హోమ్ /వార్తలు /బిజినెస్ /

Rs 1 Crore Returns: జీతం వచ్చేసిందా? ఇలా పొదుపు చేస్తే రూ.1 కోటి మీదే

Rs 1 Crore Returns: జీతం వచ్చేసిందా? ఇలా పొదుపు చేస్తే రూ.1 కోటి మీదే

Rs 1 Crore Returns: జీతం వచ్చేసిందా? ఇలా పొదుపు చేస్తే రూ.1 కోటి మీదే
(ప్రతీకాత్మక చిత్రం)

Rs 1 Crore Returns: జీతం వచ్చేసిందా? ఇలా పొదుపు చేస్తే రూ.1 కోటి మీదే (ప్రతీకాత్మక చిత్రం)

Rs 1 Crore Returns | కోటి రూపాయలు సంపాదించడం కష్టమా? కష్టమేమీ కాదు. ప్రతీ నెలా కొంత మొత్తం దీర్ఘకాలం పొదుపు (Money Saving) చేస్తే రూ.1 కోటి జమ చేయొచ్చు. ఓ ప్రభుత్వ పొదుపు పథకం ద్వారా ఇది సాధ్యం.

కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో డబ్బు పొదుపు చేయాలన్న (Money Saving) అవగాహన అందరిలో పెరిగిపోతోంది. అయితే మంచి రిటర్న్స్ కావాలంటే ఎంత పొదుపు చేయాలి? ఎలా పొదుపు చేయాలి? ఏ స్కీమ్‌లో డబ్బులు దాచుకోవాలో తెలియక అయోమయానికి గురవుతుంటారు. డబ్బు పొదుపు చేయడానికి అనేక పొదుపు పథకాలు (Saving Schemes) ఉన్నాయి. అందులో కొన్ని స్కీమ్స్‌లో ఎక్కువ కాలం పొదుపు చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. మరి మీరు కూడా డబ్బు పొదుపు చేసి ఎక్కువ రిటర్న్స్ పొందాలనుకుంటున్నారా? పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) స్కీమ్ గురించి ఆలోచించొచ్చు. ఇందులో పొదుపు చేయడం ద్వారా వచ్చే రిటర్న్స్‌కి మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అసరం లేదు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) స్కీమ్‌ను ట్రిపుల్ ఈ స్కీమ్ అంటారు. అంటే ఎగ్జెంప్ట్, ఎగ్జెంప్ట్, ఎగ్జెంప్ట్ ఫీచర్ ద్వారా ఎక్కువ పన్నులు ఆదా చేయొచ్చు. చాలా తక్కువ పథకాల్లో మాత్రమే ఇలాంటి ఫీచర్ ఉంటుంది. అంటే ఇందులో డిపాజిట్ చేసిన మొత్తానికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1,50,000 మొత్తానికి పన్ను మినహాయింపు పొందొచ్చు. ఈ స్కీమ్‌లో దాచుకున్న డబ్బుకు వచ్చే వడ్డీ పైనా పన్ను మినహాయింపు ఉంటుంది. ఇక పీపీఎఫ్ ఖాతాదారులు తమ డబ్బుల్ని విత్‌డ్రా చేసుకున్న పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇలా మూడు రకాలుగా పన్ను మినహాయింపు లభిస్తుంది.

Price Hike: బీ రెడీ... మరో మూడు నెలలు ధరల పెంపు షాక్ తప్పదు

ప్రస్తుతం పీపీఎఫ్ అకౌంట్ హోల్డర్లకు 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ స్కీమ్‌లో దీర్ఘకాలం పెట్టుబడులు పెట్టడం ద్వారా రూ.1 కోటి పైనే జమ చేయొచ్చు. ఈ స్కీమ్‌లో గరిష్టంగా రూ.1,50,000 పొదుపు చేయొచ్చు. అంటే నెలకు రూ.12,500 జమ చేయొచ్చు. అంటే రోజుకు సుమారు రూ.417 చొప్పున జమ చేయాలి. 15 ఏళ్ల పాటు రోజుకు రూ.417 చొప్పున జమ చేస్తే ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం రూ.40.58 లక్షలు జమ అవుతుంది. ఆ తర్వాత రెండు సార్లు ఐదేళ్ల చొప్పున 10 ఏళ్లు బ్లాక్ చేయొచ్చు. 25 ఏళ్ల వరకు కొనసాగిస్తే మెచ్యూరిటీ నాటికి రూ.1.03 కోట్లు వస్తాయి.

New Rules: సామాన్యుల జేబులకు చిల్లు... రేపటి నుంచి అమలులోకి వచ్చే 7 కొత్త రూల్స్ ఇవే

ఈ స్కీమ్‌లో నెలకు రూ.12,500 జమ చేయాలన్న నిబంధన ఏమీ లేదు. కనీసం నెలకు రూ.500 చొప్పున జమ చేయొచ్చు. జీతంలో కొంత మొత్తాన్ని ఇలాంటి పొదుపు పథకాల్లో జమ చేయడం ద్వారా పన్ను మినహాయింపు పొందొచ్చు. దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ కూడా పొందొచ్చు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లాంటి రిస్క్ ఉండే పథకాల్లో ఇన్వెస్ట్ చేయలేనివాళ్లు ఎక్కువ రిటర్న్స్ వచ్చే పీపీఎఫ్ స్కీమ్‌లో పొదుపు చేసి మంచి రిటర్న్స్ పొందొచ్చు.

First published:

Tags: Personal Finance, PPF, Save Money

ఉత్తమ కథలు