Home /News /business /

PPF CALCULATOR KNOW HOW TO BECOME CROREPATI BY SAVING MONEY IN PUBLIC PROVIDENT FUND SCHEME SS

Save Money: ఇలా పొదుపు చేస్తే రిటైర్మెంట్ నాటికి కోటిన్నర రూపాయలు మీవే

Save Money: ఇలా పొదుపు చేస్తే రిటైర్మెంట్ నాటికి కోటిన్నర రూపాయలు మీవే
(ప్రతీకాత్మక చిత్రం)

Save Money: ఇలా పొదుపు చేస్తే రిటైర్మెంట్ నాటికి కోటిన్నర రూపాయలు మీవే (ప్రతీకాత్మక చిత్రం)

Save Money | రిటైర్మెంట్ నాటికి కోటి రూపాయల పైనే సంపద కూడబెట్టాలనుకుంటున్నారా? అయితే ఇప్పటి నుంచే పొదుపు (Money Saving) మొదలుపెట్టాలి. రిటైర్మెంట్ సమయానికి కోటిన్నర రూపాయలు సొంతం కావాలంటే మీరూ ఇలా పొదుపు చేయండి.

    లక్షాధికారులు, కోటీశ్వరులు కావాలంటే ముందుగా ఆర్థిక క్రమశిక్షణ అవసరం. ఆర్థిక క్రమశిక్షణ ఉంటే లక్షాధికారులు కూడా కోటీశ్వరులు కావొచ్చు. కానీ ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే కోటీశ్వరులు కూడా చివరకు చిల్లిగవ్వ లేకుండా మిగిలిపోతుంటారు. అందుకే దీర్ఘకాలంపాటు డబ్బు పొదుపు (Money Saving Tips) చేసే అలవాటు ఉంటే మంచి సంపద కూడబెట్టొచ్చు. ప్రతీ నెలా కొంత మొత్తం పొదుపు చేస్తూ ఉంటే కోటీశ్వరులు కావొచ్చంటే నమ్ముతారా? ఇది సాధ్యమే. ఇందుకోసం ఆర్థిక క్రమశిక్షణ కావాలి. డబ్బు పొదుపు చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసి కోట్లు సంపాదించొచ్చు. అయితే స్టాక్ మార్కెట్‌లో రిస్క్ ఎక్కువ. రిస్క్ లేకుండా పొదుపు చేయాలంటే ప్రభుత్వం నుంచి అనేక పొదుపు పథకాలు (Govt Saving Schemes) ఉన్నాయి.

    కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పొదుపు పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) కూడా ఒకటి. ఇందులో డబ్బు పొదుపు చేస్తే వచ్చే రిటర్న్స్‌పై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. చక్రవడ్డీ అంటే వడ్డీపై వడ్డీ అందించే పొదుపు పథకాల్లో కూడా ఇది కూడా ఒకటి. చక్రవడ్డీతో రిటర్న్స్ బాగా వస్తాయి. మ్యూచువల్ ఫండ్స్‌తో పాటు ఇతర పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రిటర్న్స్‌పై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అందుకే పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయాలని చెబుతుంటారు పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్‌పర్ట్స్.

    SBI Quick Personal Loan: కేవలం 15 నిమిషాల్లో రూ.20 లక్షల లోన్ ఇస్తున్న ఎస్‌బీఐ... వారికి మాత్రమే

    పీపీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు జమ చేయడం ద్వారా కోటీశ్వరులు కావొచ్చు. ప్రతీ ఏటా పీపీఎఫ్ అకౌంట్‌లో రూ.1,50,000 వరకు జమ చేయొచ్చు. అంటే నెలకు రూ.12,500 చొప్పున జమ చేయాలి. ప్రస్తుతం పీపీఎఫ్ వడ్డీ రేటు 7.10 శాతం ఉంది. రిటైర్మెంట్‌లోపు 30 ఏళ్ల పాటు పీపీఎఫ్ అకౌంట్‌లో జమ చేస్తే మీరు జమ చేస్తే మొత్తం రూ.45 లక్షలు అవుతుంది. 7.1 శాతం వడ్డీ లెక్కన మొత్తం రూ.1.54 కోట్లు రిటర్న్స్ వస్తాయి. అంటే రూ.45 లక్షలు జమ చేస్తే రూ.1 కోటి పైనే వడ్డీ వస్తుంది. ఈ స్కీమ్‌లో రూ.250 చొప్పున జమ చేసి రూ.62 లక్షల రిటర్న్స్ ఎలా పొందాలో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.

    Investment Returns: రూ.1 లక్ష పెట్టుబడికి రూ.2.5 కోట్ల రిటర్న్స్... మూడు నెలల్లోనే

    పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో దాచుకునే డబ్బులకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ.1,50,000 వరకు జమ చేసి పన్ను మినహాయింపులు పొందొచ్చు. ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినా ఈ మినహాయింపు ఉంటుంది. పీపీఎఫ్‌తో పోలిస్తే ఈఎల్ఎస్ఎస్ రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తే రిస్కు ఉండదు. పీపీఎఫ్ స్కీమ్ వడ్డీని ప్రభుత్వం సవరిస్తూ ఉంటుంది. వడ్డీ పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ఈ వడ్డీ తగ్గితే రిటర్న్స్ తగ్గుతాయి. వడ్డీ పెరిగితే రిటర్న్స్ పెరుగుతాయి. పీపీఎఫ్ అకౌంట్‌లో 30 ఏళ్ల పాటు డబ్బులు జమ చేయాలంటే పొదుపు చాలా ముందుగా ప్రారంభించాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Personal Finance, PPF, Save Money

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు