కోసం పీపీఎఫ్ స్కీమ్‌లో చేరేవారు ఎక్కువగా ఉంటారు. రిస్కు కూడా తక్కువ కావడంతో పీపీఎఫ్ స్కీమ్ బాగా పాపులర్ అయింది.
పీపీఎఫ్ స్కీమ్‌లో ఏటా కనీసం రూ.500 నుంచి గరిష్టంగా రూ.1,50,000 వరకు పొదుపు చేయొచ్చు. ప్రస్తుతం పీపీఎఫ్ పథకానికి 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ స్కీమ్‌లో దాచుకునే డబ్బుకు, ఆ డబ్బుపై వచ్చే వడ్డీకి, విత్‌డ్రాయల్స్‌కు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ స్కీమ్‌లో గరిష్టంగా 15 ఏళ్ల పాటు పొదుపు చేయొచ్చు. 15 ఏళ్ల తర్వాత డబ్బు అవసరం లేదంటే పీపీఎఫ్ అకౌంట్ ఎక్స్‌టెన్షన్ ఫామ్ సబ్మిట్ చేసి మరో ఐదేళ్లు పథకాన్ని పొడిగించవచ్చు.
Loan in 30 seconds: అర నిమిషంలో పర్సనల్ లోన్... వాట్సప్‌లో Hi అని టైప్ చేయండి చాలు
పీపీఎఫ్ స్కీమ్‌లో డబ్బు దాచుకోవడం ద్వారా రిటైర్మెంట్ నాటికి కోటి రూపాయల పైనే పొదుపు చేయొచ్చు. పీపీఎఫ్ స్కీమ్‌లో నెలకు గరిష్టంగా రూ.12,500 జమ చేయొచ్చు. అంటే రోజుకు రూ.417 చొప్పున జమ చేసే అవకాశం ఉంటుంది. ఏడాదికి రూ.1,50,000 చొప్పున 15 ఏళ్ల పాటు జమ చేయొచ్చు. ప్రస్తుత వడ్డీ ప్రకారం లెక్కిస్తే 15 ఏళ్ల తర్వాత రూ.40.58 లక్షల రిటర్న్స్ వస్తాయి.
పీపీఎఫ్ స్కీమ్‌లో రెండు సార్లు ఐదేళ్ల చొప్పున స్కీమ్‌ను పొడిగించుకోవచ్చు. అంటే 25 ఏళ్ల పాటు ఈ స్కీమ్‌లో కొనసాగవచ్చు. ఓ వ్యక్తి 35 ఏళ్ల వయస్సులో ఈ స్కీమ్‌లో చేరితే 60 ఏళ్ల వయస్సు వచ్చేవరకు కొనసాగవచ్చు. మెచ్యూరిటీ సమయంలో రూ.1.03 కోట్ల రిటర్న్స్ వస్తాయి. ఇందులో జమ చేసిన మొత్తం రూ.37 లక్షలైతే, వడ్డీ రూ.66 లక్షలు లభిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో వచ్చే మొత్తానికి పన్ను మినహాయింపు లభిస్తుంది. వడ్డీకి కూడా పన్ను ఉండదు.
Pension Scheme: నెలకు రూ.5,000 పొదుపు చేస్తే ప్రతీ నెలా రూ.1,00,000 పెన్షన్... స్కీమ్ వివరాలివే
పీపీఎఫ్ స్కీమ్‌లో ప్రతీ నెలా ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు వడ్డీని లెక్కిస్తారు. కాబట్టి ప్రతీ నెలా ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ఈ స్కీమ్‌లో డబ్బులు జమ చేయాలి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ పోస్ట్ ఆఫీసుతో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇతర బ్యాంకుల్లో కూడా అందుబాటులో ఉంటుంది. నామినేషన్ సదుపాయం ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Personal Finance, Post office scheme, PPF, Save Money, Savings