Home /News /business /

POST OFFICE SCHEME FOR HIGHER YIELD AS POST OFFICE FD INTEREST RATES OFFERED ALMOST CLOSE TO ANNUAL RATE OF AVERAGE INFLATION GH SSR

Post office FD: ఎఫ్​డీలపై బ్యాంకుల కంటే అధిక వడ్డీ ఆఫర్​ చేస్తున్న పోస్టాఫీసులు.. తాజా వడ్డీ రేట్లను పరిశీలించండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో, బ్యాంక్ ఎఫ్​డీ రేట్లు కనిష్టానికి పడిపోయాయి. ఇటువంటి పరిస్థితిలో పోస్టాఫీస్ ఎఫ్​డీని ఎంచుకోవడం బెటర్​ ఆప్షన్​గా చెప్పవచ్చు. పోస్టాఫీసు ఎఫ్​డీ వడ్డీ రేట్లు 5.5 శాతం నుంచి ప్రారంభమవుతున్నాయి.

ఒకప్పుడు పోస్టల్​ శాఖ కేవలం ఉత్తరాల బట్వాడా మాత్రమే చేసేది. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా పోస్టాఫీసులు ఇప్పుడు బ్యాంకులతో సమానంగా అనేక సర్వీసులు అందిస్తున్నాయి. మన దేశంలో ఎక్కువ మంది ఎంచుకునే ఫిక్స్​డ్ డిపాజిట్లను కూడా పోస్టల్ శాఖ ఆఫర్​ చేస్తుంది.​ నష్టభయం తక్కువగా ఉండి మంచి రాబడినిచ్చే పెట్టుబడి మార్గంగా ఫిక్స్​డ్ డిపాజిట్లకు పేరుంది. అందుకే రిస్క్​ తీసుకోలేని సీనియర్​ సిటిజన్లు ఎక్కువగా దీన్ని ఎంచుకుంటారు.

అయితే కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో, బ్యాంక్ ఎఫ్​డీ రేట్లు కనిష్టానికి పడిపోయాయి. ఇటువంటి పరిస్థితిలో పోస్టాఫీస్ ఎఫ్​డీని ఎంచుకోవడం బెటర్​ ఆప్షన్​గా చెప్పవచ్చు. పోస్టాఫీసు ఎఫ్​డీ వడ్డీ రేట్లు 5.5 శాతం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇది ప్రస్తుత సగటు ద్రవ్యోల్బణం వార్షిక రేటుకు దాదాపు దగ్గరగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: Credit Card Bill: క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? బిల్లింగ్ సైకిల్, మినిమం పేమెంట్ రూల్స్ తెలుసా?

ఎఫ్​డీ వడ్డీ రేట్లపై సెబీ రిజిస్టర్డ్ టాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్స్‌పర్ట్ జితేంద్ర సోలంకి మాట్లాడుతూ, "ప్రస్తుత ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో రిస్క్ తీసుకోకూడదనుకునే వారు బ్యాంక్​ ఎఫ్​డీల్లో పెట్టుబడి పెడుతున్నారు. అయితే, కోవిడ్-19 సంక్షోభానికి ముందు బ్యాంకులు దాదాపు 5 నుంచి 6 శాతానికి ఎఫ్​డీలపై వడ్డీ ఆఫర్​ చేశాయి. అయితే ఇప్పుడు బ్యాంకు ఎఫ్​డీ రేట్లు మరింత తగ్గాయి. దీంతో ఎక్కువ మంది ప్రత్యామ్నాయంగా పోస్టాఫీస్ ఎఫ్​డీల వైపు చూస్తున్నారు. పోస్టల్ ఎఫ్‌డీలు 5.5 శాతం నుంచి 6.7 శాతం మధ్య వడ్డీ అందజేస్తున్నాయి.

* పోస్టాఫీసు ఎఫ్​డీ వడ్డీ రేటు

ఇండియా పోస్ట్ వెబ్‌సైట్ ప్రకారం, ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల పోస్ట్ ఆఫీస్ ఎఫ్​డీపై 5.5 శాతం వార్షిక వడ్డీ ఆఫర్​ చేస్తుంది. అయితే 5 సంవత్సరాల వ్యవధి గల ఎఫ్​డీపై 6.7 శాతం వడ్డీ అందిస్తుంది. పోస్టాఫీస్ ఎఫ్​డీ వడ్డీ ఏటా చెల్లిస్తారు. కానీ ప్రతి మూడు నెలలకోసారి లెక్కిస్తారు. పోస్టాఫీసు ఎఫ్​డీ ఖాతాను 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల కాలవ్యవధికి తెరవవచ్చు. పోస్టాఫీసు ఎఫ్​డీ ఖాతాని కనిష్టంగా రూ.1000 నుంచి ప్రారంభించవచ్చు. అయితే, గరిష్ట పెట్టుబడిపై పరిమితి లేదు.

* ఆదాయపు పన్ను ప్రయోజనం

పోస్టాఫీసు ఎఫ్​డీపై కేవలం అధిక వడ్డీ మాత్రమే కాకుండా పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఐదేళ్ల వ్యవధిలో పోస్ట్ ఆఫీస్ ఎఫ్​డీ పెట్టుబడిపై ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80C కింద ఆదాయపు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి.
Published by:Sambasiva Reddy
First published:

Tags: Bank, Business, Fixed deposits, Interest rates, Post office scheme

తదుపరి వార్తలు