హోమ్ /వార్తలు /బిజినెస్ /

Post Office Scheme: పోస్టాఫీసులో రూ.10,000 పెట్టుబడితో లక్షాధికారి అయ్యే అవకాశం

Post Office Scheme: పోస్టాఫీసులో రూ.10,000 పెట్టుబడితో లక్షాధికారి అయ్యే అవకాశం

Post Office Scheme: పోస్టాఫీసులో రూ.10,000 పెట్టుబడితో లక్షాధికారి అయ్యే అవకాశం
(ప్రతీకాత్మక చిత్రం)

Post Office Scheme: పోస్టాఫీసులో రూ.10,000 పెట్టుబడితో లక్షాధికారి అయ్యే అవకాశం (ప్రతీకాత్మక చిత్రం)

Post Office Scheme | పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్‌లో ప్రతీ నెలా కొంత మొత్తం పొదుపు చేస్తే (Monthly Savings) లక్షాధికారి కావొచ్చు. రూ.10,000 పొదుపుతో రూ.16 లక్షల వరకు రిటర్న్స్ పొందొచ్చు. ఈ స్కీమ్ వివరాలు తెలుసుకోండి.

అన్ని రకాల పెట్టుబడుల ప్రధాన లక్ష్యం ఎక్కువ రాబడిని ఆర్జించడమే. అయితే వివిధ రకాల పెట్టుబడి మార్గాల్లో (Investment Options) వాటి స్థాయికి తగ్గట్లు రిస్క్ లేదా నష్టభయం ఉంటుంది. రిస్క్ ఎక్కువగా ఉన్నప్పుడే పెట్టుబడులపై రిటర్న్ (రాబడి) ఎక్కువగా ఉంటుంది. కానీ పోస్టాఫీసు పథకాల్లో తక్కువ రిస్క్ ద్వారా ఎక్కువ ఆదాయం పొందవచ్చు. తక్కువ రిస్క్ లేదా నష్టభయంతో ఎక్కువ రాబడులు అందించే పథకాల్లో పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పథకం (Post Office Recurring Deposit Scheme) ఒకటి. ఈ డిపాజిట్లతో దీర్ఘకాలంలో మెరుగైన రాబడిని ఆర్జించవచ్చని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు. సుమారు రూ.10వేల నెలవారీ డిపాజిట్‌తో పదేళ్లలో రూ.16 లక్షలకు పైగా రాబడి పొందవచ్చని సూచిస్తున్నారు.

పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పథకం ప్రభుత్వ సహకారంతో నడుస్తుంది. ఇందులో చిన్న మొత్తాలకు కూడా అధిక వడ్డీ రేటు చెల్లిస్తారు. కేవలం రూ.100 నుంచి ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. డిపాజిట్లపై గరిష్ఠ పరిమితి లేదు. వీటిలో ఎంత మొత్తమైనా పెట్టుబడి పెట్టవచ్చు. డిపాజిటర్లు ఐదేళ్ల కాలానికి ఖాతా ప్రారంభించవచ్చు. పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పథకంలో డిపాజిట్ చేసిన డబ్బుకు ప్రతి మూడు నెలలకు కాంపౌండ్ వడ్డీని చెల్లిస్తారు.

PAN Card: నకిలీ పాన్ కార్డును ఎలా గుర్తించాలో తెలుసా? ఈ టిప్స్ ఫాలో అవండి

లక్షాధికారి కావాలంటే


2020 ఏప్రిల్ నుంచి పోస్టల్ రికరింగ్ డిపాజిట్లపై 5.8 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. చిన్న పొదుపు పథకాలపై ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది. అయితే పోస్టల్ ఆర్‌డీ స్కీమ్‌లో పది సంవత్సరాల పాటు నెలకు రూ.10వేలు పెట్టుబడి పెడితే.. 5.8 శాతం వడ్డీ లెక్కించినా రూ.16,28,963 వరకు రాబడి వస్తుంది. అంటే రూ.10,000 నెలవారీ డిపాజిట్‌తో పదేళ్లలో లక్షాధికారి అయ్యే అవకాశం ఉంటుంది. డిపాజిట్ మొత్తం పెరిగేకొద్దీ మెచూరిటీ నాటికి అందే రాబడి సైతం పెరుగుతుంది.

IRCTC Tirumala Tour: శ్రీవారి ప్రత్యేక దర్శనంతో రూ.3,220 ధరకే తిరుపతి టూర్... విజయవాడ నుంచి ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ

పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్లపై పన్ను


రికరింగ్ డిపాజిట్ పెట్టుబడులపై టీడీఎస్ తీసివేస్తారు. డిపాజిట్ రూ.40,000 దాటితే, 10 శాతం వార్షిక పన్ను వర్తిస్తుంది. రికరింగ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీపై పన్ను విధిస్తారు. అయితే మెచూరిటీ మొత్తంపై ట్యాక్స్ వర్తించదు. పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ అకౌంట్‌లో తప్పకుండా నిధులు జమ చేయాలి. లేదంటే ప్రతి నెలా ఒక శాతం పెనాల్టీ విధిస్తారు. నాలుగు నెలలు చెల్లించకపోతే ఖాతా మూసివేస్తారు.

Pension Alert: పెన్షన్ కావాలంటే నవంబర్ 30 లోగా ఆ సర్టిఫికెట్ ఇవ్వాల్సిందే

బ్యాంకు రికరింగ్ డిపాజిట్లు


పోస్టాఫీసుతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు కూడా రికరింగ్ డిపాజిట్ సదుపాయం కల్పిస్తున్నాయి. వీటిపై అందించే వడ్డీ రేట్లు బ్యాంకులను బట్టి మారుతుంటాయి. సంవత్సరం నుంచి 33 నెలల కాలవ్యవధితో అందించే డిపాజిట్లపై యస్ బ్యాంకు 7 శాతం వడ్డీని అందిస్తోంది. ఆర్‌డీ పథకాలపై సగటున హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 5.50శాతం, యాక్సిస్ బ్యాంక్ 5.50 శాతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5.40 శాతం వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: India post, Personal Finance, Post office, Post office scheme, Postal department, Save Money

ఉత్తమ కథలు