హోమ్ /వార్తలు /బిజినెస్ /

PPF Account: పోస్టాఫీసులో పీపీఎఫ్​ అకౌంట్ ఓపెన్​ చేయాలా.. అయితే ఆన్​లైన్​లో ఈ స్టెప్స్​ ఫాలో అవ్వండి..

PPF Account: పోస్టాఫీసులో పీపీఎఫ్​ అకౌంట్ ఓపెన్​ చేయాలా.. అయితే ఆన్​లైన్​లో ఈ స్టెప్స్​ ఫాలో అవ్వండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గతంలో లాగా ఇప్పుడు పోస్టాఫీసుకు వెళ్లి పీపీఎఫ్​ అకౌంట్​ ఓపెన్​ చేయాల్సిన అవసరం లేదు. నేరుగా ఇంట్లోనే ఉండి పోస్టల్​ పీపీఎఫ్​ ఖాతా తెరవచ్చు. ఇందుకోసం ముందుగా మీరు పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సేవింగ్స్ బ్యాంక్ (ఐపీపీబీ ఎస్​బీ) ఖాతాను ఓపెన్​ చేయాల్సి ఉంటుంది.

ఇంకా చదవండి ...

భారతీయలు పొదుపు చేయడంలో ముందుంటారు. అందుకే, ఫిక్స్​డ్​ డిపాజిట్లు, పీపీఎఫ్​లో ఎక్కువగా పెట్టుబడి పెడుతుంటారు. అత్యంత ప్రజాదరణ పొందిన చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పీపీఎఫ్​ ఒకటి. ఈ పెట్టుబడులకు ప్రభుత్వ హామీతో పాటు మంచి రాబడి ఉంటుంది. ఇందులో అసలు, వడ్డీ రెండింటిపైనా పన్ను ఆదా చేసుకోవచ్చు. అందువల్ల దీన్ని సేవింగ్స్​ కమ్​ టాక్స్​ సేవింగ్స్​ ఇన్వెస్ట్​మెంట్​గా కూడా పిలుస్తారు. సాధారణ ప్రజలతో పాటు సీనియర్ సిటిజన్లు వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాల కోసం పీపీఎఫ్​లో పెట్టుబడి పెడుతుంటారు. పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్‌లను పోస్టల్​ డిపార్ట్‌మెంట్ రూపొందించింది.

ITR Filing: ఆ తేదీలోపు ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌ చేయాలి.. లేదంటే.. ఈ నష్టాలు తప్పవు..!


గతంలో లాగా ఇప్పుడు పోస్టాఫీసుకు వెళ్లి పీపీఎఫ్​ అకౌంట్​ ఓపెన్​ చేయాల్సిన అవసరం లేదు. నేరుగా ఇంట్లోనే ఉండి పోస్టల్​ పీపీఎఫ్​ ఖాతా తెరవచ్చు. ఇందుకోసం ముందుగా మీరు పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సేవింగ్స్ బ్యాంక్ (ఐపీపీబీ ఎస్​బీ) ఖాతాను ఓపెన్​ చేయాల్సి ఉంటుంది. ఈ ఖాతా ద్వారా పీపీఎఫ్​లో సులభంగా పెట్టుబడి పెట్టవచ్చు. దీనికి మినిమం డిపాజిట్ అవసరం ఉండదు. అంతేకాదు, మంథ్లీ మినిమం బ్యాలెన్స్​ మెయింటెనెన్స్​ కూడా అవసరం లేదు.

Retirement Plan: ఈ రిటైర్మెంట్ ప్లాన్‌తో డబ్బులే డబ్బులు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..


అయితే ఖాతా తెరవడానికి వ్యక్తులు తప్పనిసరిగా కనీసం 18 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. అంతేకాదు, KYC ప్రక్రియలను 12 నెలల్లోపు పూర్తి చేయాలి. కెవైసీ ప్రక్రియ పూర్తయిన తర్వాత, డిజిటల్ సేవింగ్స్ ఖాతాను రెగ్యులర్ సేవింగ్స్ ఖాతాగా మార్చుకోవచ్చు. డిజిటల్ సేవింగ్స్ ఖాతాను పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాకి లింక్ చేసుకోవచ్చు.

ఐపీపీబీ యాప్ ద్వారా పీపీఎఫ్​ ఖాతాలో ఎలా డిపాజిట్ చేయాలి?

1. IPPB మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ను ఓపెన్​ చేయండి.

2. 4 -అంకెల MPINని ఉపయోగించి మీ ఖాతాలోకి లాగిన్ అవ్వండి.

3. ‘డీఓపీ సర్వీసెస్’పై క్లిక్ చేసి, ‘పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్’ ఆప్షన్​ను ఎంచుకోండి.

Ashes Test Series: యాషెస్ టెస్ట్​ సిరీస్​లో కరోనా కలకలం.. వారిలో నలుగురికి కరోనా పాజిటివ్..​ టెస్ట్ కొనసాగేనా..?


4. ఇప్పుడు పీపీఎఫ్​ ఖాతా నంబర్, DoP కస్టమర్ ఐడీని ఎంటర్​ చేయండి.

5. 'కంటిన్యూ' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

6. డిపాజిట్ అమౌంట్​ను నమోదు చేసి, ‘పే’ ఆప్షన్​పై క్లిక్​ చేయండి.

7. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్​ చేసి సబ్మిట్ చేయండి.

8: పేమెంట్ పూర్తయినట్లు మెసేజ్​ వస్తుంది.

First published:

Tags: Post office, Post office scheme, PPF

ఉత్తమ కథలు