POSTAL DEPARTMENT NEW SERVICES NOW WE CAN MAKE RECURRING PAYMENTS AT DOORSTEP NS GH
Postal Services: పోస్టల్ ఖాతాదారులకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకు ఆ సేవలు.. వివరాలివే
పోస్టల్ ఖాతాదారులకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకు ఆ సేవలు.. వివరాలివే
భారత్ బిల్‌పే ప్లాట్‌ఫాం ద్వారా యూజర్ల ఇంటి వద్దే క్యాష్-బేస్డ్ అసిస్టెడ్ బిల్లు చెల్లింపులకు సదుపాయం కల్పిస్తున్నట్లు ఐపీపీబీ, ఎన్పీసీఐ భారత్ బిల్‌పే సంయుక్త ప్రకటన చేశాయి. గ్రామీణ డాక్ సేవక్స్, పోస్టల్ సిబ్బంది సహాయంతో భారతదేశం అంతటా యూజర్లు ఈ సేవను ఉపయోగించవచ్చని ఐపీపీబీ తెలిపింది.
దూరభారం, వ్యయప్రయాసలు లేకుండా మొబైల్ బిల్లులు, ఈఎమ్ఐ(EMI) పేమెంట్స్, ఓటీటీ సబ్స్క్రిప్షన్లు వంటి రికరింగ్ పేమెంట్స్ చేయాలనుకుంటున్న కస్టమర్లకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు (ఐపీపీబీ), ఎన్పీసీఐ భారత్ బిల్‌పే తీపి కబురు అందించాయి. భారత్ బిల్‌పే ప్లాట్‌ఫాం ద్వారా యూజర్ల ఇంటి వద్దే క్యాష్-బేస్డ్ అసిస్టెడ్ బిల్లు చెల్లింపులకు సదుపాయం కల్పిస్తున్నట్లు ఐపీపీబీ, ఎన్పీసీఐ భారత్ బిల్‌పే సంయుక్త ప్రకటన చేశాయి. గ్రామీణ డాక్ సేవక్స్, పోస్టల్ సిబ్బంది సహాయంతో భారతదేశం అంతటా యూజర్లు ఈ సేవను ఉపయోగించవచ్చని ఐపీపీబీ తెలిపింది. నాన్-ఐపీపీబీ కస్టమర్లందరికీ వివిధ యుటిలిటీ, ఇతర రికరింగ్ సేవల కోసం బిల్లులను చెల్లించడానికి కూడా భారత్ బిల్‌పే ప్లాట్‌ఫాం వీలు కల్పించనుందని ఐపీపీబీ తెలిపింది.
కొత్త సదుపాయంతో కస్టమర్లు తమ ఇంటి నుంచే కాకుండా తమ సమీపంలోని పోస్టాఫీసు ద్వారా కూడా రికరింగ్ బిల్లులను సౌకర్యవంతంగా చెల్లించవచ్చు. మారుమూల గ్రామాల్లో నివసించే కస్టమర్లకు ఈ సదుపాయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. లక్షలాదిమంది కస్టమర్లకు మెరుగైన సేవలందించడానికి తన బిల్లు చెల్లింపుల ప్లాట్‌ఫాంను మెరుగుపరిచినట్లు ఐపీపీబీ తెలిపింది. ఇప్పుడు భారత్ బిల్ పేమెంట్స్ ప్లాట్‌ఫాంలో ఉన్న 20,000 బిల్లర్లు వివిధ బ్యాంకులు, ఐపీపీబీ వినియోగదారులకు అందుబాటులో ఉంటారని వెల్లడించింది.
“ఎన్పీసీఐ భారత్ బిల్‌పే సహకారంతో ఐపీపీబీ తన నెట్వర్క్ ద్వారా ఇంటి వద్దకే బిల్లు చెల్లింపుల సదుపాయం కల్పిస్తోంది. గ్రామీణ డాక్ సేవకులు, పోస్టల్ సిబ్బంది ద్వారానే ఈ సేవలు కస్టమర్లకు అందుబాటులోకి వస్తున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, ఐపీపీబీ టెక్నాలజీ-ఆధారిత డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫాం నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవడం ద్వారా, భారత్ బిల్‌పే అన్ని బిల్లుల చెల్లింపు కోసం వన్-స్టాప్ ఎకోసిస్టమ్‌ను అందిస్తుంది. ఇది భారతదేశం అంతటా ఉన్న కస్టమర్లందరికీ ఎప్పుడైనా ఎక్కడైనా బిల్లు చెల్లింపు సేవను అందిస్తుంది. ఈ ట్రాన్సాక్షన్లన్నీ చాలా సురక్షితంగా ఉంటాయి." అని ఐపీపీబీ ఎండీ& సీఈఓ జే. వెంకట్రామ్ పేర్కొన్నారు. Value Funds: వాల్యూ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? గత ఏడాది భారీగా రాబడి ఇచ్చిన పథకాలు ఇవే
కీలకమైన కొత్త ఫీచర్లు
- ఎలాంటి రికరింగ్ బిల్లులనైనా క్యాష్ మోడ్ ద్వారా చెల్లించొచ్చు.
- దాదాపు అన్ని వివరాలతో ట్రాన్సాక్షన్ హిస్టరీ అప్డేట్ అవుతుంది.
- ట్రాన్సాక్షన్ అలర్ట్స్, రిమైండర్లను సెట్ చేసుకోవచ్చు.
మీరు చేయగల లావాదేవీలు
ఐపీపీబీ, నాన్-ఐపీపీబీ కస్టమర్లు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు మొబైల్ బ్యాంకింగ్ సేవను ఉపయోగించడం ద్వారా మొబైల్ పోస్ట్‌పెయిడ్, డీ2హెచ్ రీఛార్జ్, స్కూల్ ఫీజులు, ఇతర యుటిలిటీ సేవల వంటి రికరింగ్ లావాదేవీలను చేయగలరని ప్రకటన పేర్కొంది. కస్టమర్లు ఐపీపీబీ డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్‌ని ఉపయోగించి, అప్డేటెడ్ ట్రాన్సాక్షన్ హిస్టరీని చూడవచ్చు. ట్రాన్సాక్షన్ అలర్ట్స్, రిమైండర్లను సెట్ చేయవచ్చు. భారత్ బిల్‌పే లావాదేవీల కోసం ఆన్లైన్లో ఫిర్యాదులను రైజ్/ట్రాక్ చేయవచ్చు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.