హోమ్ /వార్తలు /బిజినెస్ /

Saving Schemes: బ్యాంక్, పోస్టాఫీస్‌లో అద్భుతమైన స్కీమ్.. చేరితే రూ.40 లక్షలు పొందొచ్చు!

Saving Schemes: బ్యాంక్, పోస్టాఫీస్‌లో అద్భుతమైన స్కీమ్.. చేరితే రూ.40 లక్షలు పొందొచ్చు!

 బ్యాంక్, పోస్టాఫీస్‌లో అద్భుతమైన స్కీమ్.. చేరితే రూ.40 లక్షలు పొందొచ్చు!

బ్యాంక్, పోస్టాఫీస్‌లో అద్భుతమైన స్కీమ్.. చేరితే రూ.40 లక్షలు పొందొచ్చు!

Public Provident Fund రిస్క్ లేకుండా రాబడి పొందాలని చూస్తున్నారా? దీర్ఘకాలంలో పిల్లల పేరుపై రూ.లక్షలు కూడబెట్టాలని యోచిస్తున్నారా? అయితే మీకు ఈ స్కీమ్ అనువుగా ఉంటుంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  PPF Interest Rate | మీరు మీ పిల్లలకు బంగారం లాంటి భవిష్యత్‌ను కానుకగా ఇవ్వాలని భావిస్తున్నారా? అయితే మీరు వారి కోసం ఇప్పటి నుంచే డబ్బులు (Money) పొదుపు చేస్తూ రావాలి. మార్కెట్‌లో ప్రస్తుతం పలు రకాల ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు ఉన్నాయి. వీటిల్లో సేవింగ్ స్కీమ్స్‌కు ఎప్పటికీ మంచి ఆదరణ ఉంటుంది. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పాపులర్ అయిన స్కీమ్స్‌లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) కూడా ఒకటి.

  పీపీఎఫ్ మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు. అంటే మీరు 15 ఏళ్ల పాటు డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. దీర్ఘ కాలంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావించే వారికి ఇది మంచి ఆప్షన్. అంటే పిల్లల పేరుపై డబ్బులు పొదుపు చేయాలని భావించే వారు ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. కేంద్రం ఈసారి కూడా వడ్డీ రేటును మార్చలేదు. డిసెంబర్ వరకు ఇదే వడ్డీ రేటు ఉంటుంది.

  భారీ షాక్.. రూ.2,000 పెరిగిన బంగారం ధర.. జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న గోల్డ్

  పీపీఎఫ్‌లో డబ్బులు పెడితే పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. పీపీఎఫ్‌ స్కీమ్‌లో చేరితే ఏడాదికిరూ. 1.5 లక్షల వరకు (నెలకు రూ. 12,500 వరకు) డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. పీపీఎఫ్ మెచ్యూరిటీ కాలం అయినపోయిన తర్వాత 5 ఏళ్ల చొప్పున స్కీమ్‌ను పొడిగించుకోవచ్చు. ఈ స్కీమ్‌లో చేరితే మెచ్యూరిటీలో ఎంత మొత్తం పొందొచ్చొ తెలుసుకుందాం.

  కారు కొంటే రూ.40 వేల డిస్కౌంట్! పండుగ ఆఫర్ అదిరింది!

  ఉదాహరణకు మీరు పీపీఎఫ్ అకౌంట్ తెరిచి నెలకు రూ. 12,500 ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. అంటే ఏడాదికి రూ.1,50,000 పెడుతున్నారు. ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం చూస్తే మెచ్యూరిటీ సమయంలో చేతికి రూ.40 లక్షలకు పైగా లభిస్తాయి. పెట్టిన డబ్బులు రూ. 22 లక్షలు అవుతాయి. అంటే వడ్డీ రూపంలో రూ.18,18,209 లభిస్తాయి. అదే పథకాన్ని ఐదేళ్లు పొడిగిస్తే.. చేతికి రూ. 66 లక్షలకు పైగా వస్తాయి. మళ్లీ ఐదేళ్లు పొడిగిస్తే.. అప్పుడు మెచ్యూరిటీ అమౌంట్ రూ. 1.03 కోట్లుగా ఉంటుంది. అంటే కాంపౌండింగ్ బెనిఫిట్ లభిస్తోంది. అందుకే భారీ మొత్తం వస్తుంది. నెలకు రూ. 12,500 లేకున్నా మీకు నచ్చినంత మొత్తాన్ని డిపాజిట్ చేసుకుంటూ వెళ్లొచ్చు. మీరు ప్రతి నెలా ఇన్వెస్ట్ చేసే మొత్తం ప్రాతిపదికన మీకు వచ్చే రాబడి కూడా ఆధారపడి ఉంటుంది. ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేస్తే అధిక రాబడి పొందొచ్చు.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Banks, Money, Personal Finance, Post office, PPF

  ఉత్తమ కథలు