news18-telugu
Updated: December 6, 2019, 5:03 PM IST
Good News: త్వరలో ఇన్స్యూరెన్స్ పాలసీలు అమ్మనున్న పోస్ట్‌మ్యాన్
(ప్రతీకాత్మక చిత్రం)
ఇన్స్యూరెన్స్ పాలసీలు తీసుకోవాలనుకునేవారికి శుభవార్త. ఇకపై ఇన్స్యూరెన్స్ పాలసీల కోసం ఏజెంట్లను సంప్రదించాల్సిన అవసరం లేదు. పోస్ట్‌మ్యాన్ దగ్గర పాలసీ తీసుకోవచ్చు. పోస్ట్‌మ్యాన్, గ్రామీణ డాక్ సేవక్ విధులు నిర్వహించే సిబ్బంది త్వరలో బీమా పాలసీలను కూడా అమ్మనున్నారు. పోస్ట్‌మ్యాన్, గ్రామీణ డాక్ సేవక్ సిబ్బంది పాయింట్ ఆఫ్ సేల్స్‌పర్సన్-PoS లాగా వ్యవహరించేలా అనుమతించాలని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్-IPPB ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-IRDAI నుంచి అనుమతి కోరుతోంది. ఒకవేళ అనుమతి లభిస్తే పోస్ట్మ్యాన్లకు కొత్త బాధ్యతలు లభిస్తాయి.
పోస్టల్ శాఖ పలు బీమా సంస్థలతో ఒప్పందం కుదుర్చచుకుంది. ఆయా సంస్థలకు చెందిన పాలసీలపై పోస్ట్‌మ్యాన్, గ్రామీణ డాక్ సేవక్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి అవగాహన కల్పించడంతో పాటు, పాలసీలను అమ్ముతారు. మోటార్ ఇన్స్యూరెన్స్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్, టర్మ్ ఇన్స్యూరెన్స్ లాంటి బీమా పాలసీలను అందిస్తారు. ఇందుకోసం సిబ్బందికి కావాల్సిన శిక్షణను కూడా ఇవ్వనుంది ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్.
అదిరిపోయిన నోకియా 2.3 ఫీచర్స్... స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Aadhaar Card: ఆధార్ కార్డు విషయంలో ఈ తప్పు చేస్తే రూ.10,000 జరిమానా
IRCTC: డబ్బులు లేకపోయినా రైలు టికెట్ బుకింగ్... చేయండి ఇలాPersonal Loan: 5 నిమిషాల్లో లక్ష రూపాయల అప్పు... 'ఎంఐ క్రెడిట్'లో తీసుకోండి ఇలా
Published by:
Santhosh Kumar S
First published:
December 6, 2019, 5:02 PM IST