ప్రస్తుతం ఎక్కడ చూసినా కరెంట్ కోతల (Power Cuts) గురించే చర్చ. విద్యుత్ వినియోగం పెరుగుతుండటం, మరోవైపు బొగ్గు కొరత కారణంగా విద్యుత్ కొరత ఏర్పడుతోంది. దీంతో విద్యుత్ కోతలు తప్పట్లేదు. మరి మీరు కూడా విద్యుత్ కోతల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అయితే మీరు సోలార్ పవర్ యూనిట్ (Solar Power Unit) ఏర్పాటు చేసుకొని విద్యుత్ కోతలకు చెక్ చెప్పొచ్చు. అంతేకాదు... పెరిగిపోతున్న ఎలక్ట్రిసిటీ బిల్లుల్ని (Electricity Bills) కూడా తగ్గించుకోవచ్చు. మరి సోలార్ పవర్ యూనిట్ ఎంత కెపాసిటీతో ఏర్పాటు చేయాలి? ఖర్చు ఎంతవుతుంది? సబ్సిడీ ఎంత వస్తుంది? తెలుసుకోండి.
సాధారణంగా ముగ్గురు లేదా నలుగురు ఓ కుటుంబానికి ఒక కిలోవాట్ సోలార్ పవర్ సిస్టమ్ సరిపోతుందని చెబుతుంటారు. ఒకవేళ ఇంట్లో కంప్యూటర్, రిఫ్రిజిరేటర్, గీజర్, ఏసీ లాంటి అప్లయెన్సెస్ ఎక్కువగా ఉంటే ఐదు కిలోవాట్ కెపాసిటీతో సోలార్ పవర్ యూనిట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక కిలోవాట్ సోలార్ యూనిట్ ఐదు యూనిట్ల పవర్ జనరేట్ చేస్తుందని అంచనా. అంటే నెలకు 150 యూనిట్ల పవర్ జనరేట్ చేస్తుంది. సాధారణంగా ఓ కుటుంబం 150 యూనిట్ల నుంచి 250 యూనిట్ల మధ్య విద్యుత్ వినియోగిస్తూ ఉంటుంది.
Save Power Bill: విద్యుత్ ఛార్జీలు పెరిగాయి... ఈ టిప్స్‌తో మీ కరెంట్ బిల్ తగ్గించుకోవచ్చు
ఒక కిలోవాట్ కెపాసిటీతో సోలార్ పవర్ యూనిట్ ఏర్పాటు చేయడానికి సుమారు రూ.1,10,000 ఖర్చవుతుందని అంచనా. సబ్సిడీతో రూ.65,000 నుంచి రూ.70,000 మధ్య ఖర్చవుతుంది. ఒకసారి రూ.70,000 ఇన్వెస్ట్ చేసి సోలార్ పవర్ యూనిట్ ఏర్పాటు చేసుకుంటే నెలకు 150 యూనిట్ల వరకు విద్యుత్తును ఖర్చు లేకుండా ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటే రెండు కిలోవాట్ సోలార్ పవర్ యూనిట్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకోసం సబ్సిడీతో రూ.1,00,000 పైనే ఖర్చవుతుంది. 300 యూనిట్ల వరకు ఉపయోగించుకోవచ్చు.
Battery Tips: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ డౌన్ అవుతోందా? ఈ 6 టిప్స్ పాటించండి
అద్దె ఇళ్లల్లో ఉంటున్నవారు సోలార్ పవర్ యూనిట్ ఏర్పాటు చేయడం వల్ల సమస్యలు ఉంటాయి. ఇల్లు మారిన ప్రతీసారి సోలార్ పవర్ యూనిట్ తీసుకెళ్లడం సాధ్యం కాదు. కొత్తగా అద్దెకు దిగుతున్న ఇంట్లో సోలార్ పవర్ యూనిట్ ఏర్పాటు చేసే అవకాశం లేకపోతే చిక్కులు తప్పవు. అందుకే సొంత ఇళ్లు ఉన్నవారు సోలార్ పవర్ యూనిట్ ఏర్పాటు చేసుకోవడం మంచిది.
సోలార్ పవర్ సిస్టమ్ ఏర్పాటు చేసిన తర్వాత తరచూ మెయింటనెన్స్ చేయడం మంచిది. సోలార్ ప్యానెల్స్, సోలార్ ఇన్వర్టర్, ఇతర పరికరాలన్నీ 15 నుంచి 20 ఏళ్ల పాటు పనికొస్తాయి. అయితే వాటిని తరచూ క్లీన్ చేస్తూ ఉండటం మంచిది. సోలార్ ప్యానెల్స్‌పై దుమ్ము ఎక్కువగా ఉంటే ఎండ ఎక్కువగా తగలదు. ఫలితంగా తక్కువ విద్యుత్ జనరేట్ అవుతుంది. అందుకే తరచూ మెయింటనెన్స్ చేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: ELectricity, Power cuts, Power problems