భవిష్యత్తు కుటుంబ అవసరాల కోసం డబ్బును ఆదా చేసుకోవడం తప్పనిసరి. అయితే ఆ డబ్బును రెట్టింపు చేసుకునేందుకు ఎక్కడ దాచుకోవాలి? అనే ప్రశ్న అందర్లోనూ ఉంటుంది. మన దేశంలో ఎక్కువ మంది డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తుంటారు. అయితే బ్యాంకులతో పోటీగా భారతీయ తపాలా శాఖ కూడా ఎక్కువ వడ్డీ ఇచ్చే సురక్షితమైన పెట్టుబడి పథకాలను అందిస్తోంది. ఈ పోస్టాఫీస్ పథకాలు మార్కెట్ పరిస్థితులకు లోనవ్వకుండా స్థిరమైన వడ్డీ రేట్లను అందిస్తాయి. ఈ జాబితాలో ఉన్న పిపిఎఫ్, సుకన్య సమృద్ధి, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్, కిసాన్ వికాస్ పాత్ర (కెవిపి) వంటి పోస్టాఫీసు పథకాలపై వచ్చే వడ్డీ, ఇతర ప్రయోజనాలను పరిశీలిద్దాం.
పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్
పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ 4 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తుంది. కేవలం రూ. 500 పెట్టుబడితో ఈ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాను తెరవవచ్చు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80TTA ప్రకారం, రూ. 10,000 వరకు వడ్డీ ఆదాయానికి పన్ను మినహాయింపు ఉంటుంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా (పీపీఎఫ్)
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) 7.1 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. పిపిఎఫ్ డిపాజిట్లపై వచ్చే ఆదాయానికి సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపు పొందవచ్చు.
సుకన్య సమృద్ధి ఖాతా (ఎస్ఎస్ఏ)
సుకన్య సమృద్ధి స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఏడాది 7.6 శాతం వడ్డీ రేటు పొందవచ్చు. మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ .250 నుంచి గరిష్టంగా రూ .1.5 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. డిపాజిట్ల నుంచి వచ్చే రాబడిపై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపు పొందవచ్చు.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సీ)లో పెట్టుబడి ద్వారా వార్షికంగా 6.8 శాతం వడ్డీ లభిస్తుంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సి కింద వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు పొందవచ్చు.
కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ)
కిసాన్ వికాస్ పత్ర సేవింగ్స్ స్కీమ్‌లో పెట్టుబడి ద్వారా ఏటా 6.9 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ స్కీమ్‌లో గరిష్టంగా 124 నెలల వరకు మాత్రమే పెట్టుబడికి అవకాశం ఉంటుంది.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కింద 7.4 శాతం వడ్డీ లభిస్తుంది. ప్రతి రూ. 10,000 డిపాజిట్‌పై రూ .185 వడ్డీ లభిస్తుంది.
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌లో పెట్టుబడి ద్వారా 6.6 శాతం వడ్డీ లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India post