• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • PPF ACCOUNT IN NAME OF YOUR CHILD CONTRIBUTION INCOME TAX RULES EXPLAINED MK GH

PPF account: పిల్లల పేరుతో పీపీఎఫ్ అకౌంట్ తీసుకోవచ్చా? రూల్స్ ఎలా ఉన్నాయి?

ప్రతీకాత్మక చిత్రం

మైనర్ల పేరుతో ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ (పీపీఎఫ్)లో డబ్బు జమ చేయవచ్చా? అలా కుదిరితే తల్లిదండ్రుల పేరుతో అకౌంట్లో ఎంట్రీలు ఎలా చేస్తారు? సెక్షన్ 80సీ కింద మినహాయింపును క్లెయిమ్ చేయాల్సిన అవసరం లేనప్పుడు ఎలా ముందుకెళ్లాలి? మీకు కూడా ఇలాంటి ప్రశ్నలు ఎదురైతే.. సమాధానాలు తెలుసుకోండి.

  • Share this:
మైనర్ల పేరుతో ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ (పీపీఎఫ్)లో డబ్బు జమ చేయవచ్చా? అలా కుదిరితే తల్లిదండ్రుల పేరుతో అకౌంట్లో ఎంట్రీలు ఎలా చేస్తారు? సెక్షన్ 80సీ కింద మినహాయింపును క్లెయిమ్ చేయాల్సిన అవసరం లేనప్పుడు ఎలా ముందుకెళ్లాలి? మీకు కూడా ఇలాంటి ప్రశ్నలు ఎదురైతే.. సమాధానాలు తెలుసుకోండి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం-2019లోని మూడో పేరా ప్రకారం మైనర్ పేరుతో పీపీఎఫ్ అకౌంట్ తీసుకునే సౌలభ్యముంది. ఈ స్కీమ్ కింద తల్లిదండ్రుల తమ పిల్లల పీపీఎఫ్ ఖాతాలో సొమ్ము జమ చేయడానికి ఎలాంటి అవరోధాలు, ఆంక్షలు లేవు. అయితే ఈ స్కీమ్‌లోని నాలుగో పేరా ప్రకారం ఎవరైనా వ్యక్తి తన ఖాతా లేదా మైనర్ లేదా ఇద్దరి పీపీఎఫ్ ఖాతాల్లో రూ.1.50 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని జమ చేసే అవకాశం లేదు. కాబట్టి మీ సొంత అకౌంట్లో జమచేసేటప్పుడు, పిల్లల అకౌంట్లకు కూడా వాటాను పంపవచ్చు.

అయితే ఈ రెండు అకౌంట్లలో డిపాజిట్ల మొత్తం రూ.1.50 లక్షల కంటే ఎక్కువగా ఉండకూడదు. అంతకుమించి సొమ్మును జమ చేసే అవకాశం లేదు. అందువల్ల భార్యభర్తలిద్దరూ పిల్లల పీపీఎఫ్ ఖాతాలో భాగస్వామ్యం కావడానికి ఎంట్రీ లిమిట్ రూ.1.50 లక్షలకు మించి ఉండకూడదు. ఈ లిమిట్ 1.50 లక్షలు అనేవి మీరు సెక్షన్ 80సీ కింద ప్రయోజనం పొందాలనుకుంటున్నా లేదా మీ పిల్లల పీపీఎఫ్ ఖాతాలో జమ చేయకపోయినా వర్తిస్తుంది. ఇందులో ఎలాంటి సమస్య ఉండదు.

ఖాతా పుస్తకాల్లో మీ ఎంట్ర్లీలు, కాంట్రిబ్యూషన్లకు సంబంధించినంత వరకు పిల్లలకు బహుమతి ఇస్తున్నట్లు చూపిస్తుంది. వారి పీపీఎఫ్ ఖాతాలో డిపాజిట్ చేసిన డబ్బుపై అందే వడ్డీకి సంబంధించిన ఎంట్రీలు.. వారి అకౌంట్ పుస్తకాల్లో చూపిస్తాయి. తల్లిదండ్రుల పుస్తకాల్లో ఇవి కనిపించవు.

PPF పెట్టుబడులు..
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది పెట్టుబడి లేదా పన్ను ఆదా చేసుకునే సాధనం. దీర్ఘకాలికంగా పీపీఎఫ్ వడ్డీరేటు(ప్రస్తుతం 7.1 శాతం) పెట్టుబడుదారులు ద్రవ్యోల్బణాన్ని అధిగమించడంలో సహాయపడుతుంది. కాబట్టి రిస్క్ ఫ్రీ పెట్టుబడి ఆప్షన్‌లలో పీపీఎఫ్ ముఖ్యమైనది. అంతేకాకుండా దీని మెచ్యురిటీ వ్యవధి 15 ఏళ్లు ఉంటుంది. పీపీఎఫ్ నిబంధనలు ప్రకారం ఈ మెచ్యురిటీ పీరియడ్ కు ముందే పెట్టుబడిదారులకు డబ్బు విత్ డ్రా చేసుకునే అవకాశముంది. ఒక శాతం వడ్డీ రేటుతో పీపీఎఫ్ లోన్ తీసుకోవడానికి కూడా అనుమతిస్తుంది.
Published by:Krishna Adithya
First published: