Home /News /business /

PPF CALCULATOR SAVE RS 250 PER MONTH IN PUBLIC PROVIDENT FUND ACCOUNT AND GET UP TO RS 62 LAKH RETURNS SS

Save Money: రూ.250 చొప్పున జమ చేస్తే రూ.62 లక్షల రిటర్న్స్... ప్రభుత్వ స్కీమ్ వివరాలివే

PPF Calculator: రూ.250 చొప్పున జమ చేస్తే రూ.62 లక్షల రిటర్న్స్... ప్రభుత్వ స్కీమ్ వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)

PPF Calculator: రూ.250 చొప్పున జమ చేస్తే రూ.62 లక్షల రిటర్న్స్... ప్రభుత్వ స్కీమ్ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

Save Money | మీరు డబ్బు పొుపు చేయాలనుకుంటున్నారా? ప్రతీ నెలా రూ.250 చొప్పున జమ చేసి రూ.62 లక్షల వరకు రిటర్న్స్ పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్ ఇది. ఈ స్కీమ్ వివరాలు తెలుసుకోండి.

    మీరు ప్రతీ నెలా కొంత మొత్తం పొదుపు చేయాలనుకుంటున్నారా? జీతం రాగానే ఎంతో కొంత సేవ్ చేసే ఆలోచనలో ఉన్నారా? డబ్బు పొదుపు చేయడానికి అనేక ప్రభుత్వ పథకాలు (Money Saving Schemes) ఉన్నాయి. 1968లో కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన నేషనల్ సేవింగ్స్ ఇన్‌స్టిట్యూట్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పేరుతో ఓ స్కీమ్ ప్రారంభించింది. ఈ స్కీమ్ బాగా పాపులర్ అయింది. భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ స్కీమ్ 100 శాతం రిస్కు లేని పొదుపు మార్గం. ఇందులో ఎవరైనా పొదుపు చేయొచ్చు. పన్ను లాభాలు కూడా ఉంటాయి. తమ డబ్బులు సురక్షితంగా ఉండటంతో పాటు మంచి రిటర్న్స్ కావాలనుకునేవారు ఈ స్కీమ్‌లో పొదుపు చేస్తుంటారు. అంతేకాదు... పన్ను లాభాలు కూడా ఉండటంతో ట్యాక్స్ సేవింగ్ కోసం ఈ స్కీమ్‌లో డబ్బులు దాచుకుంటూ ఉంటారు.

    పీపీఎఫ్ అకౌంట్‌లో 15 ఏళ్ల వరకు పొదుపు చేయొచ్చు. ఒకవేళ 15 ఏళ్ల తర్వాత కూడా డబ్బులు అవసరం లేకపోతే పీపీఎఫ్ అకౌంట్‌ను ఆ తర్వాత కూడా పొడిగించుకోవచ్చు. ఐదేళ్ల చొప్పున పొడిగించే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్‌కు ఎగ్జెంప్ట్ ఎగ్జెంప్ట్ ఎగ్జెంప్ట్ (EEE Rule) రూల్ వర్తిస్తుంది. ఇందులో డిపాజిట్ చేసే మొత్తానికి పన్ను లాభాలు ఉంటాయి. మెచ్యూరిటీ సమయంలో తీసుకునే డబ్బులకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ స్కీమ్‌లో పొందే వడ్డీకి కూడా పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ఇలాంటి స్కీమ్స్ చాలా తక్కువగా ఉంటాయి.

    Medical Advance: ఆస్పత్రి ఖర్చులకు డబ్బులు కావాలా? రూ.1,00,000 మెడికల్ అడ్వాన్స్ తీసుకోండిలా

    ప్రస్తుతం పీపీఎఫ్ వడ్డీ రేటు వార్షికంగా 7.1 శాతం లభిస్తోంది. ఎక్కువ వడ్డీ లభిస్తున్న కేంద్ర ప్రభుత్వ పొదుపు పథకాల్లో ఇది కూడా ఒకటి. ప్రతీ ఏటా రూ.1.5 లక్షల చొప్పున 15 ఏళ్లు పొదుపు చేస్తే మెచ్యూరిటీ సమయంలో రూ.41 లక్షల రిటర్న్స్ వస్తాయి. ఈ స్కీమ్‌లో రోజూ రూ.250 చొప్పున జమ చేస్తే రూ.62 లక్షల వరకు రిటర్న్స్ పొందొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

    పీపీఎఫ్ అకౌంట్‌లో రోజుకు రూ.250 చొప్పున నెలకు రూ.7,500 జమ చేయాలి. అంటే 365 రోజులకు లెక్కేస్తే రూ.91,250 జమ చేయాలి. 25 ఏళ్ల వయస్సు నుంచి పొదుపు ప్రారంభించి 50 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ప్రతీ నెలా పీపీఎఫ్ అకౌంట్‌లో జమ చేస్తే... జమ చేసే మొత్తం రూ.22 లక్షల పైనే ఉంటుంది. మొత్తం రూ.62.5 లక్షల రిటర్న్స్ వస్తాయి. ఈ మొత్తానికి పన్నులు ఉండవు. ఈ స్కీమ్ ద్వారా వచ్చిన రూ.40 లక్షల వడ్డీకి కూడా ఎలాంటి పన్నులు ఉండవు.

    Business Idea: చీప్‌గా చూడొద్దు... నెలకు రూ.40,000 లాభం ఇచ్చే బిజినెస్ ఐడియా ఇది

    పీపీఎఫ్ అకౌంట్‌లో భారీ మొత్తంలో జమ చేయాలన్న నిబంధనలు ఏమీ లేవు. ఏటా రూ.500 చొప్పున జమ చేయొచ్చు. అయితే వీలైనంత త్వరగా సేవింగ్స్ ప్రారంభిస్తే దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ వస్తాయన్న విషయం గుర్తుంచుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Personal Finance, PPF

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు