Post Office Schemes: 5 ఏళ్లలో రూ.5 లక్షలు కావాలంటే ఇలా ఇన్వెస్ట్ చేయండి

Post Office Schemes | 5 ఏళ్ల రికరింగ్ డిపాజిట్(RD), మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్(MIS), 5 ఏళ్ల సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్(SCSS), 5 ఏళ్ల నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్(NSC), కిసాన్ వికాస్ పత్ర(KVP), పబ్లిక్ ప్రావిడింట్ ఫండ్(PPF), సుకన్య సమృద్ధి యోజన(SSY) లాంటి పథకాలు కూడా ఉన్నాయి.

news18-telugu
Updated: March 14, 2019, 5:30 PM IST
Post Office Schemes: 5 ఏళ్లలో రూ.5 లక్షలు కావాలంటే ఇలా ఇన్వెస్ట్ చేయండి
Post Office Schemes: 5 ఏళ్లలో రూ.5 లక్షలు కావాలంటే ఇలా ఇన్వెస్ట్ చేయండి
news18-telugu
Updated: March 14, 2019, 5:30 PM IST
పోస్ట్ ఆఫీస్... పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వీటి అవసరం ఎక్కువ. పేద, మధ్యతరగతి వర్గాలు తమ డబ్బును పొదుపు చేయడానికి పోస్ట్ ఆఫీస్ పథకాలను ఎంచుకుంటారు. అందుకే భారతదేశంలో పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్‌కు మంచి పేరు ఉంది. సార్వభౌమ హామీ ఉండటం, వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా ఉండటమే ప్రధాన కారణం. దానికి తోడు గ్రామగ్రామాల్లో పోస్ట్ ఆఫీసులు ఉంటాయి. దీంతో పోస్ట్ ఆఫీస్ పథకాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాయి. పోస్ట్ ఆఫీస్‌లో పొదుపు పథకాలతో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా ఉన్నాయి. 5 ఏళ్ల రికరింగ్ డిపాజిట్(RD), మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్(MIS), 5 ఏళ్ల సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్(SCSS), 5 ఏళ్ల నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్(NSC), కిసాన్ వికాస్ పత్ర(KVP), పబ్లిక్ ప్రావిడింట్ ఫండ్(PPF), సుకన్య సమృద్ధి యోజన(SSY) లాంటి పథకాలు కూడా ఉన్నాయి. వీటి కాల వ్యవధి 1 ఏడాది, 2 ఏళ్లు, 3 ఏళ్లు, 5 ఏళ్లు. మరి 5 ఏళ్లలో రూ.5 లక్షలు కావాలంటే ఎందులో ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకోండి.

Read this: One Nation One Card: వన్ నేషన్ వన్ కార్డ్ వాడితే 10% క్యాష్‌బ్యాక్... కార్డు ఫీచర్లు ఇవే

Post Office Schemes, Post Office Schemes deposit schemes, Post Office accounts, Post Office fixed deposit, post office interest rates, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్, పోస్ట్ ఆఫీస్ పథకాలు, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ స్కీమ్స్, పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్, పోస్ట్ ఆఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్



1. ఐదేళ్ల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్


ఐదేళ్ల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్‌ను ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. ఇద్దరు కలిసి జాయింట్‌గా అకౌంట్ తెరవచ్చు. మైనర్ పేరుమీద కూడా ఈ అకౌంట్ తీసుకోవచ్చు. 10 ఏళ్ల వయస్సు కన్నా ఎక్కువ ఉన్నవాళ్లు సొంతగా ఈ అకౌంట్ ఆపరేట్ చేయొచ్చు. 18 ఏళ్లు నిండిన తర్వాత అకౌంట్‌ను కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి రూ.200 చెల్లించాలి. రూ.200 చొప్పున ఎంతైనా జమ చేయొచ్చు. గరిష్టంగా ఎంతైనా జమ చేయొచ్చు. వడ్డీని మూడు నెలలకోసారి లెక్కించి వార్షికంగా చెల్లిస్తారు. ఉదాహరణకు వడ్డీ రేటు 7.8 శాతం 3 నెలలకోసారి చక్రవడ్డీ లెక్కిస్తే మీ అకౌంట్‌లో 5 ఏళ్లలో రూ.5 లక్షలు జమ కావడానికి మీరు కనీసం రూ.3.4 లక్షలు జమచేయాలి.


2. ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్


ఎక్కువ మొత్తం ఒకేసారి డిపాజిట్ చేయలేనివాళ్లు రికరింగ్ డిపాజిట్ తీసుకోవచ్చు. ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి రూ.10 చాలు. ఇందులో మీరు ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. వార్షిక వడ్డీ రేటు 7.3 శాతం 3 నెలలకోసారి చక్రవడ్డీ లెక్కిస్తే మీ అకౌంట్‌లో 5 ఏళ్లలో రూ.5 లక్షలు జమ కావడానికి నెలకు రూ. 6,900 చెల్లించాలి.
Loading...
Read this: SBI PPF Scheme: అధిక వడ్డీ కావాలా? ఎస్‌బీఐ పీపీఎఫ్ స్కీమ్ ట్రై చేయండి

Post Office Schemes, Post Office Schemes deposit schemes, Post Office accounts, Post Office fixed deposit, post office interest rates, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్, పోస్ట్ ఆఫీస్ పథకాలు, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ స్కీమ్స్, పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్, పోస్ట్ ఆఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్


3. ఐదేళ్ల సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్


60 ఏళ్లు దాటిన వృద్ధుల కోసం ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. గరిష్టంగా రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. వార్షిక వడ్డీ రేటు 7.8 శాతం 3 నెలలకోసారి చక్రవడ్డీ లెక్కిస్తే మీ అకౌంట్‌లో 5 ఏళ్లలో రూ.5 లక్షలు జమ కావడానికి  రూ3.26 లక్షలు జమ చేయాలి.

4. ఐదేళ్ల నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్


పన్ను మినహాయింపులు పొందాలనుకునేవారికి ఈ పథకం ఉపయోగపడుతుంది. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. గరిష్టంగా ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. వార్షిక వడ్డీ రేటు 7.8 శాతం 3 నెలలకోసారి చక్రవడ్డీ లెక్కిస్తే మీ అకౌంట్‌లో 5 ఏళ్లలో రూ.5 లక్షలు జమ కావడానికి రూ3.40 లక్షలు జమ చేయాలి.

మరి మీకు 5 ఏళ్లలో రూ.5 లక్షలు కావాలంటే ఈ స్కీమ్స్‌ ప్రయత్నించొచ్చు. ఇన్వెస్ట్ చేసేముందు వడ్డీ, ఇతర నియమనిబంధనలన్నీ తెలుసుకోవడం మంచిది.
Photos: యంగెస్ట్ సెల్ఫ్-మేడ్ బిలియనీర్‌గా 21 ఏళ్ల కైలీ జెన్నర్

ఇవి కూడా చదవండి:

WhatsApp Reverse Image Search: ఫేక్‌న్యూస్ గుర్తించేందుకు వాట్సప్‌లో కొత్త ఫీచర్

IRCTC Tatkal Rules: తత్కాల్ టికెట్ బుక్ చేస్తున్నారా? రూల్స్, ఛార్జెస్ వివరాలు తెలుసుకోండి

JIO Prepaid Plans: రోజుకు 2GB హై స్పీడ్ డేటా... జియో ప్లాన్స్ ఇవే...
First published: March 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...