హోమ్ /వార్తలు /బిజినెస్ /

PPF Accounts: పీపీఎఫ్‌ అకౌంట్‌ గురించి మీకు ఈ విషయాలు తెలుసా.. డబ్బు విత్‌డ్రాకు ఆ రూల్స్ పాటించాలా..?

PPF Accounts: పీపీఎఫ్‌ అకౌంట్‌ గురించి మీకు ఈ విషయాలు తెలుసా.. డబ్బు విత్‌డ్రాకు ఆ రూల్స్ పాటించాలా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనేది ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం(Central Government) తీసుకొచ్చిన సోషల్‌ సెక్యూరిటీ స్కీమ్‌(Social Security Scheme). ఈ స్కీమ్‌లో రిటైర్‌మెంట్‌ సేవింగ్స్‌(Retirment Savings) కోసం పెట్టుబడులు పెట్టవచ్చు.

ఇంకా చదవండి ...

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనేది ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం(Central Government) తీసుకొచ్చిన సోషల్‌ సెక్యూరిటీ స్కీమ్‌(Social Security Scheme). ఈ స్కీమ్‌లో రిటైర్‌మెంట్‌ సేవింగ్స్‌(Retirement Savings) కోసం పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ స్కీమ్‌ మెచ్యూరిటీ అవడానికి 15 సంవత్సరాల సమయం ఉంటుంది. ఆ తర్వాతే PPF విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి లభిస్తుంది. అయితే కొన్ని పరిస్థితులలో పదవీ విరమణ తర్వాత లభించే మొత్తాన్ని ముందుగానే ఉపసంహరించుకోవచ్చు. స్మాల్‌ సేవింగ్స్‌ స్కీమ్‌లో భాగమైన పీపీఎఫ్ ప్రస్తుతం ఏడాదికి 7.1 శాతం వడ్డీ రేటును(Interest Rate) అందిస్తోంది. త్రైమాసిక ప్రాతిపదికన దీనిపై లభించే రేటును సవరిస్తారు. ఒక పెట్టుబడిదారుడు పథకం కింద సంవత్సరానికి రూ.500 నుంచి గరిష్టంగా రూ.1,50,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

పథకం అసలు కాలవ్యవధి 15 సంవత్సరాలు. ఆ తర్వాత వినియోగదారుడి ఇష్టప్రకారం ఐదేళ్ల చొప్పున ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్లాక్‌లకు పొడిగించుకొనే అవకాశం ఉంది. అకౌంట్‌ ప్రారంభించిన సమయం, పేర్కొన్న తేదీలలోని నిల్వలను బట్టి రుణాలు, ఉపసంహరణలకు అనుమతి లభిస్తుంది. పథకం కింద పెట్టుబడులకు ఆదాయ పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు. PPFను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది కాబట్టి నష్టభయం ప్రమాదం ఉండదు.

15 సంవత్సరాలకు పీపీఎఫ్‌ అకౌంట్‌ మెచ్యూరిటీ పూర్తవుతుంది. ఆ తర్వాత అకౌంట్‌లోని డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే కొన్ని నిబంధనలు, షరతులు వర్తిస్తే కనీసం 5 సంవత్సరాల తర్వాత అయినా అకౌంట్‌లోని మొత్తాన్ని ముందుగానే విత్‌డ్రా చేసుకోవచ్చు. మధ్యలోనే నగదు ఉపసంహరించుకోవాలంటే పాటించాల్సిన నిబంధనలు వివరాలు ఇవే..

After 27 Years: అవునా..! ఇది నిజమేనా..? 27 ఏళ్ల తర్వాత ఇలా జరుగుతుందా..? విషయం ఏంటంటే..


* విత్‌డ్రాయల్‌ ఆన్‌ మెచ్యూరిటీ

PPF అకౌంట్‌ 15 సంవత్సరాల వ్యవధి తర్వాత మెచ్యూర్ అవుతుంది. మెచ్యూరిటీ తర్వాత మొత్తం డబ్బును ఉపసంహరించుకోవచ్చు. బ్యాంక్ బ్రాంచ్ లేదా పోస్టాఫీసులో పీపీఎఫ్ అకౌంట్‌ను తెరవొచ్చు. ఉపసంహరణ సమయంలో ఫారమ్ C నింపి సంబంధిత సంస్థలో అందజేయాలి. ఆ తర్వాత PPF అకౌంట్‌ను మూసివేస్తారు. రిటర్న్‌లతో పెట్టుబడి పెట్టబడిన మొత్తం బ్యాంక్ అకౌంట్‌కు క్రెడిట్ అవుతుంది.

* పాక్షిక ఉపసంహరణ

PPF అకౌంట్‌ ప్రారంభించి కనీసం ఆరు సంవత్సరాలు పూర్తయిన తర్వాత పాక్షికంగా నగదు విత్‌డ్రా చేసుకొనే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో అకౌంట్‌లోని మొత్తంలో 50 శాతం మాత్రమే ఉపసంహరించుకోవడానికి అనుమతిస్తారు. మిగిలిన మొత్తం పీపీఎఫ్ అకౌంట్‌లోనే ఉంటుంది. అకౌంట్‌ తెరిచిన తర్వాత 6వ ఆర్థిక సంవత్సరం నుంచి పీపీఎఫ్ నుంచి పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనిపై ఎటువంటి పన్ను విధించరు. ఆర్థిక సంవత్సరంలో ఒకసారి మాత్రమే పాక్షిక ఉపసంహరణకు వీలు ఉంటుంది. దీని కోసం కూడా PPF అకౌంట్‌ తెరిచిన బ్యాంక్ లేదా పోస్టాఫీసులో ఫారమ్ C అందజేయాలి.

Shocking : వీడు మనిషి కాదు..భార్య,మరదలిని చంపి..రోజూ వచ్చి మృతదేహాలను..

* మెచ్యూరిటీ కాకముందే అకౌంట్‌ మూసివేత

కొన్ని షరతులలో మెచ్యూరిటీ కాకముందే పీపీఎఫ్‌ అకౌంట్‌ను మూసివేయవచ్చు. ఇందుకు అకౌంట్‌ ప్రారంభమైన ఐదు సంవత్సరాల తర్వాత మాత్రమే అవకాశం లభిస్తుంది. విద్య, ఆరోగ్యం అవసరాలకు పూర్తి మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. జీవిత భాగస్వాములు లేదా పిల్లలు ఎదుర్కొంటున్న ప్రాణాంతక వ్యాధులు, తీవ్రమైన వ్యాధులు, విద్యా అవసరాలకు డబ్బు తీసుకోవచ్చు. ఈ సందర్భంలో అకాల మూసివేతకు పెనాల్టీగా అకౌంట్‌దారునికి 1 శాతం తక్కువ వడ్డీ చెల్లిస్తారు. అంటే పీపీఎఫ్‌పై ప్రస్తుత వడ్డీ రేటు 7.1 శాతం. అయితే ఐదేళ్ల తర్వాత అకౌంటును ముందుగానే మూసివేస్తే, వారికి 6.1 శాతం వడ్డీ అందుతుంది.

Published by:Veera Babu
First published:

Tags: Central Government, PPF, Small saving

ఉత్తమ కథలు